చంద్రబాబు, పవన్ లు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?

భగవంతుడు ఒక తప్పుకి వార్ణింగ్ ఇచ్చి క్షమిస్తాడు. మళ్లీ తప్పు చేస్తే ఇక కష్టం.

చంద్రబాబుని సుప్రీం కోర్ట్ మందలించింది. ఇది వార్త. కానీ ఇది ఈనాడులో వెబ్సైటులో మచ్చుకైనా లేదు. సొంతమనిషిని ఎవరైనా మందలిస్తే రాయలేని పరిస్థితి. రాగద్వేషాలకి అతీతంగా పనిచేయలేని పాత్రికేయం అది. సరే ఎవరి పంథావారిది.

చూస్తే ఏబీయన్, టీవీ5లు కూడా ఇదే పంథాలో ఉన్నాయా అంటే లేవు. ఆ రెండు చానల్స్ ఉన్న విషయాన్ని రిపోర్ట్ చేసాయి. ప్రధాన వార్తగానే డిస్కషన్ పెట్టాయి. టీవీ5 అధినేత బీఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పదవిని ఆశిస్తున్నా కూడా చంద్రబాబు పరువు తీసే ఈ వార్తను చెప్పడం కాస్త ఆశ్చర్యమే.

సరే మీడియాల సంగతి పక్కన పెడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా అయోధ్య రామజన్మభూమి ఓపెనింగ్ నాడే లక్ష తిరుపతిలడ్డూలను పంపారని, వాటిలో పంది కొవ్వు, గోమాంస కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉన్నాయని మీడియా ముఖంగా చెప్పేసాడు.

ఇది ఎంతమంది హిందువుల మనోభావానికి సంబంధించిన విషయం? చెప్పే ముందు సాక్ష్యాలు ఏవి?

రామజన్మభూమి మందిరం జనవరి 2024లో తెరుచుకుంది. కల్తీ ఉందని అనుమానిస్తున్న ఏఆర్ డైరీ నెయ్యి జూలై 2024 నాటిది. అంతకు ముందు ఎప్పుడూ ఈ బ్రాండ్ నెయ్యి తిరుమలకి సప్లై కాలేదు అని ఆధారాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు జనవరి నాటి లడ్డూల్లో వాడిన నేతిలో కల్తీ ఉందని చెప్పడానికి ఆధారమేంటి? సరిగ్గా ఇలాంటి ప్రశ్నే నేడు సుప్రీం కోర్ట్ చంద్రబాబుని అడిగింది.

ఇంతకీ సుప్రీం చంద్రబాబుని ఏమడిగిందో, ఎమన్నదో క్లుప్తంగా చెప్పుకుందాం:

– నెయ్యి “కచ్చితంగా” కల్తీ అయినట్టు సాక్ష్యమేంటి? ఆ నేతిని లడ్డూలో వాడారన్నదానికి సాక్ష్యమేంటి?

– నెయ్యి కల్తీపై అనుమానం వ్యక్తం చేసిన ఒక రిపోర్ట్ మీదే ఆధారపడ్డారా? సెకండ్ ఓపీనియన్ ఎందుకు తీసుకోలేదు?

– లడ్డూలని కూడా కల్తీ పరీక్ష కోసం ల్యాబ్ కి పంపారా?

– జూలైలో రిపోర్టొస్తే సెప్టెంబర్లో చెప్పారెందుకు?

– కచ్చితంగా నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్తూ మళ్లీ నిజానిజాలు తేల్చడానికని చెప్పి సిట్ ఎందుకు వేసారు? అంటే మీరు చెప్తున్నది తప్పా?

– రాజకీయాల్లోకి దేవుడిని ఎందుకు లాగారు? సమగ్రమైన ఆధారాల్లేకుండా మీడియా ప్రకటన ఎందుకు చేసారు?

– ఎన్.డి.డి.బి ల్యాబ్ రిపోర్ట్ మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? మైసూర్ లేదా గజియాబాద్ ల్యాబులనుండి సెకండ్ ఒపీనీయన్ ఎందుకు తీసుకోలేదు?

– కల్తీ ఉన్న నెయ్యిని రిజక్ట్ చేసామని చెప్పాక, ఇక కల్తీ జరిగిందన్నదానికి ఋజువేంటి?

