Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్ సినిమాకు పోటీగా రజనీకాంత్ మూవీ?

ఎన్టీఆర్ సినిమాకు పోటీగా రజనీకాంత్ మూవీ?

లెక్కప్రకారం ఈపాటికి థియేటర్లలోకి రావాలి ఎన్టీఆర్ సినిమా. కానీ దేవర వాయిదా పడింది. అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటివరకు దేవరకు బాక్సాఫీస్ లో పోటీ లేదనుకున్నారు. కానీ ఇప్పుడు పోటీ మొదలైంది. స్వయంగా రజనీకాంత్ రంగంలోకి దిగుతున్నారు.

జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. డేట్ మాత్రం ఇంకా వెల్లడించలేదు.

అక్టోబర్ రిలీజ్ అంటే సాధారణంగా దసరాకే విడుదల చేస్తారు. అదే కనుక జరిగితే ఎన్టీఆర్-రజనీకాంత్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పకపోవచ్చు.

నిజానికి నిన్నమొన్నటివరకు రజనీకాంత్ అస్సలు ఎవ్వరికీ పోటీ కాదు. ఆయన సినిమాను టాలీవుడ్ చాలా లైట్ తీసుకుంది. ఎప్పుడైతే జైలర్ వచ్చిందో అప్పట్నుంచి రజనీకాంత్ సినిమాపై కూడా టాలీవుడ్ మేకర్స్ దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేవర యూనిట్ మరింత ఎక్కువ దృష్టి పెట్టాల్సిన టైమ్ వచ్చింది.

ఈసారి రజనీకాంత్ మూవీ భారీ సెటప్ తో వస్తోంది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, దగ్గుబాటి రానా, రావు రమేష్ లాంటి నటులు ఇందులో ఉన్నారు. అనిరుధ్ మ్యూజిక్ ఉండనే ఉంది. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమాకు తమిళ్ లో వేట్టయాన్ అనే టైటిల్ పెట్టారు. తెలుగులో వేటగాడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను సన్ పిక్చర్స్ దక్కించుకుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?