జోగి త‌ర్వాత టార్గెట్ ఎవ‌రు?

గ‌తంలో చంద్ర‌బాబునాయుడి ఇంటిపైకి దండెత్తిన జోగి ర‌మేశ్‌ను స‌ర్కార్ టార్గెట్ చేసింది. అగ్రిగోల్డ్ భూముల వ్య‌వ‌హారంలో జోగి ర‌మేశ్ కుమారుడు రాజీవ్‌ను అరెస్ట్ చేసి ఒక హెచ్చ‌రిక‌ను పంపింది. రెడ్‌బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని వైసీపీ…

గ‌తంలో చంద్ర‌బాబునాయుడి ఇంటిపైకి దండెత్తిన జోగి ర‌మేశ్‌ను స‌ర్కార్ టార్గెట్ చేసింది. అగ్రిగోల్డ్ భూముల వ్య‌వ‌హారంలో జోగి ర‌మేశ్ కుమారుడు రాజీవ్‌ను అరెస్ట్ చేసి ఒక హెచ్చ‌రిక‌ను పంపింది. రెడ్‌బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని వైసీపీ విమ‌ర్శ‌ల్ని తీవ్రం చేసింది. జోగి త‌ర్వాత టీడీపీ టార్గెట్ ఎవ‌రు? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌.

నారా లోకేశ్ రెడ్‌బుక్‌లో ఎవ‌రు పేర్లు ఉన్నాయి? ఏదో ఒక కేసు బ‌య‌టికి తీయ‌డం, అరెస్ట్ చేయ‌డానికి ఏర్పాట్లు చేసుకోవ‌డం. వీటికే స‌ర్కార్ అధిక ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు జోగి ర‌మేశ్ ఓవ‌రాక్ష‌న్ చేశారు. చంద్ర‌బాబు ఇంటిపైకి జ‌నాన్ని తీసుకెళ్లి నానా ర‌భ‌స చేశారు. జోగికి రెండో విడ‌త‌లో మంత్రి ప‌ద‌వి రావ‌డానికి కార‌ణం ఏంటో అప్ప‌ట్లో అంద‌రూ మాట్లాడుకున్న‌దే.

ఇప్పుడు అధికారం పోయి, కేసు మెడ‌కు చుట్టుకునే స‌రికి ఎక్క‌డ లేని మ‌ర్యాద జోగికి గుర్తుకొచ్చింది. చంద్ర‌బాబును చాలా ప‌ద్ధ‌తిగా జోగి మాట్లాడుతున్నారు. ఈ ప‌నేదో అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా చేసి వుంటే బాగుండేది క‌దా! అధికారం శాశ్వ‌తం కాద‌ని ఇప్పుడు మాట్లాడుతున్న జోగికి, అప్పుడు తెలియ‌దా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

జోగి కుమారుడి అరెస్ట్ నేప‌థ్యంలో త‌ర్వాత వంతు ఎవ‌రిదో అని వైసీపీలో కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. లోకేశ్ రెడ్‌బుక్‌లో చాలా మంది నాయ‌కుల పేర్లు ఉన్నాయి. కోడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి…ఇలా చాలా మందే ఉన్నారు. ఎవ‌రెవ‌రిపై ఏఏ కేసులున్నాయి, వాటికి సంబంధించి ఆధారాలు త‌దిత‌ర అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని జైలుకు పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే స్కీమ్‌లా త‌యారైంది.

11 Replies to “జోగి త‌ర్వాత టార్గెట్ ఎవ‌రు?”

  1. Jogi తర్వాత jogini jeggule

    కానీ

    “సాక్షాత్తు మహిళ ఐన Jeggulu ఆ0టీ” పవన్ అంకుల్ తో h*neymoon కోసం లండన్ కి ప్రపోజల్ పెట్టి PASSPORT ready చేసుకుంది.

    Waiting

  2. ఇప్పుడు తాను గౌడ సామజిక వర్గానికి చెందిన బలహీన వర్గాలకు చెందిన వాడినని కులం కార్డు తీసేడు పాపం సార్ కి ఇప్పుడు దాక గుర్తుకు రాలేదు తప్పుడు పనులు చేసి వచ్చినాదికి కులం కాపాడదు

Comments are closed.