ఈ ప్రశ్నలకి నీళ్లు నమలడం తప్ప సమాధానాలు చెప్పలేని పరిస్థితి. ఏం చెప్పినా అతికినట్టు ఉండదు. దీనిపై సమగ్ర విచారణ అక్టోబర్ 3 కి వాయిదా వేసింది కోర్టు. అంటే కథ ఇంకా అయిపోలేదు. ఇంకేం విషయలు బయటికొస్తాయో, ఈ లోపు తమని తాము కాపాడుకోవడానికి సాక్ష్యాలేమైనా తీసుకొస్తారో తెలియదు.

ఈ ప్రశ్నల్లో చాలామటుకు ప్రశ్నలు మీడియా, సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టులు, ప్రజలు, విశ్లేషకులు అడుగుతున్నవే. కానీ సుప్రీం కోర్ట్ ఆ ప్రశ్నలనే సంధించడం వల్ల వీటికి విలువొచ్చింది. అందుకే, శంఖంలో పోస్తేనే తీర్థమంటారు.

తాను పేల్చాల్సిన బాంబేదో పేల్చేసి చంద్రబాబు తప్పుకున్నారు. ఆ విస్ఫోటనం తాలూకు వేడి చల్లారకుండా చూడమని ఉప ముఖ్యమంత్రి పవన్ కి అప్పజెప్పారు. ఆయనేమో సనాతనధర్మ పరిరక్షకుడిని అంటూ దీక్ష పట్టి గెటప్ మార్చారు.

నేటి సుప్రీం ప్రశ్నల అనంతరం, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఒకతను సుబ్రహ్మణ్య స్వామికి ట్యాగ్ చేస్తూ, పవన్ అయోధ్యకి పంపిన తిరుమల లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని నొక్కివక్కాణించిన వీడియో బైట్ ని పెట్టి, “ఇతని మీద కూడా సుప్రీం లో ఒక కేసు పెట్టండి” అని అడిగాడు.

నిజమే మరి. ఆధారం లేకుండా అంత పెద్ద అభియోగం వేస్తే ఆ దెబ్బ తగిలింది వైకాపాకి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి.

తుపాకి పేలిస్తే గురిపెట్టిన చోట తప్ప, తమతో సహా మిగతా అంతా పేలిపోయినట్టయ్యింది. ఎందరో హిందువులు డిస్టర్బ్ అయ్యారు. తాము నిజంగానే జంతుకొవ్వు తిన్నామేమోనని శ్రీవైష్ణవులు, శాకాహారులు మాత్రమే కాదు ప్రసాదాన్ని పవిత్రంగా భావించే యావన్మంది హిందువులు బాధతో నలిగిపోయారు. రమణదీక్షుతులైతే కంట తడి పెట్టారు. ఆ భావోద్వేగం అలాంటిది. ముఖ్యమంత్రి హోదాకు, ఆయన మాటకు విలువనిచ్చే సమాజం అలాగే రియాక్టవుతుంది.

సాక్ష్యం లేకుండా, కేవలం రాజకీయ అస్త్రంగా లడ్డూ ప్రసాదంపై ఇంతటి అభియోగం మోపుతారని ఎవ్వరూ అనుకోరు. అంతటి సమర్ధుడే చంద్రబాబు అని అనుకునే వాళ్లు కూడా సర్వం ఓడి మూలన కూర్చున్న వైకాపాపై ఇప్పుడీ నిందవేయడం రాజకీయంగా ఎటువంటి లబ్ధి చేకూర్చదని నమ్మేవాళ్ళే ఎక్కువ. అందుకే, బాబు మాటల్ని అధికశాతం ప్రజలు మొదట పూర్తిగా నమ్మారు.

వైకాపా అభిమానులు కూడా, నిజంగా వైకాపా కాలంలో ఆ తప్పు జరిగి ఉంటే ఆ పని చేసినవాళ్లు నాశనమైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. పార్టీలకతీతంగా ఎవరు ఆ తప్పు చేసినా క్షమించేది లేదని కలియుగ దైవాన్ని అన్నిటికంటే పెద్ద శక్తిగా భావించిన ప్రతి హిందువు అనుకున్నాడు.

భూమన కరుణాకర రెడ్డి కూడా ఇలాంటి మాటలే అంటూ తిరుమలలో ప్రతిజ్ఞ చేసాడు.

