రీసర్వే, స్మార్ట్ మీటర్ల మీద వైకాపా కామెంట్?

గతంలో తమ పార్టీ చేసిన ప్రచారాన్ని చాలా కన్వీనియెంట్ గా మరచి, తమ పని తాము స్మూత్ గా చేసుకుంటూ వెళ్తోంది.

2024 ఎన్నికల ముందు విపరీతమైన ప్రభావం చూపించిన ప్రచారం ఏమిటీ అంటే.. లాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది కేంద్రం ప్రతిపాదించినది. రాష్ట్రాలు ముందో, వెనుకో అమలు చేసి తీరాల్సినది. అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లు. ఇది కూడా కేంద్రం వైపు నుంచి వచ్చినదే. ఈ రెండూ కూడా ఎన్నికల టైమ్ లో విపరీతంగా ప్రభావం చూపించాయి.

భూములు అన్నీ జగన్ తీసేసుకుంటాడు అనే ప్రచారం సాగింది. భూమి పత్రాలు ప్రభుత్వం దగ్గర వుంటాయి. జిరాక్స్ లు మాత్రమే జనం దగ్గర వుంటాయి. పాస్ పుస్తకం మీద జగన్ ఫొటో, సరిహద్దు రాళ్ల మీద జగన్ ఫొటో కలిసి ఈ ప్రచారానికి దన్నుగా నిలిచాయి. వైకాపా ఈ ప్రచారాన్ని సమర్ధంగా తిప్పి కొట్టలేకపోయింది. ఓటమి పాలయింది.

ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. జగన్ ప్రభుత్వం చేసిన భూసర్వే ను రీసర్వే అంటోంది. ఎందుకు రీ సర్వే చేయాలి. జగన్ ప్రభుత్వం చేసిన భూ సర్వే క్యాన్సిల్ అంటే సరిపోతుంది కదా? రెవెన్యూ సదస్సులు అంటూ పెట్టి, జగన్ ప్రభుత్వం చేసిన భూ సర్వే మీద అభ్యంతరాలను, లేదా భూ వివాదాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. ఆ నేపథ్యంలో భూముల రీసర్వే అంటూ మళ్లీ మొత్తం భూములు సర్వే ప్రారంభిస్తున్నారు.

అంటే పేరు ఏదైనా భూముల సర్వే అన్నది కామన్. సరిహద్దు రాళ్లు ప్రభుత్వం వైపు నుంచి పాతడం అన్న ప్రతిపాదన నిజానికి మంచిదే. కానీ దాని మీద రాజముద్ర వేసి వుంటే బాగుండేది. జగన్ ఫొటో వేయడం అన్నది తప్పుగా, వైకాపాకు ముప్పుగా మారింది. ఇప్పుడు రీసర్వే చేసిన తరువాత ఎవరి రాళ్లను వాళ్లే వేసుకోవాలంటారో లేదా ప్రభుత్వం వైపు నుంచి రాళ్లు సరఫరా చేస్తారో చూడాలి.

మొత్తం మీద ఏదో రూపంలో భూముల సర్వే అయితే ఆగలేదు. కానీ దీని మీద వైకాపా నుంచి కామెంట్ రాలేకపోతోంది. తమ మీద జరిగిన తప్పుడు ప్రచారాన్ని అప్పుడూ బలంగా ఖండించలేకపోయింది. ఇప్పుడూ మాట్లాడలేకపోతోంది. భూముల సర్వే ఎందుకు అని అడగకుండా తేదేపా ముందుగా, తెలివిగా తాళం వేసింది. వైకాపా చేసిన సర్వేలో జరిగిన తప్పిదాల కోసం రీసర్వే అంటోంది. అంటే ఆ రీసర్వే పేరిట భూముల సర్వేని కొనసాగిస్తోంది.

కనీసం దీన్ని అయినా వైకాపా వివరించలేకపోతోంది.

ఇక రెండో ముచ్చట. స్మార్ట్ మీటర్లు. వైకాపా టైమ్ లో స్మార్ట్ మీటర్లు పెడితే తేదేపా గగ్గోలు పెట్టింది. రైతులను రెచ్చగొట్టారు. ఇప్పుడు చాలా స్మూత్ గా ఒక్కసారే అన్ని చోట్లా కాకుండా మెలమెల్లగా స్మార్ట్ మీటర్లు బిగించుకుంటూ వస్తున్నారు. ముందు కమర్షియల్ కనెక్షన్లు అంటున్నారు. తరువాత హౌస్ కనెక్షన్లు అంటారు. ఆపై అగ్రికల్చర్ అంటారు. మరి వైకాపా ఎందుకు పెదవి విప్పడం లేదు.

