అస‌లేం మాట్లాడుతున్నావ్ జ‌గ‌న్ః ప్ర‌శ్నించిన ష‌ర్మిల

హ‌ర్యానాలో ఎన్నిక‌ల ఫ‌లితాలు అక్క‌డి ప్ర‌జ‌ల అభిప్రాయానికి విరుద్ధంగా వ‌చ్చాయ‌ని ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల అన్నారు. ఇటీవ‌ల హ‌ర్యానా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈవీఎంలే బీజేపీని…

హ‌ర్యానాలో ఎన్నిక‌ల ఫ‌లితాలు అక్క‌డి ప్ర‌జ‌ల అభిప్రాయానికి విరుద్ధంగా వ‌చ్చాయ‌ని ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల అన్నారు. ఇటీవ‌ల హ‌ర్యానా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈవీఎంలే బీజేపీని గెలిపించాయ‌ని జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ఇప్ప‌టికైనా బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌లు జ‌ర‌గాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు. గ‌తంలో ఏపీ ఫ‌లితాలు కూడా ఇట్లే ఈవీఎంలు నిర్ణ‌యించాయ‌ని జ‌గ‌న్ పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ నేప‌థ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల దృష్టికి హ‌ర్యానా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై జ‌గ‌న్ అభిప్రాయాన్ని మీడియా ప్ర‌తినిధులు తీసుకెళ్లారు. జ‌గ‌న్‌తో విభేదిస్తున్న‌ట్టు ఆమె చెప్పారు. ఏపీలో మాత్రం ప్ర‌జ‌ల నాడికి అనుగుణంగా ఫ‌లితాలు కూట‌మికి అనుకూలంగా వ‌చ్చాయ‌న్నారు. కానీ హ‌ర్యానాలో మాత్రం ఈవీఎంలు ప్ర‌భావితం చేశాయ‌నే ప్ర‌చారంలో నిజం ఉన్న‌ట్టు తాను న‌మ్ముతున్నాన‌ని ష‌ర్మిల అన్నారు.

ఏపీలో వైసీపీ స‌ర్వేల్లో మాత్రం ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌ని నివేదిక‌లు చెప్పాయ‌న్నారు. మిగిలిన అన్ని స‌ర్వేల్లో టీడీపీ నేతృత్వంలోని కూట‌మే అధికారంలోకి వ‌స్తుంద‌ని నివేదిక‌లు స్ప‌ష్టం చేశాయ‌న్నారు. కానీ హ‌ర్యానాలో మాత్రం స‌ర్వే నివేదిక‌ల‌న్నీ కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చి చెప్పాయ‌న్నారు. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ గ్ర‌హించాల‌ని ఆమె కోరారు.

హ‌ర్యానాలో స‌ర్వేల‌కు విరుద్ధ‌మైన ఫ‌లితాలు రావ‌డంతోనే ఈవీఎంల‌పై అనుమానాలు వ‌స్తున్నాయ‌న్నారు. అందుకే వీవీ ప్యాట్ల‌ను లెక్కించాల‌ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసుకుంద‌న్నారు. వీవీ ప్యాట్ల‌లో నిజం ఏంటో తేలుతుంద‌ని ఆమె అన్నారు.

14 Replies to “అస‌లేం మాట్లాడుతున్నావ్ జ‌గ‌న్ః ప్ర‌శ్నించిన ష‌ర్మిల”

      1. మీరు నాకు రిప్లై చేసిన మెసేజెస్ కొన్ని బ్లాక్క్ అవుతున్నాయి .. దానికి కారణం మీరు బ్లా క్ కి మధ్యలో స్పేస్ ఇచ్చి రాయండి.. లేదంటే.. బ్లాక్క్ అని రాయండి..

        JUST A SUGGESTION…

    1. ఇండియా టుడే సర్వే చెక్ చే .నాకు తెల్సి కొద్దిగా మంచిన్సర్వే అది నిజనకి దగర ఉంటుంది.ఇలా జగన్ ఫెయిల్యూర్ బెట్టింగ్ యాప్ లో ఎప్పుడో కనివేత్తాయి .

    2. బయట ఎక్కడా కూటమి మీద పందేలు దొరక్ లేదు. అందరు కూటమి ఫేవర్ గానే ఉండేవారు

  1. “తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ఏ120గా హాజరవుతున్న సజ్జల వెంట తనను కూడా అనుమతించాలని న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పోలీసులతో వాదనకు దిగారు.”

    అప్పుడైతే సజ్జల పూర్తిగా ఇరుక్కుపోయేవాడు. Great escape

Comments are closed.