అవధాని మాడుగుల నాగఫణి శర్మ అయితే టీవీ5 స్టూడియోలో కూర్చుని లైవ్ లో తిరుమల లడ్డూ ప్రసాదం తింటూ, “భక్తులెవ్వరూ సంశయించవద్దు. ఆ ప్రసాదపు రోజులు పోయాయి. ఇప్పుడు మనం తీసుకుంటున్నది శుద్ధమైన స్వామి అనుగ్రహపాత్రమైన ప్రసాదం” అంటూ తిని చూపించారు. అంతటి సరసతీపుత్రుడు, జ్ఞాని, ధర్మశాస్త్రం చదువుకున్నవాడు కూడా చంద్రబాబు మాటల్ని నమ్మి ఇంకేమీ స్వీయచిత్తంతో ఆలోచించకుండా ఈ మాటలన్నారు. ఇక మామూలు మనుషుల పరిస్థితి ఏవిటి?

ఈ తంతంతా ముగిసాక నింపాదిగా ఆలోచించి, సోషల్ మీడియాలో పలు వాదనలు విన్నాక కొందరికి మబ్బులు విడడం మొదలయ్యాయి. ఇదేదో తప్పుడు ఆరోపణే అని అనుమానించడం మొదలుపెట్టారు.

ఆ అనుమానాలనే సుప్రీం ప్రశ్నలుగా సంధించింది. ఇప్పుడు చంద్రబాబు వైపు వకీల్ సాబ్ లు ఏం చెప్తారో చూడాలి అక్టోబర్ 3న.

పవన్ కళ్యాణ్ విషయానికొద్దాం. సనాతనవాదిగా తనను తాను మార్చుకున్న ఈ చెగువేరా అభిమాని ప్రస్తుతం దీక్షలో ఉన్నారు. అలా ఉంటూనే హరిహరవీరమల్లు షూటింగ్ కూడా చేస్తున్నారు. దీక్ష చేస్తూ హీరోయిన్ సమేతంగా షూటింగేవిటో? అంటే అది కేవలం రాజకీయ దీక్షా? నిజమైన సనాతనవాదైతే ఇలాగే చేస్తాడా? ఇదేనా చిత్తశుద్ధి?

“వందేభారత్ రైల్లో చిడతలు వాయిస్తూ కామెడీ చేసిన కొంపెల్ల మాధవీలతకి, ముత్తైదువలా గుడి మెట్లు కడిగి హడావిడి చేసిన పవన్ కళ్యాణ్ కి తేడా ఏమీ కనపడట్లేదు” అని సోషల్ మీడియాలో ఒక వ్యాఖ్య.

సినిమాల్లో హీరో చెబితే ప్రజలంతా ఫాలో అయిపోయినట్టు, నిజజీవితంలో జరగదు. ఏ మాట అనాలన్నా ఆలోచించాలి. జనం సాక్ష్యాలు అడుగుతారు. మరేదో విషయమైతే సరే. సాక్షాత్తు తిరుమల వెంకన్న విషయంలో రాజకీయాభిమానాన్ని పక్కపెట్టి కూడా ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఎంత చంద్రబాబు అభిమానికైనా తిరుమల వెంకటేశ్వరుడు తర్వాతే. తేడా వస్తే ఊరుకోరు.

అయినా సనాతనవాది పవన్ కళ్యాణ్ కి 2003లో చంద్రబాబు హయాములో తిరుమలలో వేయికాళ్లమంటపాన్ని కూల్చడం సనాతనధర్మంపై దాడి అనిపించలేదా? ఆ పని చేసినందుకు అప్పట్లో ఎందరో సనాతనవాదులు బాధపడ్డారు. అలిపిరి నక్సల్ బ్లాస్ట్ జరగడానికి కూడా వేయికాళ్లమంటపం కూల్చివేతే కారణమని చెప్పుకున్నారు.

“భగవంతుడు ఒక తప్పుకి వార్ణింగ్ ఇచ్చి క్షమిస్తాడు. మళ్లీ తప్పు చేస్తే ఇక కష్టం. వేయికాళ్లమంటపం విషయంలో అప్పుడు అలా అయింది. ఇప్పుడిది ప్రసాదం విషయం. నిజంగా తప్పు జరిగుంటే ఆ తప్పు చేసిన వాళ్లని గోవిందుడు క్షమించడు. ఒకవేళ చంద్రబాబుది నిరాధారమైన రాజకీయ ఆరోపణ అయితే ఆయన తక్షణం చేసిన తప్పు మీడియా ముఖంగా ఒప్పేసుకోవడం మంచిది. అలా కాకుండా నిరాధారమైన విషయం అని తెలిసినా ఆధారాలు పుట్టించి తన మాటని నిజం చెయ్యాలనే ప్రయత్నం చేస్తే న్యాయస్థానాల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ భగవంతుడి నుంచి తప్పించుకోవడం ఈ సారి కష్టం” అని ఒక సిద్ధాంతి ఉవాచ.

