అర్థం పర్థం లేని ఈటల సవాళ్లు!

‘ఒక చిత్రకారుడి అసంపూర్ణ చిత్రాన్ని చూడకూడదు’ అనేది సామెత! తాను గీయదలచుకున్న చిత్రం పూర్తయితే ఎలా ఉంటుందనే సంగతి ఆ చిత్రకారుడికి తప్ప మరొకరికి తెలియదు. ఆ చిత్రాన్ని చూసి ఆనందించదలచుకున్నవాళ్లు గానీ, విమర్శించదలచుకున్న…

‘ఒక చిత్రకారుడి అసంపూర్ణ చిత్రాన్ని చూడకూడదు’ అనేది సామెత! తాను గీయదలచుకున్న చిత్రం పూర్తయితే ఎలా ఉంటుందనే సంగతి ఆ చిత్రకారుడికి తప్ప మరొకరికి తెలియదు. ఆ చిత్రాన్ని చూసి ఆనందించదలచుకున్నవాళ్లు గానీ, విమర్శించదలచుకున్న వాళ్లుగానీ.. చిత్రం గీయడం పూర్తయ్యేదాకా ఆగాలి. అంతే తప్ప రంగులు కలిపి.. సగం రంగులను కేన్వాస్ మీద పులిమినప్పటికే దానిని చూస్తే ఆ చిత్రం యొక్క అందం ఎలా తెలుస్తుంది? అనేదే ఆ సామెత చెప్పే నీతి!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు.. అసంపూర్ణ చిత్రాన్ని చూడడం మాత్రమే కాదు కదా.. దాని మీద జడ్జిమెంట్ కూడా కోరాలని ఆత్రపడిపోతున్నారు. అందుకే బిజెపి ఎంపీ ఈటల రాజేందర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విసురుతున్న సవాళ్లు అర్థం పర్థం లేకుండా ఉంటున్నాయి.

మూసీ నది పరిరక్షణకు రేవంత్ రెడ్డి సర్కారు ఒక బృహత్ యజ్ఞం చేపట్టిన సంగతి తెలిసిందే. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న పేదల ఇళ్లను కూలగొట్టిస్తున్నారు. అదే క్రమంలో వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కూడా కేటాయిస్తున్నారు. అంతా సాఫీగానే జరుగుతున్నది. హైడ్రా కూల్చివేతలు మొదలైన తర్వాత.. పాతబస్తీ ఆక్రమణల మీదకు వెళ్లే దమ్ముందా అంటూ బీరాలు పలికిన బిజెపి నేతలు.. ఇప్పుడు మాత్రం భిన్నంగనా మాట్లాడుతున్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో కూల్చివేతలు జరుగుతోంటే.. పేదల నోరు కొడుతున్నారని మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ఒక సవాలు విసిరారు.

రేవంత్ కు దమ్ము ధైర్యం ఉంటే, తనతో కలిసి సెక్యూరిటీ లేకుండా మూసీ వద్ద కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతానికి రావాలని.. ప్రజల అసలు స్పందన ఏమిటో అప్పుడు తెలుస్తుందని ఈటల అంటున్నారు. ఆయన తొందర చూస్తోంటే.. అసంపూర్ణ చిత్రాన్ని జడ్జి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగానే ఉంది.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. హైదరాబాదు నగరాన్ని ఒక అందమైన చిత్రంలా తీర్చిదిద్దాలని అనుకున్నారు. ఓ అరగంట వాన కురిస్తే.. జలమయం అయి, మడుగుల్లా మారిపోయే రోడ్లు, దుర్మార్గమైన డ్రైనేజీ వ్యవస్థ.. వేసవికి రెండు నెలల ముందే ఎండిపోయే భూగర్భ జలాలు, సమస్తం ఆక్రమణలు అయిపోయిన చెరువులు ఇలాంటి దుర్మార్గాలను తుడిచిపెట్టేయాలని అనుకున్నారు. ఈ చిత్రం మొత్తం గీయడం పూర్తయితే తప్ప, ఆ స్వప్నం మొత్తం పూర్తయితే తప్ప.. ఆయన సంకల్పం యొక్క ఫలితాలు అర్థం కావు.

కూల్చివేతలు మొదలుపెట్టినప్పుడు రావాలని సవాలు విసురుతున్న ఈటల.. మరి కొన్నేళ్లు పూర్తయిన తర్వాత.. హైదరాబాదు వాస్తవ స్థితిగతులు మారిన తర్వాత.. సీఎం రేవంత్ తో కలిసి పర్యటించడానికి సిద్ధమేనా అనే కౌంటర్లు వస్తున్నాయి. కూలుస్తున్న సమయంలో మూసీ వద్దకు కాదు, ఎన్ కన్వెన్షన్ వంటి చోట్లకు వెళ్లినా ప్రతిఘటన ఉంటుందని, ఈటల రాజేందర్ మొసలి కన్నీరు కార్చడం మానేసి.. ప్రభుత్వం చేస్తున్న పనిలో తప్పులు జరగకుండా చూస్తే మాత్రం చాలునని ప్రజలు అనుకుంటున్నారు.

6 Replies to “అర్థం పర్థం లేని ఈటల సవాళ్లు!”

  1. ఆ రంగులు ఏదో వాడి మొఖాన పులుముకుంటే ఎవడికీ నష్టం లేదు. మొత్తం పూర్తి అయ్యాక చూసి చెప్తాం ఎలా ఉందో.. మా మొఖాన పులుముతూ మొత్తం పూర్తి అయ్యాక నువ్వు మహేష్ బాబు లెక్క ఉంటావ్.. అప్పటి దాకా ఆగు అంటేనే సమస్య. ఎందుకంటే అది అయ్యాక మనం అలా లేకపోతే, ఇంకా దారుణం గా పొక్కులు, దద్దుర్లు వచ్చి ఇన్‌ఫెక్షన్ వస్తే వాడికి పోయేది ఏం లేదు.

  2. మీ తల్లి కాంగ్రెస్ సీఎం కి మద్దతు గా ఏవేవో పిచ్చి రాతలు రాస్తే సరిపోదు, ఈటల సవాలు ఎలా తప్పో వివరించాలి. పాత బస్తీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లడం గురించి రాయండి!

Comments are closed.