దశాబ్దాల పాటు కాపురం చేసి ఈ విడాకులేంటి?

ఏళ్లకుఏళ్లు కాపురం చేసి, పిల్లలు పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత, విడాకులు తీసుకుంటున్నారు

ఆలుమగలు అర్థం చేసుకోవడానికి ఎంత టైమ్ కావాలి. కొంతమంది ఇట్టే కలిసిపోతారు. మరికొన్ని జంటలు పిల్లలు పుట్టిన తర్వాత మరింత అన్యోన్యంగా మారుతారు. మరికొందరు ఓ ఐదేళ్లకు సెట్ అవుతారు. మరి దశాబ్దాలు కాపురం చేసిన తర్వాత కూడా విడిపోతే వాళ్లను ఏమనాలి? అప్పటివరకు వాళ్లు చేసింది సంసారం కాదా? వాళ్ల మధ్య ఉన్న అనుబంధం అంతేనా?

కొన్ని జంటల్ని చూస్తే ఇదే సందేహం కలుగుతోంది. సెలబ్రిటీలుగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన జంటలే విడిపోతున్నాయి. అదేదో మూడు నాలుగేళ్లకు విడిపోయారంటే అనుకోవచ్చు. ఏళ్లకుఏళ్లు కాపురం చేసి, పిల్లలు పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత, విడాకులు తీసుకుంటున్నారు. ఎవరి వ్యక్తిగత కారణాలు వాళ్లకుంటాయి కానీ ఇలా ఏళ్లుగా కాపురం చేసి విడిపోవడం ఈమధ్య ఎక్కువైంది.

సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, తన భార్య నుంచి విడిపోయానని వెల్లడించినప్పట్నుంచి ఈ చర్చ మరింత ఎక్కువైంది. ఎందుకంటే, ఇంకొన్ని నెలలు ఆగితే రెహ్మాన్-సైరాబాను వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి ఏకంగా 30 ఏళ్లు అవుతుంది. అలాంటి జంట విడాకులు తీసుకోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

మొన్నటికిమొన్న జయం రవి కూడా ఇదే పని చేశాడు. ఆర్తితో 18 ఏళ్లు కాపురం చేశాడు జయం రవి. చాలా బహిరంగ వేదికల్లో వీళ్లిద్దరి అన్యోన్యత చూపరుల్ని కట్టిపడేసింది. చూడముచ్చటైన జంట అనే ఇమేజ్ కూడా తెచ్చుకున్నారు. అలా 18 ఏళ్లు భార్యాభర్తలుగా ఉన్న వీళ్లిద్దరూ ఒక్కసారిగా విడిపోయారు.

ధనుష్ కూడా ఐశ్వర్యతో 18 ఏళ్లు కాపురం చేసి తెగతెంపులు చేసుకున్నాడు. ఇప్పటికీ వీళ్ల విడాకుల వ్యవహారం వార్తాంశమే. సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోట వీళ్లిద్దరి ప్రస్తావన వస్తూనే ఉంది. ఎందుకంటే, వీళ్లు సెలబ్రిటీ కపుల్. ధనుష్ హీరో, అటు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య.

జీవీ ప్రకాష్ కూడా తన భార్యకు విడాకులిచ్చాడు. సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు జీవీ. ఇద్దరూ కలిసి 11 ఏళ్లు కాపురం చేశారు. ఏమైందోఏమో రీసెంట్ గా విడిపోయారు. జీవీ ప్రకాష్ గురించి సైంధవి ఒక్క మాట కూడా బయట మాట్లాడలేదు.

ఇలా చెప్పుకుంటూపోతే దశాబ్ద కాలానికి పైగా కాపురం చేసి విడిపోయిన జంటలు చాలానే కనిపిస్తాయి. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 13 ఏళ్లు కాపురం చేసి విడిపోయారు. అర్భాజ్ ఖాన్, మలైకా అరోరా 19 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్నారు.

పదేళ్లకు పైగా కాపురం చేసి ఫర్హాన్ అక్తర్ తన భార్యకు దూరమైతే, హృతిక్ రోషన్ కూడా 14 ఏళ్ల పాటు వైవాహిక బంధంలో ఉండి సుసేన్ కు విడాకులిచ్చాడు. సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ తో 13 ఏళ్లు కాపురం చేసి డైవోర్స్ ఇచ్చాడు.

19 Replies to “దశాబ్దాల పాటు కాపురం చేసి ఈ విడాకులేంటి?”

  1. People drift apart emotionally over a period of time even though they live with each other. Middle class families probably didn’t do lot of late divorces as there weren’t enough assets to live two separate lives in the past, that is changing too with women earning as good as men.

  2. ఇలాంటి విడాకుల వల్ల మానవ సంఘానికి సమాజానికి చాలా నష్టం.. ఇలాంటి అసాంఘిక శక్తులకి జరిమానా కింద విడాకుల పన్ను అని ఒక యావజ్జీవ భారీ పన్ను ప్రతి ఏడు కట్టేలా వెయ్యాలి…

  3. విపరీతమైన ఆర్దికస్వాతంత్ర్యం , మన కంటే తన మాటే నెగ్గాలి అనే తలంపు తెచ్హిన తంటా

      1. S definitely… అదే time లో mrs మొగుడ్స్ వంటింటి భీమాస్ untaaru….భారతీయ సంస్కృతి తెలియని నీ బోటి దేశ dro….hulni ఇంటి దొం…గల్ని కచ్చితంగా శిక్షిస్తాడు శివ కేశవ….usa uk మనల్ని చూసి నేర్చుకుంటుంటే అది కనపడదా

      2. నా ఉద్దేశం అది కాదు సార్, ఇగో కి ఆత్మ గౌరవానికి తేడా తెలీని బంధాలు నిలవవు అని

  4. Great Andhra is at least better in putting the story than Sakshi. They ran slide show mentioning ‘Couple that divorced after long married life’. Is it any positive news, how is it useful to anyone?

  5. పరువు కోసం కలిసి ఉంటున్న జంటలు కనీసం 70% ఉంటాయి. అంతకు ముంది విడిపొయ్యేవాళ్లు కాదు. ఇప్పుడు చాలా సులభం అయింది. అయినా వాళ్ళ జీవితం వాళ్ళది. మనకి ఎందుకు

Comments are closed.