చంద్రబాబుగారి నిర్ణయం ఏదైనా కావొచ్చు. ఆయనిష్టం.

కొందరు ప్రజలు ఇప్పటికైనా ఏకపక్ష ధోరణితో కాకుండా భిన్న కోణాల్లో ఈ విషయాన్ని పరిశీలించి, సుప్రీం అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఏం చెప్తారో చూడాలి.

వేంకటాద్రి సమం స్థానం
బ్రహ్మండే నాస్తి కించన
వేంకటేశ సమో దేవో
న భూతో న భవిష్యతి

– శ్రీనివాసమూర్తి

82 Replies to “చంద్రబాబు, పవన్ లు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?”

  1. ” కచ్చితంగా నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్తూ మళ్లీ నిజానిజాలు తేల్చడానికని చెప్పి సిట్ ఎందుకు వేసారు? అంటే మీరు చెప్తున్నది తప్పా”

    ఉద్దేశ్యపూర్వక కల్తీనా? ఏ స్థాయిలో ఎవరు ఎలా కల్తీ చేస్తున్నారనేగా committee తేల్చాల్సింది.

    ఒక్క report చూసి కల్తీ జరిగిందని ప్రశ్నించే courtx పూర్తి స్థాయిలో దర్యాప్తు ఎందుకు అని ప్రశ్నించడం విదూరం.

    “ మైసూర్ లేదా గజియాబాద్ ల్యాబులనుండి సెకండ్ ఒపీనీయన్ ఎందుకు తీసుకోలేదు?”

    ఏ laboratory నుండి తీసుకోవాలో courtx వారికి అంత అత్యుత్సాహం ఉన్నప్పుడు వారే committee వేసేయొచ్చుగా.. మరల కేంద్రాన్ని అడగటం దేనికి?

    1. చెప్పుతో కొడతాం నా కొడకా, మల్ల ఎప్పుడైనా మా దేవుడితో చెలగాటం అదితే..ఆడు బాబు అయినా, నీ బాబు అయినా, వదిలేది లేదు.

  2. “ జూలైలో రిపోర్టొస్తే సెప్టెంబర్లో చెప్పారెందుకు?”

    అంటే JULY లోనే ప్రకటించి September లో committee వేస్తే పర్లేదా? అడగాల్సింది అప్పుడే ఎందుకు నిర్ధారణ committee వేయలేదని. సాక్షి చూసి ప్రశ్నలు అడిగినట్లుంది.

  3. “ జూలైలో రిపోర్టొస్తే సెప్టెంబర్లో చెప్పారెందుకు?”

    Report TTD ki August starting lo vachi untundi idi sensitive issue ani CMO ki cheppi untaru appudu varadala busy lo undi meeru check chesi fool proof ga report ivvandi ani untaru anduke late ayyi undachu

  4. చీనివాసం కొంచెం షుగర్ ఆపుకుని ఉంటె బాగుండేది ఆల్రెడీ మీరు చెప్పిన పేపర్ లో వేశారు …ఒకసారి చూసుకొని తరించండి…..మన సైట్ లో ను యాక్చీ లో మాత్రం రాగద్వేషాలకు అతీతం గ అన్ని వేసేస్తారు …

  5. అయోధ్య వివాదం 140 ఏళ్ళ క్రితం జరిగితే మొన్న తీర్పు ఇవ్వటమేమిటి ఇన్నేళ్లు నిద్రపోతున్నారా ?

    జగన్ రెడ్డి సిబిఐ , ఈడీ లలో 15 అవుతున్న ఎక్కడ తీర్పు ? రెండు నెలలకే అడిగి నైతిక హక్కు ఏ రాజ్యాంగం ఇచ్చింది

  6. వివేకా హత్య చేసింది చంద్రబాబు అని విచారణ చేయకుండా జగన్ రెడ్డి ఎలా చెప్పాడు ? సుప్రీమ్ కోర్ట్ దీనిపైనా ఏమి స్పందిస్తుంది ?