ఎందుకంటే వైకాపాకు సమర్ధవంతమైన అధికార ప్రతినిధి ఎవరూ లేరు. గట్టిగా అన్ని విధాలా మాట్లాడగలిగినవారు లేరు. శ్యామల లాంటి యాంకర్ గొంతు ఎంత బలంగా వినిపిస్తుంది? అందుకే ప్రభుత్వంపై గతంలో తమ పార్టీ చేసిన ప్రచారాన్ని చాలా కన్వీనియెంట్ గా మరచి, తమ పని తాము స్మూత్ గా చేసుకుంటూ వెళ్తోంది. వైకాపా నుంచి కామెంట్ రాదు. కానీ గమనించాల్సింది జనం మాత్రమే.

11 Replies to “రీసర్వే, స్మార్ట్ మీటర్ల మీద వైకాపా కామెంట్?”

  1. అధికారం లో ఉన్నప్పుడు అంతా జగనా? ప్రతిపక్షం లో అధికార ప్రతినిధులు కావాలా?ఎం జగన్ స్క్రిప్ట్ చూసి చదివే ప్రెస్ మీట్ లాంటి డమ్మి మీట్ పెట్టొచ్చుగా

  2. నాకు నెల్లూరు జిల్లా లో ౩ ఎకరాల పొలం ఉంది. జ-గ-న్ చేయించిన సర్వే మూలంగా 18 సెంట్స్ తక్కువగా అడంగల్ లో అప్డేట్ అయ్యింది. దాన్ని సరి చేసుకోవడానికి కనీసం 11 సార్లు గ్రామ సచివాలయం, MRO ఆఫీస్ చుట్టూ తిరిగాను. ఇంత వరకూ పని కాలేదు. ఎప్పటికి అవుతుందో తెలీదు.

    మేము కొన్నప్పుడు సర్వే చేసి కొన్నాము, పాసుబుక్ లో ౩ ఎకరాలు ఉంది. లేని పోని ఇబ్బందులు. నాలాగా ఎంతోమంది బాధితులు. అసలు సర్వే ఎందుకు చేసారు అంటే తప్పులు సరి చెయ్యడానికట. బుధ్ది ఉన్నోడు ఎవడైనా కడుపునొప్పి వస్తే దానికి మందులు వేసుకుంటాడు. కంటికి, ముక్కుకు వేసుకోడు. ఎక్కడ ప్రాబ్లెమ్ ఉంటే అక్కడ సొల్యూషన్ ఇవ్వాల్సింది పోయి, లేని వాళ్లకు కూడా సమస్యలు తెచ్చి పెట్టారు. బు-ధ్ది లేని ఎ-ద-వ.. అందుకే 11 ఇచ్చారు.

  3. నాకు నెల్లూరు జిల్లా లో ౩ ఎకరాల పొలం ఉంది. జగన్ చేయించిన సర్వే మూలంగా 18 సెంట్స్ తక్కువగా అడంగల్ లో అప్డేట్ అయ్యింది. దాన్ని సరి చేసుకోవడానికి కనీసం 11 సార్లు గ్రామ సచివాలయం, MRO ఆఫీస్ చుట్టూ తిరిగాను. ఇంత వరకూ పని కాలేదు. ఎప్పటికి అవుతుందో తెలీదు.

    మేము కొన్నప్పుడు సర్వే చేసి కొన్నాము, పాసుబుక్ లో ౩ ఎకరాలు ఉంది. లేని పోని ఇబ్బందులు. నాలాగా ఎంతోమంది బాధితులు. అసలు సర్వే ఎందుకు చేసారు అంటే తప్పులు సరి చెయ్యడానికట. బుధ్ది ఉన్నోడు ఎవడైనా కడుపునొప్పి వస్తే దానికి మందులు వేసుకుంటాడు. కంటికి, ముక్కుకు వేసుకోడు. ఎక్కడ ప్రాబ్లెమ్ ఉంటే అక్కడ సొల్యూషన్ ఇవ్వాల్సింది పోయి, లేని వాళ్లకు కూడా సమస్యలు తెచ్చి పెట్టారు. బుధ్ది లేని ఎదవ.. అందుకే 11 ఇచ్చారు.

  4. ఇప్పుడు సరిహద్దు రాళ్ళు ను తలకిందులుగా పాతితే సరిపోతుంది బొమ్మ కింద కి పోతుంది గా ఈ మాత్రం దానికి కొత్త సరిహద్దు రాళ్ళు ఎందుకు

  5. ఈవీఎం ల సంబరం అయిపొయింది ఓటమికి ఈ కారణం జనాలు నమ్మటం లేదని మళ్ళి కొత్త విషయం వెలికి తీసేరు

Comments are closed.