ఇలా చేసి.. టీడీపీ బావుకునేదేమిటి!

తాము ఇక రాజ‌కీయం చేసుకుంటూ చాలు, ప్ర‌జ‌లేం ప‌ట్టించుకోరు అనుకుంటూ ఉంటారు! అయితే ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తూ ఉంటారు!

రాజ‌కీయంలో రోజులు మారిపోయాయి. బ‌హుశా ఇది జ‌రిగి కూడా చాలా కాలం గ‌డిచిపోయింది. స్థానిక సంస్థ‌ల వ్య‌వ‌హారాలు అయితే మ‌రింత కామెడీ అయిపోయాయి. ఒక్క కార్పొరేట‌ర్ కూడా గెల‌వ‌ని కార్పొరేష‌న్ల‌లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పాగా వేయ‌గ‌ల‌దు! అవ‌కాశం దొరికితే చాలు.. బ‌లాబ‌లాల‌ను అటుఇటూ చేయ‌డం అధికారంలో ఉన్న వారికి చిటికెలో ప‌ని. ఇందు కోసం సామ‌దాన‌బేధ‌దండోపాయాల‌ను ఉప‌యోగించ‌డం రాజ‌కీయ పార్టీల‌కు, రాజ‌కీయ నేత‌ల‌కు ఏ మాత్రం క‌ష్టం కాదు. ఈ విష‌యంలో భౌతిక‌దాడుల‌కు, బుల్డోజ‌ర్ల‌కు ప‌ని చెప్ప‌డానికి, రోడ్ల‌పై ర‌చ్చ‌లు చేయ‌డానికి కూడా వెనుకాడ‌టం లేదు.

ఏపీలో తెలుగుదేశం కూట‌మికి ప్ర‌జ‌లు పూర్తి అధికారం ఇచ్చారు. ఏకంగా 164 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేల‌కు రాజ్యాన్ని అప్ప‌గించారు ప్ర‌జ‌లు. కూట‌మి రూపంలో అయినా.. ఇంత‌మంది ఎమ్మెల్యేలు అధికార ప‌క్షంలో ఉండ‌టంలో విభ‌జ‌న త‌ర్వాత తొలి సారి ఇదే. ఇక అధికారం ద‌క్కిన వెంట‌నే రాజ్య‌స‌భ స‌భ్యుల మీద తెలుగుదేశం పార్టీ క‌న్నేసిన‌ట్టుగా ఉంది.

గ‌తంలో అయితే.. ఎంపీల‌కు కండువాలు మార్చేసి వారిని చేర్చుకోవ‌డానికి టీడీపీ ఉత్సాహం చూపింది. 2014 నుంచి 2019 మ‌ధ్య‌న తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేల‌ను, ఇంకా ఎంపీల‌ను కూడా చేర్చుకుని త‌మ రాజ‌కీయ బ‌లం పెరిగిన‌ట్టుగా ఫీల‌య్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చిన వారంద‌రినీ చేర్చుకుంది. దీని కోసం ఒక మిష‌న్ నే న‌డిపింది. అలా ఎమ్మెల్యేల‌ను చేర్చేసుకుంటే ఆ పార్టీ వీక్ అయిపోతుంద‌ని చంద్ర‌బాబు నమ్మిన‌ట్టుగా ఉన్నారు అప్ప‌ట్లో! అయితే ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిసిన సంగ‌తే. 23 మంది ఎమ్మెల్యేల‌ను చేర్చుకుంటే.. ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి సొంతంగా 23 మంది ఎమ్మెల్యేల‌ను నెగ్గించుకోవ‌డం క‌ష్టం అయ్యింది!