  7. వ్యవస్థల్ని జగన్ మనిపులెట్ చేస్తున్నాడని మేమూ అనొచ్చు కదా.

      1. మరి పవర్ లో ఉండి కూడా గత ఐదేళ్లు చంద్ర బాబు వ్యవస్థల్ని మేనేజ్ చేసాడు అని మీరు అనలేదా? పైగా అపుడు మోడీ సిబియన్ నీ అసలు పట్టించుకునేవాడు కాదని అందరికీ తెలుసు.

  8. Seva, darshan and rooms tariff increased and ghee purchased with low cost and diverted TTD funds to political benefits. Food and milk stopped supplying for the devotees in Q lines. Many are coming forward to support these damages to our Kaliyuga Vaikuntam. Still the devotees of Lord Srinivasa not realised, waste fellows are eagerly trying to damage our Vaikuntam further to what extent they can.

  9. అబ్బే వాల్ల ఆశలు వాళ్ళు పురమాయించిన సిట్ పైనే ఉన్నాయి… వాల్ల బురద తీసుకుని మళ్ళి రొచ్చు చేయడమె ..

  10. స్వామి వారికి, కోట్ల మంది భక్తులు కి నిజమైన నికార్సైన న్యాయం చేశాడు చంద్రబాబు గారు.తప్పు జరుగుతుంది అని ,లడ్డూ లో నాణ్యత పోయింది, కల్తీ అని, కొండ మీద ప్రశాంత వాతావరణం లేదని,ఆధ్యాత్మిక చింతన కరువైంది అని ,అన్య మతస్తులు లో చేతుల్లో టీటీడీ బందీ అయిందని తెలిసినా ఎవరూ బయటికి చెప్పలేక పోయే వారు. చంద్రబాబు గారు పుణ్యమా అని ఇప్పుడు తిరుమల ప్రక్షాళన కి పూనుకున్నారు.చంద్రబాబు గారి చర్యలు వలన కోట్ల మంది భక్త హృదయాలు స్థిమిత పడ్డాయి. చంద్రబాబు గారికి మా జీవితం అంతా రుణ పడి వుంటాం.💐

    1. ముందు ఎక్కడికి పోయావు తప్పు ఉంటే సుప్రీమ్ కీ వెళ్ళండి అప్పుడే చిల్లర రాజకీయ్యాలు కోసం మా హిందువులు పూజించే దేవుడు ని లాగాడు నీచుడు బాబు

  11. హత్యలు , ఆర్థిక నేరాలు చేసిన నీచుడు జగన్ రెడ్డి కళ్ళు మూసుకోవచ్చు , నిజాయితో గా ల్యాబ్ రిపోర్ట్ తో నిజాలు చెప్పినందుకు ఈ చెత్త కామెంట్స్ ఆ ?

  12. Supreme court lo judge devudu kadhu kadha? They need proofs not truth.

    100% as a CM jagan failed to maintain quality in annaprasadam and tirupati laddu.he encouraged other religion people in tirumala as a business people not a devotee. Because he is a Christian.he does not know the value of santana dharma.

  13. లడ్డు నాణ్యత… తగ్గిన మాట మాత్రం వాస్తవం… ఇంక కొవ్వు కలిసిన ఆధారాలు అయితే మాత్రం ఇంతవరకు లేవు అన్నది కూడా నిజం

    మరి బాబు, పవన్ భాద్యత వహించాలి

  14. దొంగ పట్టుబడనంత మాత్రాన మంచోడు అయిపోడు లడ్డులు గతం లో తిన్న వాళ్లకు వైసీపీ ప్రభుత్వం లో తిన్న లడ్డు ను compare చేసుకోకుండా వుండరు వాళ్లకు తెలుసు దొంగ ఎవరో 320 రూపాయలకు స్వచ్ఛమైన ఆవునెయ్య ఇప్పుడు ఇస్తారో లేదో తెలిసి పోతుంది పోటులో వున్నా కార్మికులకు తెలుసు

  15. కూటమి నాయకులు గత ప్రభుత్వం మీద చేసిన అసత్య ప్రచారాలు లో ముఖ్యమైనవి

    ఇసుక రేటు ఎక్కువ దానివల్ల భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.. భవన నిర్మాణాలు ఆగిపొయ్యాయి అభివృద్ధి కుంటుపడింది

    ఇప్పుడు ధరలు గత ప్రభుత్వం కంటే దారుణం గా ఉంటున్నాయి ఫెయిల్ అయ్యారు..

