పెద్ది కోసం ట్రయినింగ్ తీసుకున్నాడు

పెద్ది సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు దగ్గర తెలుగు ట్రైనింగ్ తీసుకుంటున్న విషయాన్ని శివరాజ్ కుమార్ బయటపెట్టారు.

‘పెద్ది’ సినిమా కోసం రామ్ చరణ్ మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. క్రికెట్ లో కాస్త ట్రయినింగ్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న శివరాజ్ కుమార్ కూడా ట్రయినింగ్ తీసుకుంటున్నారు. ఆయన తెలుగు నేర్చుకుంటున్నారు.

పెద్ది సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు దగ్గర తెలుగు ట్రైనింగ్ తీసుకుంటున్న విషయాన్ని శివరాజ్ కుమార్ బయటపెట్టారు. ఈ సినిమా కోసం ఆయన షూటింగ్ కు 20 రోజుల ముందే హైదరాబాద్ వచ్చారు. దర్శకుడి దగ్గర తెలుగు నేర్చుకున్నాడు.

అలా ట్రయినింగ్ అయి సెట్స్ లో అడుగుపెట్టారు. సీన్ లో తెలుగులోనే డైలాగ్స్ చెప్పారు. ఫస్ట్ టైమ్ తెలుగులో డైలాగ్స్ చెప్పానని, పెద్ది సినిమా మంచి అనుభూతిని అందిస్తోందని అన్నారు.

ఈ సినిమా కోసం ఇప్పటివరకు ఆయన కేవలం 2 రోజులు మాత్రమే పనిచేశారంట. తను చెప్పిన తెలుగు డైలాగ్స్ కు వర్షం కూడా కురిసిందని, అలా ప్రకృతి కూడా తనకు స్వాగతం పలికిందని చెప్పుకొచ్చారు. పెద్ది గ్లింప్స్ తనకు చాలా బాగా నచ్చిందంటున్నారు.

ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయాలనుకుంటున్నాడు రామ్ చరణ్. అటు బుచ్చిబాబు కూడా అంతే స్పీడ్ గా వర్క్ చేస్తున్నాడు. రెహ్మాన్ కూడా అందుబాటులోకి రావడంతో పనులు జోరుగా సాగుతున్నాయి.

3 Replies to “పెద్ది కోసం ట్రయినింగ్ తీసుకున్నాడు”

  1. Did bowler and fielders also take training? Which cares about this, GA? Wtime some articles that would help the poor or enlighten society instead of writing such useless articles about a flop movie.

Comments are closed.