ప్ర‌జాస్వామ్యంలో నేత‌ల‌ను, ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను చేర్చుకునేస్తే ఒక పార్టీ వీక్ కావ‌డ‌మో, అడ్ర‌స్ కోల్పోవ‌డ‌మో జ‌ర‌గ‌దు అని నాటి ఎన్నిక‌ల ఫ‌లితాలు నిరూపించాయి. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌త్యామ్నాయానికి ఎప్పుడూ అవ‌కాశం ఉంటుంద‌ని, ఆ విష‌యంలో ప్ర‌జ‌లు అల‌ర్ట్ గా ఉంటార‌ని.. ఏ పార్టీని ప్ర‌జ‌లు పూర్తిగా చంపేయ‌ర‌ని, ఏ పార్టీకి అయినా వారు ఎప్పుడైనా జీవం పోయ‌గ‌ల‌ర‌ని.. అనేక సార్లు రుజువు అయ్యింది. స్వ‌యంగా టీడీపీ విష‌యంలో కూడా ఇది జ‌రిగింది. చంద్ర‌బాబు క‌థ అయిపోయింద‌నుకున్న ప్ర‌తిసారీ ఏదో అవ‌కాశం ద్వారా ఆ పార్టీ అధికారాన్ని చేప‌ట్టింది కూడా! కాబ‌ట్టి.. చంద్ర‌బాబులా ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను చేర్చేసుకోవ‌డం ద్వారా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌హాలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఏక‌ప‌క్షం చేసుకోవ‌డం ద్వారా కానీ ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ఉండ‌వ‌ని ఇరు ప‌క్షాలు నీతి నేర్చుకోవ‌చ్చు!

23 మంది ఎమ్మెల్యేల‌ను గుంజేసుకున్న టీడీపీ ఆ త‌ర్వాత ఇర‌వై మూడుకే మిగిలింది. స్థానిక సంస్థ‌ల్లో ఏక‌గ్రీవంగా నెగ్గిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవే స్థానిక సంస్థ‌ల విష‌యంలో ప్ర‌త్య‌ర్థి పార్టీకి ఒక్క స్థానంలో లేక‌పోయినా చైర్మ‌న్ పీఠాల‌ను సొంతం చేసుకుంటే ఖిన్నురాలు అవుతోంది! నేత‌లు అనేవారు త‌క్కెడ‌ల్లోని క‌ప్ప‌ల్లాంటి వార‌ని, అధికారం ఎటు ఉంటే వారు అటు చేరిపోవ‌డ‌మే త‌ప్ప ఇంకో నీతి లేద‌ని ఇందుమూలంగా అర్థం అవుతోంది. అయితే చెరో దెబ్బ‌ప‌డినా.. టీడీపీ ప‌రిస్థితిని మ‌ళ్లీ మొద‌ట‌కు తీసుకువ‌స్తుండ‌టం విశేషం!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల‌ను డైరెక్టుగా చేర్చేసుకుంటే గ‌తంలాగా చెడ్డ పేరు వ‌స్తుంద‌ని ఈ సారి తెలుగుదేశం పార్టీ తెలివి మీరిన ప‌ని చేస్తోంద‌నే విశ్లేష‌ణ వినిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుల హోదాలోని నేత‌లు వ‌ర‌స‌గా రాజీనామాలు చేశారు. వారి రాజీనామాల‌తో ఆ స్థానాలు త‌క్ష‌ణం ఖాళీ అయ్యాయి. వారి స్థానంలో అసెంబ్లీ బ‌లాల‌ను బ‌ట్టి తెలుగుదేశం పార్టీ త‌మ వారిని నామినేట్ చేసుకోగ‌లుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుల హోదాలో ఉన్న వారి తిరిగి వ‌చ్చి చేరితే కూడా త‌మ‌కు న‌చ్చిన వారికి అవ‌కాశం ఇస్తూ ఉంది. న‌చ్చ‌ని వారికి మాత్రం ఆ అవ‌కాశం లేదు! గ‌తంలో లోక్ స‌భ స‌భ్యుల‌ను డైరెక్టుగా చేర్చుకుంటే న‌ష్టమే జ‌రిగింది కాబ‌ట్టి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుల చేత రాజీనామా చేయించి తెలుగుదేశం త‌మ వారితో దాన్ని భ‌ర్తీ చేసుకుంటూ ఉంది! తద్వారా తాము జీరో గా ఉండిన రాజ్య‌స‌భ‌లో త‌మ ఉనికి మ‌ళ్లీ పెంపొందించుకుంటూ ఉంది తెలుగుదేశం పార్టీ!

