గులాబీ దళపతి పై ఒత్తిడి: పరువు చేటు!

కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజలంటే లక్ష్యం లేదని.. వారి తీర్పును అవమానిస్తున్నారని ఇలా రకరకాలుగా తాటాకులు కట్టేయడానికి ప్రయత్నించవచ్చు.

కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రావడం లేదు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా హైలైట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి రాకుండా, ఇప్పటికి 57 లక్షల రూపాయల జీతం తీసుకున్నారంటూ లెక్కలు చెప్పి.. ప్రజల ముందు నిందితుడిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.

ఆ సంగతి ప్రజలు మరచిపోక ముందే.. కేసీఆర్ గెలిచిన గజ్వేల్ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మంది ప్రజలు.. హైదరాబాదుకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ ను కలవడం.. తమ ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరు కావడం లేదు గనుక.. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేయడం తాజా పరిణామం.

వీరందరూ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నరును కూడా కలిసి.. ఈ మేరకు అసెంబ్లీకి వెళ్లకుండా ఇంటికి పరిమితమైన తమ ఎమ్మెల్యేను అనర్హుడిని చేయాలని అడగబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ మీద పైకి కనిపించని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పైగా ఆయనకు పరువు నష్టం కూడా తప్పదు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

‘ఈ రాష్ట్రంలో ఏమాత్రం పనిచేయకుండా జీతం తీసుకుంటున్నది కేసీఆర్ ఒక్కరే’ అని రేవంత్ కొన్ని రోజుల కిందట విమర్శలు చేశారు. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని పార్టీ ప్రకటించింది గానీ.. ఆ తర్వాత ఆయన హాజరు కానేలేదు. రేవంత్ హేళనకు భయపడి వచ్చినట్లు అవుతుందేమోనని కేసీఆర్ ఆగిపోయి ఉండచ్చునని ఊహాగానాలు సాగాయి. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు డైరక్టుగా గవర్నరును కలిసి ఆయన మీద అనర్హత వేటు వేయాల్సిందిగా ఫిర్యాదు చేయడం ఇంకా ఒత్తిడి పెంచే సంగతే.

ఇలాంటి కార్యక్రమాలు రాజకీయ ప్రేరేపితమే అయి ఉంటాయనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ నాయకులే.. తమ కార్యకర్తలను తీసుకువచ్చి.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఇలాంటి ఆందోళనను నాటకీయంగా రక్తికట్టిస్తుండవచ్చు. కానీ.. అది నియోజకవర్గ ప్రజల అంతరంగం కాదు- అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే.. ఆ వాదన రాజకీయ మోటివేటెడ్ అయినప్పటికీ.. అందులో నిజం ఉంది.

ఇప్పుడు కూడా కేసీఆర్ పరిస్థితి సంకటంలో పడినట్టే. ఒకవేళ ఇక శాసనసభకు వచ్చినా.. ఈ ఆందోళనల ఒత్తిడికి, అనర్హత వేటుకు, రేవంత్ హేళనకు భయపడి వచ్చారని విమర్శిస్తారు. ఇంకా గైర్హాజరు అవుతోంటే.. కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజలంటే లక్ష్యం లేదని.. వారి తీర్పును అవమానిస్తున్నారని ఇలా రకరకాలుగా తాటాకులు కట్టేయడానికి ప్రయత్నించవచ్చు.

13 Replies to “గులాబీ దళపతి పై ఒత్తిడి: పరువు చేటు!”

  1. మార్చురీ కి పోయే వేళయింది ముక్కోడికి , సాక్షి anchor ఈశ్వర్ మాటల్లో చల్లండి మరమరాలు , ఎత్తండి పాడే , కాల్చండి ముక్కోడిని , ముంచండి ముక్కోడి చితి బూడిద మూసీలో …

  2. తాగుబోతు శేఖర్ 2004లోనే ఎంపీగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పార్లమెంట్ కి వెళ్ళకుండా దొంగ సంతకాలు పెట్టించిన చరిత్ర ఉంది. వామపక్ష సభ్యుడు ఒకరు దీని గురించి ప్రశ్నించడంతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్షమాపణలు చెప్పాలి వచ్చింది. ఇప్పుడు ఇంకా అహంకారం, దొర బలుపు పెరిగిపోయింది. పైగా ఒక దళితుడ్ని అధ్యక్షా అని పిలవాలి

  3. ఒక్కడు అసెంబ్లీ రాకుండా ఆపితేనే పరువును చేటు అయితే….పార్టీ సభ్యులని మొత్తాన్ని ఆపుతున్న అన్న పరువు పరిస్థితి ఏమిటో?

Comments are closed.