అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ పార్టీ, ప్రధానంగా రేవంత్ రెడ్డి అండ్ కో, కేసీఆర్ అండ్ కో చాలా ఘనంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ప్రాజెక్టులో భాగమైన బరాజ్ లు కుంగిపోయాయని, ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలన్నీ వాస్తవమే.
కాంగ్రెస్ అదృష్టమో, కేసీఆర్ పై ప్రజా వ్యతిరేకతోగానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ సీఎం అయ్యాడు. పార్టీపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా రేవంత్ కు కేసీఆర్ శత్రువు కాబట్టి ఆయన అంతు చూడాలనుకున్నాడు. కేసీఆర్ హయాంలో జరిగిన కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ వేశాడు.
విచారణ కమిషన్ ఎదుట హాజరు కావడం ఇష్టం లేని కేసీఆర్ సుప్రీం కోర్టు దాకా వెళ్లి కమిషన్ రద్దు చేయించాలనుకున్నాడు. కానీ కోర్టు కమిషన్ రద్దు కాదని, జస్టిస్ నరసింహా రెడ్డిని తొలగించింది. ఆయన స్థానంలో ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ జడ్జి మదన్ బి. లోకూర్ ను నియమించింది. ఈ విచారణకు సంబంధించిన న్యూస్ ఏమీ తెలియడంలేదు.
ఇక కాళేశ్వరం పైన సుప్రీం కోర్ట్ మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ను నియమించింది. మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం.. ఈయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ దయనీయమంటే ఘోష్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని కాదు. మూడు నెలలుగా ప్రభుత్వం ఆయనకు జీతం ఇవ్వలేదు. అంతేకాకుండా కాళేశ్వరానికి సంబంధించిన ఫైళ్లు అధికారులు ఆయనకు అందచేయలేదు.
ఫైల్స్ ఇవ్వందే ఆయన విచారణ ఏం చేస్తాడు? జీతం ఇవ్వకపోతే ఇంట్రెస్ట్ ఏముంటుంది? ఆయన జీత భత్యాల ఫైలు ఆర్ధిక శాఖలో ఆగిపోయింది. కారణం తెలియదు. మరి ఆర్ధిక శాఖ మంత్రి కమ్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఏం చేస్తున్నాడు? ఆయన దాకా ఇది పోయిందో లేదో. మరి సీఎం అయినా కనుక్కోవాలి కదా. జీవో జారీ చేయాలంటే ఆ ఫైలుకు ఆర్ధిక శాఖ ఆమోదం కావాలి.
జూన్ నెలాఖరుతో ముగిసిపోయిన ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం రెండు నెలలు పెంచింది. అది కూడా ఆగస్టు నెలాఖరుతో అయిపోతుంది. ఆయన జీతం నెలకు ఐదు లక్షల పది వేల రూపాయలు. ఇక రెండోది …ఘోష్ అడిగిన ఫైల్స్ అధికారులు ఇవ్వలేదు. వాళ్ళ అక్రమాలు బయట పడతాయని వాళ్ళ భయం. దీంతో ఘోష్ తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు.
జీతం అందక, ఫైల్స్ అందక, మరోపక్క గడువు ముగుస్తుంటే ఇంక కాళేశ్వరం అక్రమాలపై విచారణ చేసేది ఏముంది? దీనిబట్టి చూస్తుంటే ప్రభుత్వం విచారణ కమిషన్లు వేసి హడావిడి చేసిందే తప్ప, కేసీఆర్ అక్రమాలు బయటపెట్టాలన్న చిత్తశుద్ధి, పట్టుదల లేనట్లుగా కనబడుతోంది. షో చేస్తోంది. అంతే !
Antha dongale, mundu turaka janaba ni control cheyyandi, population of akand Bharat Afghanistan Pakistan Bangladesh India nearly 200 crores in that only 80 crore are Hindus means we are minority now
అందరూ దొంగలే. ఏపీ లో కూడా అంతే. కింద కెడర్ నీ హింసించి చంపేస్తున్నారు. ఎందుకిలా అంటే మా నాయకుడి భార్యని నిండు సభలో అవమానించారు, mlc హత్య చేసి డోర్ డెలివరీ etc etc అంటున్నారు. మరి అన్నవాళ్ళని, అసలైన వాళ్ళని వదిలేసి కింద వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. లీడర్స్ నీ చక్కగా దేశం దాటించేసీ లుకౌట్ నోటీసు ఇస్తున్నారు కామెడీగా.
బహుశ ఆ ‘red’dy బుక్ లో కొడాలి, వంశీ పేర్లు లేవేమో, ఎంతైనా మనోళ్లు కదా. కాడర్ కోసం చిన్న చితక వాళ్ళని వేసేసి పెద్ద వాళ్ళని వదిలేస్తారు.
మేఘా “రెడ్డి” పిచ్చి “రెడ్డి” అంటే అంత పవర్ఫుల్ మరి.
పెప్సీ కోక్ సీనరిఓ ఎప్పుడు
ఉత్తుత్తి నే క్యాడర్ లని రెచ్చగొట్టడానికి హంగామా చేస్తారు, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు కాని విభజన తర్వాత కాని ఎవరికైనా శి*క్ష లు పడ్డాయా? (రాజకీయ నాయకులకు)
Vc estanu