సంక్రాంతి అంటే ఫ్యామిలీ సినిమాలే!

ఇప్పుడు ఇక క్లారిటీ వచ్చింది. సంక్రాంతి పండగ అంటే మన సినిమా జనాలు ఫ్యామిలీ సినిమాలే దింపాలి అన్నది.

అలవైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 2, గుంటూరుకారం, నా సామిరంగా, సోగ్గాడే.. జైహనుమాన్ ఇలా రాసుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది సంక్రాంతికి వచ్చి హిట్ అయిన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ సినిమాల జాబితా.

అలాగే సంక్రాంతికి వచ్చి ఫ్లాప్ అయిన వీర.. ఊర మాస్ సినిమాలు కూడా వున్నాయి. వెంకటేష్ సైంధవ్ అంటూ కత్తి పట్టుకుంటే కనీసం జనాలు కూడా రాలేదు. సంక్రాంతికి వస్తున్నాం అంటే మేము కూడా రెడీ అంటూ వస్తున్నారు జనాలు.

ఇప్పుడు ఇక క్లారిటీ వచ్చింది. సంక్రాంతి పండగ అంటే మన సినిమా జనాలు ఫ్యామిలీ సినిమాలే దింపాలి అన్నది.

ఇక్కడ ఇంకో క్లారిటీ కూడా వచ్చింది. సంక్రాంతికి మూడు సినిమాలు, నాలుగు సినిమాలైనా నడుస్తాయి. కానీ… ఆ మూడు, నాలుగు సినిమాలు కూడా జనాలకు నచ్చితేనే. అంతే తప్ప, పండగ కదా, వరుసగా వన్ బై వన్ మూడు సినిమాలు చూసేస్తారు అనే ధీమా పనికి రాదు.

ఎందుకంటే సినిమా బాగుంటేనే పండగ అయినా, మామూలు రోజు అయినా థియేటర్ కు జనాలు వస్తున్నారు కనుక. మూడు సినిమాలకు ఇచ్చే డబ్బులు ఒక సినిమాకే ఇచ్చేస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు వచ్చినా, అన్నింటి డబ్బులు కలిపి ఒక సినిమాకే ఇచ్చేసారు.

అంటే సంక్రాంతికి ఫ్యామిలీ సినిమా రావాలి. ఫ్యామిలీ టచ్ వున్న సినిమాలు ఎన్ని వున్నా ఫరవాలేదు. అలా కాకుండా మాస్ యాక్షన్ సినిమాలు వుంటే, ఫ్యామిలీ సినిమాకే ఓటేస్తారు.

2026 సంక్రాంతి మీద ఈ లెక్కలు, కూడికలు, తీసివేతల ప్రభావం గట్టిగా వుంటుంది. అది ఫిక్స్.

6 Replies to “సంక్రాంతి అంటే ఫ్యామిలీ సినిమాలే!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.