    అన్ని వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి.. అని ప్రచారం చేసారు అది రాష్ట్ర ప్రభుత్వ పరిధి లో లేకపోయినా ..

    ఇప్పుడు ఇంకా మాడు పగులుతున్నాయి.

    ఇంకా న్యూట్రల్ మేధావులు కి వాలంటీర్లు వ్యవస్థ అంటే భయమేసి వాళ్లు ఏం మాట్లాడారు అంటే వాలంటీర్ వ్యవస్థ కి వ్యతిరేకం కాదు 5000 జీతం తక్కువ పది వేలు ఇవ్వాలి అన్నారు.. కూటమి కూడా ఎన్నికలు అప్పుడు పది వేలు ఇస్తాం అన్నారు .. ఇప్పుడు ఆ వ్యవస్థ నే కనుమరుగు చేస్తున్నారు..

    ఇక్కడ ఫెయిల్

    కరెంట్ ఛార్జ్ లు పెంచుతున్నారు.. మేము వస్తె పెంచము అన్నారు.. ట్రూ అప్ ఛార్జ్ లు అనేవి 2014-19 మధ్య లో ఎక్కువ రేట్ కి కొన్నారు చెల్లింపులు జరపల్సిందే అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా వినలేదు.. ppa లు రద్దు చెయ్యడానికి ప్రయత్నిస్తే కోర్టు కి వెళ్లారు…

    ఇప్పుడు ఏమైంది .. చార్జెస్ వేస్తున్నారు

    ఇంకా చాలా ఉన్నాయి … గత ప్రభుత్వం మీద చేసిన విషప్రచారాలు మీరు వచ్చాకా ఏదైనా empathy తో సరి చేస్తున్నారా అంటే అది కుదరని పని

    మొత్తం గా చెప్పేది ఏంటి అంటే మీకు పరిపాలన చేతకాదు.. మీ టైమ్ అంతా జగన్ గారి మీద దుమ్మెత్తి పోయడమే మిగిలింది

    Financial deciplain main issue.. మీ వల్ల కాదు

    1. ప్రజలు చాల తెలివి అయినోళ్ళు ఎ ప్రచారం ఎలాంటి ఆధారం లేని దే నమ్మరు నువ్ ఆవేశం స్టార్ లా ఉన్నావ్

    2. జగన్ గారు అనకు బ్రో, వాడోక చేతకాని దద్దమ్మ, గత ఐదు సంవత్సరాలు ఒక పీడ కల. పెళ్లి అవగానే పిల్లలు ఏరి అన్నట్టుంది నీ వాదన, ఒక సంవత్సరం ఆగి జడ్జిమెంట్ ఇవ్వు

  16. It is heard in media that this is just to divert the attention of AP people on his 100 days ruling from his failure on promises he has given and to hide Amaravati flood affected.

    It is in the media that whole CBN’s political career happening with publicity stunt at state and national levels. With his sound media support he can manage any system which even cannot be managed by national level top political person

  17. ఆంద్రుల “విజ్ఞత, విచక్షణ”

    పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబుకి, బీజేపీలోని కొంతమంది మత రాజకీయం చేసే అజ్ఞానులకి చెంపపెట్టు

    సరిగ్గా ఏడాది క్రితం తప్పుడు సమాచారంతో కూడిన సోషల్ మీడియా పోస్ట్ కారణంగా హరియాణలో మత కలహాలు చెలరేగి 6 మంది బలయ్యారు.. ఆస్తుల దహణం ఏదేచ్చగా సాగింది.

    ఇక్కడే ఆంధ్రులు ఎంత విజ్ఞులో అర్ధం చేసుకోవచ్చు, సాక్ష్యాత్తు చంద్రబాబే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తమ ఆరాధ్య దైవానికి సంభందించిన విషయంలో తమ మనోభావాలు దెబ్బతినేలా తప్పుడు సమాచారంతో కూడిన స్టేట్మెంట్ ఇచ్చినా ప్రజలు సమన్వయం, విచక్షణ కోల్పోలేదు.

