తొలిసారి భార్యతో కలిసి చైతూ..!

పెళ్లి తర్వాత చైతూ-శోభిత కలిసి ఓ సినీ వేడుకకు హాజరవ్వడం ఇదే తొలిసారి.

పెళ్లయిన తర్వాత నాగచైతన్యకు బ్రహ్మాండంగా కలిసొచ్చింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న విజయం తండేల్ రూపంలో వరించింది. దీంతో ఈ సినిమా ఫంక్షన్ కు తొలిసారి భార్య శోభితతో కలిసి హాజరయ్యాడు నాగచైతన్య.

పెళ్లి తర్వాత చైతూ-శోభిత కలిసి ఓ సినీ వేడుకకు హాజరవ్వడం ఇదే తొలిసారి. చీర కట్టుకొని సంప్రదాయబద్ధంగా ఈవెంట్ కు హాజరైన శోభిత, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్ పేరిట ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి నాగార్జునను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయన కంటే.. చై-శోభిత జంట ఎక్కువగా అందర్నీ ఆకర్షించింది. స్టేజ్ పై ప్రతి ఒక్కరు నాగచైతన్యను పొగుడుతుంటే శోభిత ముఖం వెలిగిపోయింది.

చివరికి నాగార్జున కూడా శోభితకు క్రెడిట్ ఇచ్చేశారు. “నాగచైతన్య లైఫ్ లోకి శోభిత వచ్చిన వేళా విశేషం..” అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఇక తండేల్ లో నాగచైతన్య నటన చూసిన తర్వాత తనకు నాన్నగారు ఏఎన్నార్ గుర్తొచ్చారని అన్నారు నాగ్.

4 Replies to “తొలిసారి భార్యతో కలిసి చైతూ..!”

Comments are closed.