ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉద్యోగులు సాగించిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం, ఉద్యోగులు అన్ని అంశాలపై ఓ ఏకాభిప్రాయానికొచ్చాయి. దీనికి సంబంధించి త్వరలోనే కొత్త జీవో విడుదలకానుంది. 2 ఉద్యోగ సంఘాల అసంతృప్తి మినహా.. మిగతా అందరూ హ్యాపీ. ఈ మొత్తం ఎపిసోడ్ లో మరోసారి చంద్రబాబు తెరపైకొచ్చారు. చర్చలు సక్సెస్ అయిన నేపథ్యంలో నెటిజన్లు చంద్రబాబును గుర్తుచేసుకుంటున్నారు.
మంటలు ఎగదోసి చలి కాచుకోవాలని చూసిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మొన్నటివరకు ఉద్యోగ సంఘాల్ని రెచ్చగొట్టి, తన అను'కుల' మీడియాతో వరుసపెట్టి కథనాలు ఇప్పించిన బాబు… చర్చలు సఫలం అయిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.
“ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చర్చలు సక్సెస్ చేసుకుంటే నా రక్తం పొంగిపోతుంది.”
“కాదండి, మాకు బాధగా ఉండదా అండి. మీరు మీరు మాట్లాడుకొని సెటిల్ చేసుకొంటే నేను, మా ఈనాడు, జ్యోతి, టీవీ5, మా పార్టీ ఏమి కావాలి? ఐ యాం ఆస్కింగ్ స్ట్రెయిట్ క్వశ్చన్.”
“లోకేష్ బ్రీఫ్డ్ మీ. చర్చలు సఫలం అయ్యాయని విన్నాను. మా మద్దతుతో అనుకున్నది సాధించిన ఉద్యోగులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది.”
ఇలా చంద్రబాబు తన మార్క్ స్టేట్ మెంట్స్ తో బయటకొస్తారంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని, తన వల్లే జరిగిందని చెప్పుకునే బాబు.. చర్చలు సఫలమైన అంశాన్ని కూడా వదిలిపెట్టరని, సరైన టైమ్ లో జూమ్ లోకొచ్చి ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుంటారంటూ పంచ్ లు వేస్తున్నారు వైసీపీ జనాలు.
ఈ ట్రోలింగ్స్, జోకుల సంగతి పక్కనపెడితే.. ఉన్నఫలంగా రాత్రికిరాత్రి చర్చలు సఫలం అవ్వడాన్ని చంద్రబాబు నిజంగానే జీర్ణించుకోలేనట్టుంది. ఇప్పటివరకు ఆయన తన స్పందన తెలియజేయలేదు. కనీసం ఆయన పార్టీ కూడా చర్చలపై స్పందించకపోవడం విశేషం. బహుశా దీన్నే కడుపుమంట అంటారేమో. ఉద్యోగులంతా జగన్ కు జేజేలు పలుకుతుంటే చంద్రబాబు చూడలేకపోతున్నారు.