    ఏకంగా పవన్ కళ్యాణ్ … మీకు కోపం రావడంలేదా.. మీకు ఆవేదన కలగడంలేదా అంటూ హిందువుల మనోభావలు రెచ్చకోట్టే ప్రయత్నం చేసినా ఏ హిందూ సమన్వయం, విచక్షణ కోల్పోకుండా నిజాల కోసం ఓపికగా ఏదురు చూశారు. నేడు నిజం సుప్రీం కోర్టు ద్వారా బయటికి వచ్చింది.. రెచ్చకోట్టిన వాళ్ళే దోషులుగా తేలే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఉత్తర ప్రదేశ్ , హరియాణ , లాంటి రాష్ట్రాల్లో జరిగి ఉంటే మతాల మధ్య మారణ హోమమే జరిగేది.

    ఆంధ్రుల విజ్ఞత, విచక్షణే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా నిలిచింది. ఇప్పటికైనా మతోన్మాద శక్తులు గుర్తించాలింది ఎంటంటే.. ఆంద్రుల దగ్గర మీ మతతత్వ రాజకీయాలు చెల్లవని..

    ప్రజల దగ్గర అబద్దాలు చెబుతూ రాజకీయం చేసినట్టు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విషయంలో సత్య దూరమైన ఆరోపణలు చేస్తూ నీచమైన రాజకీయం చేస్తే కుదరదని ఆ వెంకన్న స్వామే నేడు దేశం మోత్తం వినపడేలా చెప్పారు..

    ఓం నమో వేంకటేశాయ!!🙏🙏

    #TirumalaTemple #tirumalaladdu

    #TirumalaLadduControversy

    #cbnshouldapologizehindus

    #CBNDestroyedAPin100Days

  18. ఆంద్రుల “విజ్ఞత, విచక్షణ”

    పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబుకి, బీజేపీలోని కొంతమంది మత రాజకీయం చేసే అజ్ఞానులకి చెంపపెట్టు

    సరిగ్గా ఏడాది క్రితం తప్పుడు సమాచారంతో కూడిన సోషల్ మీడియా పోస్ట్ కారణంగా హరియాణలో మత కలహాలు చెలరేగి 6 మంది బలయ్యారు.. ఆస్తుల దహణం ఏదేచ్చగా సాగింది.

    ఇక్కడే ఆంధ్రులు ఎంత విజ్ఞులో అర్ధం చేసుకోవచ్చు, సాక్ష్యాత్తు చంద్రబాబే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తమ ఆరాధ్య దైవానికి సంభందించిన విషయంలో తమ మనోభావాలు దెబ్బతినేలా తప్పుడు సమాచారంతో కూడిన స్టేట్మెంట్ ఇచ్చినా ప్రజలు సమన్వయం, విచక్షణ కోల్పోలేదు.

    ఏకంగా పవన్ కళ్యాణ్ … మీకు కోపం రావడంలేదా.. మీకు ఆవేదన కలగడంలేదా అంటూ హిందువుల మనోభావలు రెచ్చకోట్టే ప్రయత్నం చేసినా ఏ హిందూ సమన్వయం, విచక్షణ కోల్పోకుండా నిజాల కోసం ఓపికగా ఏదురు చూశారు. నేడు నిజం సుప్రీం కోర్టు ద్వారా బయటికి వచ్చింది.. రెచ్చకోట్టిన వాళ్ళే దోషులుగా తేలే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఉత్తర ప్రదేశ్ , హరియాణ , లాంటి రాష్ట్రాల్లో జరిగి ఉంటే మతాల మధ్య మారణ హోమమే జరిగేది.

    ఆంధ్రుల విజ్ఞత, విచక్షణే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా నిలిచింది. ఇప్పటికైనా మతోన్మాద శక్తులు గుర్తించాలింది ఎంటంటే.. ఆంద్రుల దగ్గర మీ మతతత్వ రాజకీయాలు చెల్లవని..

    ప్రజల దగ్గర అబద్దాలు చెబుతూ రాజకీయం చేసినట్టు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విషయంలో సత్య దూరమైన ఆరోపణలు చేస్తూ నీచమైన రాజకీయం చేస్తే కుదరదని ఆ వెంకన్న స్వామే నేడు దేశం మోత్తం వినపడేలా చెప్పారు..

    ఓం నమో వేంకటేశాయ!!🙏🙏

    #TirumalaTemple #tirumalaladdu

    #TirumalaLadduControversy

    #cbnshouldapologizehindus

    #CBNDestroyedAPin100Days

  19. చంద్రబాబు చక్కగా ycp కి నైతిక బలం చేకూర్చాడు at the cost of his own trust.babu and pavan for loosing out nuetral voters trust and gave much needed ammunition to political rivals.

