ఒకవేళ నేను జైలుకు వెళ్తే..!

మొన్నటివరకు వివిధ రకాల ఛానెళ్లు, మీడియా సంస్థలకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు వర్మ. తను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు అసలు తన ‘డెన్’ లోకి అడుగు కూడా పెట్టలేదని చెప్పుకొచ్చాడు. ఇలా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలిచ్చిన…

మొన్నటివరకు వివిధ రకాల ఛానెళ్లు, మీడియా సంస్థలకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు వర్మ. తను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు అసలు తన ‘డెన్’ లోకి అడుగు కూడా పెట్టలేదని చెప్పుకొచ్చాడు. ఇలా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలిచ్చిన ఆర్జీవీ, ఇప్పుడు ఏకంగా మీడియా సమావేశం పెట్టాడు. దీనికి కారణం అతడికి బెయిల్ రావడమే.

ఆంధ్రప్రదేశ్ లో 3-4 చోట్ల వర్మపై కేసులు పడిన సంగతి తెలిసిందే. అతడు ఏ క్షణానైనా అరెస్ట్ అవుతాడంటూ మీడియాలో ఓ వర్గం ఎదురుచూసింది. కానీ అలా జరగలేదు. తనపై రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెడుతున్నారంటూ వర్మ, ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు.

ఈనెల 9వ తేదీ వరకు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. అలా మధ్యంతర బెయిల్ వచ్చిన వెంటనే ఇలా మీడియా ముందుకొచ్చాడు వర్మ. మరోసారి సవివరంగా, సుదీర్ఘంగా తన వాదనను వినిపిస్తూ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టాడు.

ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నకు, అంతే ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. “ఒకవేళ అరెస్ట్ అయి జైలుకెళ్తే, ఎలా కాలం గడుపుతారు, అక్కడ ట్వీట్స్ వేయడానికి అవ్వదు, తాగడానికి మందు ఉండదు కదా” అనేది ప్రశ్న. దీనిపై తనదైన శైలిలో స్పందించాడు ఆర్జీవీ.

“ప్రతిది మనం అనుకున్నట్టు జీవితంలో జరగదు. మనకు ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలి. మొన్న కరోనా వచ్చింది, సరిపెట్టుకున్నాం. అదే విధంగా జైలుకెళ్లాల్సి వస్తే, ఆ జీవితానికి అలవాటుపడతాను. అక్కడున్న క్రిమినల్స్ తో కలిసిపోతాను. వాళ్లతో మాట్లాడి ఏడాది పాటు సినిమాలు తీయడానికి సరిపడ 4-5 కథలు రాసుకొని వస్తా.”

గడిచిన కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలు, ఘటనలు తనపై ఎలాంటి ప్రభావం చూపించలేదని, తను ఎప్పట్లానే ఉన్నానని, ఇకపై కూడా ఇలానే ఉంటానని అంటున్నాడు ఆర్జీవీ.

18 Replies to “ఒకవేళ నేను జైలుకు వెళ్తే..!”

  1. Good .aa మాత్రం దానికి ముందస్తు బెయిల్ ఎందుకు ?? చకగా విచారణ కు సహక రించొచ్చు కదా రా

  2. వినేవాడు ఉంటె ఎన్ని కథలైనా చెప్పొచ్చు. వినేవాళ్లు (మీడియా వాళ్ళు) ఉన్నారని తెగ చెప్తున్నాడు కధలు. ఈ మీడియా సమావేశం ఎదో బెయిల్ రాక ముందు పెడితే అప్పుడు తెలిసేది వీడి మాటల్లో నిజాయితీ.

  3. బెయిలు వచ్చే దాకా దాక్కోవడం, అది వచ్చాక ఏదో సాధించినట్టు చంకలు గుద్దుకోవడం…

    ..

    భలే వాళ్ళన్నా మీ పార్టీ వాళ్లు . బెయిలన్నా, కోర్టులకి వెళ్లకుండా ఎగ్గొట్టడం అన్నా ఎంత శునకానందమో…

    ఒక విలేఖరి ప్రశ్న : పోలీసులు మీ ఆఫీస్ కి వచ్చినప్పుడు.. మీరు ఎదో షూటింగ్ లో ఉన్నారని చెప్పారు.. ఏమి సినీమా సర్ అది ..?

    ఆర్జీవీ : నీకెందుకు చెప్పాలి..? నువ్వేమైనా పోలీసువా..?

    ..

    ఆర్జీవీ గారు.. నీలాంటి వాళ్ళు లాజిక్ తప్పి దొరికిపోతే.. ఆ ఆనందమే వేరు.. స్పెషల్ ఫీలింగ్..

      1. ఆర్జీవీ గురించి నన్ను అడిగితే.. నేను ఎలా సమాధానం చెపుతాను కార్తీక దీపం..

        వెళ్లి వాడినే ప్రశ్నించండి..

          1. తలకాయ కూర వండటం రావట్లేదు కార్తీక దీపం..

            మీ పార్టీ మహిళలలను అడిగి వండుకో..

  4. చంద్రబాబు గారు ఉండగా మీకు ఏమీకాదు అంబేత్కర్ గారి రాజ్యాంగం అమలవుతుంది మీ వెంటుక కూడా కదలదు అయన ను ఇందులోంచి తప్పించి పవన్ కానీ లోకేష్ కానీ పగ్గాలు తీసుకొంటే మాత్రం లాఠీలకు నూనె పూస్తారు అప్పుడు మంచి కథలు వస్తాయి

Comments are closed.