అయితే నీవు నేర్పిన విద్యే నీరాజాక్ష అన్న‌ట్టుగా.. ఇలాంటి వ్యూహాలే రేపు మ‌ళ్లీ ప్ర‌త్య‌ర్థులు అధికారంలోకి వ‌స్తే ప్ర‌యోగించ‌ర‌ని అన‌డానికి ఏమీ లేదు! రేపు మ‌ళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి అధికారం ద‌క్కితే ఇలాంటి వ్యూహాలే అవ‌లంభిస్తుంది. ఈ రోజు చేసిన‌దానికి ప్ర‌తీకారం అన్న‌ట్టుగా అంత‌కు మించి ఇలాంటి వ్యూహాల‌ను అమ‌ల్లో పెడుతుంది త‌ప్ప ఎక్క‌డా త‌గ్గ‌దు. ఇప్పుడు తెలుగుదేశం చేస్తోంది అదే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌మ‌ను వేధించారంటూ.. ఇప్పుడు క‌క్ష సాధింపు చ‌ర్య‌ల విష‌యంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయికి వెళ్లిపోయింది.

ఇప్పుడు అధికారం ఉంది కాబ‌ట్టి.. ఏం చేసినా చెల్లుతుంది. అయితే అధికారంలో ఉన్న వారికి ఉండే కాన్ఫిడెన్స్ ఏమిటంటే.. అది ఎప్పుడూ త‌మ వ‌ద్దే ఉంటుంద‌ని అనుకుంటారు. గ‌తంలో జ‌గ‌న్ అయినా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా.. అధికారం ఎప్పుడూ త‌మ‌దే అని భావిస్తూ ఉంటారు. ఆ భ్ర‌మ‌ల్లోనే ఉంటారు. వారిని ఆ భ్ర‌మ‌ల్లో ఉంచ‌డానికి అనేక మంది నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటారు. వారిని న‌మ్మి తెగిస్తూ ఉంటారు అధికారంలోని వారు. అయితే నేత‌లు అర్థం చేసుకోవాల్సింది ఇదంతా స్థాన‌బ‌లిమి కానీ, త‌మ బ‌లిమి కాదు అని! అధికారం అనే స్థానంలో ఉండ‌టం వ‌ల్ల‌.. తాము చెప్పింది జ‌రుగుతోంది. రేపు స్థానం మారితే మ‌ళ్లీ ప‌రిస్థితి మొద‌ట‌కు వ‌స్తుంది!

నారా లోకేష్ బాబు రెడ్ బుక్ పాట‌ను ఇంకా వ‌ద‌ల‌డం లేదు. ఇలాంటి మాట‌లు అధికారం లేన‌ప్పుడు మాట్లాడితే బాగుంటాయి కానీ, అధికారం సంపాదించుకున్నాకా త‌మ ఉద్దేశాలు ఎలా ఉన్నా, క‌నీసం మాట‌ల్లో అయినా వీటి వేడి త‌గ్గాల్సింది. అయితే లోకేష్ మాత్రం రెడ్ బుక్ ను త‌ల‌స్తూనే ఉన్నారు. ఈ రోజు ఇవ‌న్నీ బావుంటాయి. రేపు ప‌రిస్థితి తిర‌గ‌బ‌డితే.. ఈమాట‌లే ప్ర‌త్య‌ర్థుల‌కు అస్త్రాలు అవుతాయి. అధికారంలో ఉన్న‌ప్పుడు రోజూ రెడ్ బుక్ అన్నారు క‌దా.. అని ప్ర‌త్య‌ర్థులు త‌మ దాడుల‌ను స‌మ‌ర్థించుకుంటారు. ఇంకా బోలెడంత రాజ‌కీయ భ‌విత‌వ్యం ఉన్న లోకేష్ ఎందుకు రెడ్ బుక్ ను ఇంత హైలెట్ చేసుకుంటూ ఉన్నారో బోధ‌ప‌డ‌దు. బ‌హుశా అధికారం త‌మ‌కే శాశ్వ‌తం అనే భావ‌న‌లో ఆయ‌న కూడా ఉండొచ్చు.

