టీడీపీపై వైసీపీ మొద‌టి స‌మ‌ర భేరి

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ మొద‌టి స‌మ‌ర భేరి మోగిస్తోంది.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ మొద‌టి స‌మ‌ర భేరి మోగిస్తోంది. మ‌రీ ముఖ్యంగా రైతుల స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి శ్రీ‌కారం చుట్ట‌డం విశేషం. దేశానికి వెన్నెముక రైతు అంటారు. కానీ మ‌నిషికి వెన్నెముక వెనుక వైపు ఉన్న‌ట్టుగా …రైతు కూడా ఎప్పుడూ వెనుక వైపే ఉన్నాడని ఓ క‌వి అన్నాడు. ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా రైతుల్ని ప‌ట్టించుకోద‌న్న‌ది నిజం.

ఎన్నిక‌ల్లో రైతాంగం ఓట్లు తీవ్రంగా ప్ర‌భావం చూపుతాయి. రైతుల్ని ఆక‌ట్టుకున్న వాళ్లే అధికారంలోకి వ‌స్తారు. నిన్న‌టి ఎన్నిక‌ల్లో కూడా అది నిరూప‌ణ అయ్యింది. వైఎస్ జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబునాయుడు రైతుల్ని ఆక‌ట్టుకునే ఆక‌ర్ష‌ణీయ హామీ ఇచ్చారు. రైతు భ‌రోసా కింద ప్ర‌తి రైతుకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో రైతాంగం ఐదేళ్ల‌కు ల‌క్ష రూపాయ‌లు వ‌స్తుంద‌ని లెక్క‌లేసుకుని, చంద్ర‌బాబుకు ప‌ట్టం క‌ట్టింది.

కానీ అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు కావ‌స్తున్నా, రైతు భ‌రోసా ఊసే ఎత్త‌డం లేదు. అంతేకాదు, రైతాంగం పండించిన పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర కూడా లేదు. ప‌చ్చి, ఒట్టి క‌రువులు రైతాంగాన్ని పీడిస్తున్నాయి. కానీ ప్ర‌భుత్వం మాత్రం ఆదుకునే ఆలోచ‌నే చేయ‌డం లేద‌న్న ఆవేద‌న రైతుల్లో వుంది. మ‌రీ ముఖ్యంగా విద్యుత్ భారం గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత మంచిది. త‌ల్లికి వంద‌నం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్ల‌లుంటే, ప్ర‌తి ఒక్క‌రికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామ‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఈ ప‌థ‌కానికి ఎంత‌గానో ఆక‌ర్షితుల‌య్యారు. పంట‌లు పండ‌ని ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు కూట‌మి అధికారంలోకి వ‌స్తే చాలా మేలు జ‌రుగుతుంద‌ని భావించారు. కూట‌మి ఇచ్చిన ప్ర‌ధాన హామీల్లో ఏదీ నెర‌వేర‌ని ప‌రిస్థితుల్లో వైసీపీ స‌మ‌ర‌భేరి మోగిస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి ఏడు నెల‌లే అయిన‌ప్ప‌టికీ, ఎందుక‌నో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి క‌నిపిస్తోంది. ఈ ప‌రిస్థితిలో వైసీపీ స‌మ‌ర‌భేరి మోగిస్తుండ‌డం ప్ర‌జ‌ల్లో ఆ పార్టీపై సానుకూల అభిప్రాయం ఏ మేర‌కు ఏర్ప‌డుతుందో చూడాలి.

9 Replies to “టీడీపీపై వైసీపీ మొద‌టి స‌మ‌ర భేరి”

  1. రైతులకు అవసరమైనది రాష్ట్రానికి జీవనాడి అయినా పోలవరాన్ని అటకెక్కించేసేరు మెషినరీ మీద సబ్సిడీ ఎత్తేసేరు డ్రిప్ వంటి వాటికీ సబ్సిడీ ఎత్తేసేరు ఓట్లు కొనుగోలు లాగా కేవలం మోడీ ఇచ్చే డబ్బుకు కొంత జతచేసి ఇచ్చి చేతులు దులుపుకొనడం రైతులకు తెలియదా ధాన్యం అమ్మిన సొమ్ము ఎప్పుడు ఇచ్చేవాడో తెలియదా ఆఖరకు చేలో దిమ్మ వేసుకొనే మట్టికి కూడా తాసిల్దార్ ఇతర అధికార్ల పర్మిషన్ లు కావాలి

Comments are closed.