కరోనా పుట్టుక 2019 డిసెంబర్ 8. అధికారికంగా ఆ రోజే చైనాలో తొలి కేసు నమోదు అయింది. ఇదే ప్రపంచానికి తెలిసిన సంగతి. కానీ లేటెస్ట్ గా అంతకన్నా మూడు నెలలు ముందే కరోనా వ్యాప్తి ప్రారంభం అయిందని అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.
అమెరికా ఇంటిలిజెన్స్ సర్వీస్ కు లేటెస్ట్ గా ఓ సమాచారం అందిందట. దాని ప్రకారం తొలుతగా వూహాన్ ల్యాబ్ లో ముగ్గురు శాస్త్రవేత్తలు కరోనా లాంటి లక్షణాలతో బాధపడ్డారని, అది 2019 డిసెంబర్ కన్నా ముందే అని తెలిసిందట. ఈ విషయాన్ని అప్పటి మంత్రి ఒకరు ఓ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తావనించారని అమెరికా మీడియా కథనం.
అయితే చైనా దీన్ని కొట్టి పారేస్తోంది. అది సహజమే కదా? కరోనా మీద ప్రపంచంలో వచ్చిన ఏ వార్తను కూడా దాదాపు చైనా ఖండించడమే కానీ అంగీకరించింది లేదు. ఇప్పుడు కూడా అదే చేసింది.
కానీ ఇక్కడ చైనా ఒప్పుకుందా లేదా అన్న సంగతి కాదు అసలు విషయం. వూహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ బ్రేక్ అయిందన్న వార్కు ఇప్పుడు బయటకు వచ్చిన ఈ వార్తతో మరింత బలం చేకూరింది.
కరోనా వైరస్ అన్నది సహజంగా వచ్చింది కాదు, హ్యూమన్ క్రియేషన్, హ్యూమన్ ఎర్రర్ ఫలితం అనే అనుమానాలు ప్రఫంచ వ్యాప్తంగా వున్నాయి. ఇప్పుడు మరింత బలపడ్డాయి.