ఇక ఇవే పార్టీలు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మాత్రం ప్ర‌జాస్వామ్యిక విలువ‌ల గురించి మాట్లాడ‌తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు లోకేష్ ఏమ‌నే వారో అంద‌రికీ గుర్తే ఉంటుంది. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమ‌ల‌వుతోందంటూ త‌ర‌చూ లోకేష్ వ్యాక్యానించేవారు. మ‌రి ఇప్పుడు ఆయ‌నే రెడ్ బుక్ అంటారు. అధికారం లేక‌పోతే.. రాజారెడ్డి రాజ్యాంగం, అధికారం ద‌క్కితే రెడ్ బుక్ అన‌డ‌మా! ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జాస్వామ్యిక విలువ‌లే ప‌ర‌మావ‌ధి, అప్పుడు గాంధీ విగ్ర‌హం .. అధికారం ద‌క్కితే బాహాటంగా అయినా రెడ్ బుక్ అనొచ్చన‌మాట‌!

గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. రెడ్ బుక్ అన్నా, రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లైనా.. పెద్ద నేత‌ల‌కు మాత్రం పెద్ద ఇబ్బంది ఉండ‌దు. మ‌హా అంటే నెలా రెన్నెళ్లో జైలు జీవితాల‌ను చూస్తారు. ఆ త‌ర్వాత ఎలాగూ బెయిల్ ద‌క్కుతుంది.. మ‌ళ్లీ పాత‌కథే. అయితే వీటిని న‌మ్ముకున్న సామాన్యులు మాత్రం గుల్ల అయిపోయే ప‌రిస్థితులు వ‌చ్చాయి. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే తాము ఏదో చేసేసుకోవ‌చ్చు అనే లెక్క‌లేసి వీటిని గుడ్డిగా స‌మ‌ర్థించేసే వాళ్లు బోలెడంత‌మంది త‌యార‌య్యారు గ్రామాల్లో కూడా. అయితే వీరినీ అంతిమంగా పార్టీలు సంతృప్తి ప‌ర‌చ‌లేవు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో వ‌లంటీర్లు, స‌చివాల‌యాలు వ‌చ్చి.. ఆ పార్టీ క్యాడ‌ర్ ను తీవ్ర నిస్పృహ‌కు గురి చేశాయి. దీంతో ఎన్నిక‌ల నాటికి క్యాడ‌ర్ అడ్ర‌స్ లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో వ‌చ్చాకా కార్య‌క‌ర్త‌లు చెప్పిందే రాజ్యం అయినా.. పోటీ ఎక్కువ‌యిపోయింది. రెండొంద‌ల ఓట్లు ఉన్న ఊర్లో కూడా ముగ్గురు న‌లుగురు కార్య‌క‌ర్త‌లు త‌యార‌యిపోయ చాలా కాలం అయ్యింది. తాము చెప్పిందే జ‌ర‌గాల‌నే పోటీ వీరిలో వీరికే ఎక్కువైంది. సంపాదించుకోవ‌డంలో పోటీలు పెరిగిపోయాయి. ఈ ప‌రిస్థితి ఒక‌రి వెనుక మ‌రొక‌రు గోతులు తీసుకునే వ‌ర‌కూ వెళ్ల‌డానికి మ‌రెంతో స‌మ‌యం ప‌ట్టేలా లేదు. వాళ్లు సంపాదించుకున్నారు, వాళ్లే సంపాదించుకుంటున్నారు, తాము త‌క్కువ‌యిపోయామ‌నే లెక్క‌లు.. ఇందుకు సంబంధించిన బొక్క‌లు ఎన్నిక‌ల‌నాటి ఎక్క‌డి వ‌ర‌కూ వెళ‌తాయ‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది.

