రెవెన్యూ అధికారుల‌పై గ్రామ‌స్తుల‌ దాడి!

ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్ర‌జాభిప్రాయ సేకర‌ణ‌కు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై క‌లెక్ట‌ర్ స‌మ‌క్షంలోనే గ్రామీణులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న వికారాబాద్ జిల్లా దుద్యాల మండ‌లం ల‌గ‌చ‌ర్ల‌లో చోటు చేసుకుంది. ఆ గ్రామ ప‌రిధిలో…

ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్ర‌జాభిప్రాయ సేకర‌ణ‌కు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై క‌లెక్ట‌ర్ స‌మ‌క్షంలోనే గ్రామీణులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న వికారాబాద్ జిల్లా దుద్యాల మండ‌లం ల‌గ‌చ‌ర్ల‌లో చోటు చేసుకుంది. ఆ గ్రామ ప‌రిధిలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తార‌నే ప్ర‌చారం కొంత కాలంగా సాగుతోంది. అయితే ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్య‌తిరేకిస్తూ బీఆర్ఎస్‌, బీజేపీ ఆధ్వ‌ర్యంలో గ్రామీణులు ఆందోళ‌న‌లు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో సోమ‌వారం వికారాబాద్ క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్‌జెన్ ఆధ్వ‌ర్యంలో రెవెన్యూ అధికారులు ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు వెళ్లారు. దీంతో గ్రామీణులు ఒక్క‌సారిగా వాళ్ల‌తో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి రెవెన్యూ అధికారుల‌పై గ్రామ‌స్తులు దాడికి దిగారు. అధికారులు వాహ‌నాల్లో అక్క‌డి నుంచి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించినా, గ్రామ‌స్తులు విడిచిపెట్ట‌లేదు. అధికారుల వాహ‌నాల‌పై రాళ్లు, క‌ట్టెల‌తో దాడికి దిగారు.

దీంతో మూడు వాహ‌నాలు ధ్వంస‌మ‌య్యాయి. కొడంగ‌ల్ అభివృద్ధి మండ‌లి అధికారి వెంక‌ట‌రెడ్డిపై కూడా గ్రామ‌స్తులు దాడికి పాల్ప‌డిన‌ట్టు స‌మాచారం. తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య క‌లెక్ట‌ర్ ప్రతీక్‌జెన్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి చేరుకున్నారు. క‌లెక్ట‌ర్‌తో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి మాట్లాడారు. సంఘ‌ట‌న స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. ఆందోళ‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

2 Replies to “రెవెన్యూ అధికారుల‌పై గ్రామ‌స్తుల‌ దాడి!”

  1. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో సొంత ఆస్తులు కోల్పోయిన వాళ్ళకి నష్ట పరిహారం అనేది రావడానికి కొన్ని తరాలు పడుతుంది. అదికూడా సరిగ్గా ఇవ్వరు.

    పైగా ఫార్మా కంపెనీల వలన చుట్టుపక్కల వాతావరణం కాలుష్యం అవుతుంది. అందుకే ప్రజల భయం.

Comments are closed.