  20. Supreme court ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వ నీదు మీకు . కేవలం బాబు అలా వకాయణించ కూడదు .విచారణ కు ఆటంకం అది అంది అంతే . అలా అయితే cbn కేసుల్లో డైరెక్ట్ గా వేల కోట్లు తి బేసారు అని స్వయానా ప్రభుత్వం.లాయర్ కు. ఎంక్వైరీ ఆఫీసర్లు ప్రెస్ మీట్లో చెప్పే వారు . అయినా విచారణ ఆగదు. తిరుపతి లడ్డు కల్తీ అయింది అని చిన్న పిల్లాడికి కూడా తెలుసు. మీరు covering ఆలోచ్చు

  21. Gadhcina 50 yelli నుండి. నందిని నెయ్యి మాత్రమే సరఫరా అవుతుంది . దాన్ని తప్పించి వేరే కంపెనీ కి అతి తక్కువ ధరకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ధీర వారు చెప్పాలి ఇక సామాన్య భక్తులు ఎప్పుడో చేపరు ఇది తేడా గా ఉంది అని .s value heck చేస్తే 19 నుండి 22 ఉంది కల్తీ అయితే ఖాయం గా చేసారు

  22. By polluting hindu minds planned to gain political mailage. Babu got into over confidence with mighty media support, jgot boomaranged. Now nuetral voters also think twice before simply believing babu future claims. Court comments gave opponents expecially ycp gained much needed moral strength in this sensitive topic. Babu and Co. gave much needed ammunition to prove that laddu కల్తీ is created one for political gains.

  23. ఇంతకు..ముందు..తెలుగు..రాష్ట్రాల్లో..ఒక్క..చీడపురుగు..మాత్రమే..ఉండేవాడు, ఇప్పుడు..ఇద్దరు..అయ్యారు.ఈ..రాష్ట్రాన్ని..జగన్..తప్ప..ఇంకెవరు..కాపాడలేరు.

    1. కాపాడలేరు కాదు బ్రో నాశనం చేయలేరు..అని వ్రాయాలి ..ఆంధ్ర కి పట్టిన శనీ పోయింది ..

  24. గత ప్రభుత్వ హయాం లో ప్రతి కోర్ట్ వైసీపీ గవర్నమెంట్ డెసిషన్ ని ఆల్మోస్ట్ చెప్పుతో కొట్టింది, అప్పుడు నువ్వు అస్ ఇట్ ఇస్ కవర్ చేశావా ఎంకటి..

    సిబిఐ కి ఇస్తే మేనేజ్ చేసేయొచ్చని లెవన్ గాళ్ల కాన్ఫిడెన్స్ 

  25. గత-ప్రభుత్వ-హయాం-లో ప్రతి-కోర్ట్-వైసీపీ గవర్నమెంట్-డెసిషన్-ని-ఆల్మోస్ట్-చెప్పుతో కొట్టింది, అప్పుడు-నువ్వు-అస్-ఇట్-ఇస్-కవర్-చేశావా-ఎంకటి..

  26. How can anyone test Laddoo LOL. Laddoo likely will have 5% of Ghee and 95% of other ingradients. You can not find beef fats with in 5%. The is too low to be detected. Ghee is the ideal sample to test. If one lab tests positive for beef tallow, others should test the same. The same supplier is supplying for long time, so logically contaminated Ghee was being used in laddoos.

    1. Lab report said the contamination *might* be from vegetable oils or fish oil or beef or pork.. they were not sure. The lab also said the negative results could also be because of the cows were underfed or overfed etc etc.. so many ifs and buts..

      also this was the first delivery from the supplier in question AR foods.. so there is nothing to suspect the laddoos have been contaminated for a long time

  27. హూ కిల్డ్ బాబాయ్ అంశం కూడా మొదటి విచారణలో తేలలేదు… తర్వాత కదా తెలిసింది… చంపినోడు… చంపించినోడు అన్నదమ్ములే అని. ఇళ్ళు అలకగానే పండగ వచ్చేసింది అని కొత్త చీర కట్టేసుకోకు… దూల తీర్చే పండగ రానీ… తీరిపోద్ది గట్టిగా!

Comments are closed.