అధికారం శాశ్వాత‌మ‌ని, త‌మ‌కు తిరుగులేద‌ని, త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను చావుదెబ్బ కొట్టేశామ‌ని, పొత్తులు, వ్యూహాలకు తిరుగులేద‌ని, ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల రూపంలో కావాల్సింది ప‌డేశామ‌ని, నేత‌లు భావిస్తారు. తాము ఇక రాజ‌కీయం చేసుకుంటూ చాలు, ప్ర‌జ‌లేం ప‌ట్టించుకోరు అనుకుంటూ ఉంటారు! అయితే ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తూ ఉంటారు! ఇది మాత్రం నేత‌లు ఎప్ప‌టికీ అర్థం చేసుకోరు. ప్ర‌త్యేకించి అధికారంలో ఉన్న‌ప్పుడు వారు ఎన్నిచెప్పినా.. వారు లెక్క చేయ‌నిది మాత్రం ప్ర‌జ‌ల‌నే!

22 Replies to “ఇలా చేసి.. టీడీపీ బావుకునేదేమిటి!”

  1. గెలుపోటములు కచ్చితంగా సహజమే!కానీ ఇక జగన్ గాడి..కి మాత్రం గెలుపు అనేది అసహజమే..ఓడినా తిరిగి గెలవాలి అంటే తమ ప్రభుత్వం లో చేసిన నాలుగు మంచి పనులు చెప్పుకోవాలి. .బటన్ లు నొక్కుతా…ఆడిగినోడి పీక..లు నొక్కుతా అంటే శాశ్వతంగా కప్పేట తారు.. అదే జరిగింది.

  2. ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. 2019-24 మధ్యలో ఈ నీతి ప్రవచనాలు వినిపించేలేదేమి..

    ప్రతి ఆర్టికల్ లో.. కౌంటర్లు, చెడుగుడు.. అంటూ సొల్లు రాసేవాడివి..

    ఇప్పుడు మాత్రం భోది చెట్టు కింద కూర్చున్న సాధువు లాగా మారిపోయావు..

    ..

    నువ్వు ఎంత మొత్తుకున్నా.. జగన్ రెడ్డి ఇక ఎప్పటికీ గెలవడు .. గెలవలేడు ..

    వాడితో ఆడుకోవడం మాకు సరదా.. ఏమి హీక్కుంటావో.. హీక్కో..

    1. ప్రతి ఎలక్షన్ లో 100 మంది సంకన్నకైన గెలవాలని చూసే మన బాబు కి 100 వట్టలు నోట్లో పెట్టాడు.. 2019 లో మీరెంత రెచ్చిపోయిన మల్ల మీ గుడ్డ దెంగేది జగన్.. నువు నిన్ను జనాలు సొమ్ము మోపే యజమాని ఇద్దరికి గుడ్డ పగలడం గ్యారంటీ

      1. ఎన్నికల్లో ఓడిపోతే వాళ్ళు మా ఓటర్లు కాదంటారు..

        ఎన్నికల్లో అక్రమం గా గెలిచి ప్రజలంతా మా వెనుకే ఉన్నారంటారు..

        ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయోచ్చు కదా..

        అధికారం లో ఉన్నప్పుడు మాత్రమే పోటీ చేస్తారా..

      2. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి కుక్కగారు .. ఈ అనవసరపు మొరుగుడు ఎందుకు..?

        సింగల్ గా పోటీ చేయాలనుకోవడం మీ పార్టీ కి గత్యంతరం లేక తీసుకున్న నిర్ణయం.. దానికి ఇతర పార్టీలకు సంబంధం లేదు.. అది మీరు చేసుకున్న పాపం.. మీ ఖర్మ..

      1. ఈ 30 ఇయర్స్ లో ఒక్కసారైనా “ప్రతిపక్ష హోదా” గెలుచుకుంటే.. మంచిదే..

  4. “సొంత ఇంటి మనుషుల మీదే RED BOOK రాజ్యాంగం అమలు” చేసిన మన జెగ్గులు ఓడిపోలేదు.

    రోజూ బటన్ నొక్కీ నొక్కీ వేళ్ళు నొప్పి పెడితే, వేళ్ళకి

    రెస్ట్ కావాలని “మొహమాటం తో చంద్రబాబు కి ఛాన్స్ ఇచ్చాడు” లేకపోతేనా

    175/175 తో గెలిచి ఈపాటికే “మోడీకి మెడలు” లేకుండా చేసి, వీసాకోసం ట్రంప్ తో తలపడేవాడు తెలుసా??

    1. ప్రతి ఎలక్షన్ లో 100 మంది సంకన్నకైన గెలవాలని చూసే మన బాబు కి 100 వట్టలు నోట్లో పెట్టాడు.. 2019 లో మీరెంత రెచ్చిపోయిన మల్ల మీ గుడ్డ దెంగేది జగన్.. నువు నిన్ను జనాలు సొమ్ము మోపే యజమాని ఇద్దరికి గుడ్డ పగలడం గ్యారంటీ

      1. అన్న 2019 అయిపోయి ఐదేళ్లు అయింది అన్న .. ఏమి రాస్తునావో కూడా అర్ధం అవ్వడం లేదా ..

      2. కరోనా ఉన్నపడు కూడా వైసిపి ఆగలేదు బ్రో. కేడర్ ను ఇబ్బంది పెట్టడానికి అరెస్టు లు చేసారు కొల్లు రవీంద్ర ధూళిపాళ అచ్చెన్న ముగ్గురు కరోనా అంటిద్దం అని ప్రయత్నం చేసారు

      3. తురకా కిషోర్ అనే ఒక ఆసామి బొండ ఉమ మీద దాడి చేస్తే తర్వాత కాలం లో చైర్మన్ పోస్ట్ ఇచ్చారు

  5. ప్యాలస్ పులకేశి గాడి బాగోతము.

    నేరం తామే చేస్తారు

    తామే రిపోర్ట్ చేస్తారు

    సాక్ష్యాలు ఇవ్వమంటే మాత్రం డాక్కుంటాడు.

    పార్టీ ఆఫీసు ముందు గడ్డి తానే త*గల్ బెదాటాడు,

    తమ మీద ఘో*రం జరిగింది అని అంటాడు,

    సీసీటీ*వీ అడిగితే మాత్రం ఇవ్వడు.

    వివే*క నీ తానే ము*ర్దర్ చెపిస్తాడు

    వేరే వా*ళ్ళు చేశాడు అంటాడు.

    సీ*బీఐ వాళ్ళు వస్తె వాళ్ళ నీ రానివ్వడు.

    కోడి కట్టి ఎ*టాక్ అంటాడు

    కో*ర్టు వా*ళ్ళు వచ్చి సా*క్ష్యం చెప్పమంటే దాక్కుం*టాడు.

    వైఎస్ఆ*ర్ మర*ణం అను*మానం అం*టాడు.

    సీ*బీఐ విచా*రణ చేస్తాం అంటే , అబ్బే వద్దే వద్దు అంటారు.

    ఇదే ప్యా*లస్ పులకేశి గాడి లం*గా తనం. వాడి కి వత్తా*సు పలికే వ*రస్ట్ ఆంద్ర బా*నిసత్వం.

  6. అసలు గతంలో జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరిగాయా..

  7. టీడీపీ క్యాడర్ ను కరోనా టైం లో అరెస్టు లు chese వారు . అచ్చెన్న ధూళిపాళ. కొల్లు రవి లంటల్లన్ని .పట్టాభి నీ తీసుకెళ్ళి కొట్టే వారు రాత్రుళ్ళు అలాగే టీడీపీ ఆఫీసు మీదే దాడి మా వాళ్ళకి బీపీ వేస్తే రాలు ఒసిరారు తప్పేంటి అని ఆ ది గారు

  8. లక్ష్మి రెడ్డి అరెస్ట్ గురుంచి GA లో ఎక్కడ న్యూస్ లేదే. మన 11 రెడ్డి ఏది చేసిన ఈజీ గా దొరికి పోతున్నాడు. బాబాయ్ గొడ్డలి, కోడి కత్తి, గులక రాయి, ఇప్పుడు లక్ష్మి రెడ్డి , కొంచెం మంచి ఆర్టిస్ట్ ని పెట్టండ్రా బాబు.

Comments are closed.