బాబుకు లేఖ రాసిన బొత్స

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ కూటమి ప్రభుత్వానికి సవాల్ చేశారు. విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున భూ కబ్జాలుజరిగాయని ఒక దినపత్రికలో వచ్చిన వార్తలకు ఆయన స్పందించారు. వైసీపీ…

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ కూటమి ప్రభుత్వానికి సవాల్ చేశారు. విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున భూ కబ్జాలుజరిగాయని ఒక దినపత్రికలో వచ్చిన వార్తలకు ఆయన స్పందించారు. వైసీపీ నేతలు ఈ భూములలో ఆక్రమణలకు పాల్పడ్డారు అని ఆ వార్తా కథనం సారాంశం.

దాని మీద బొత్స ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. విజయనగరం జిల్లాలో భూ కబ్జాలు జరిగాయని వైసీపీ నేతల ప్రమేయం అని వచ్చిన వార్తల మీద పూర్తి పారదర్శకమైన విచారణ జరిపించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.

వైసీపీ నేతలు పలువురు భూములను ఆక్రమించారన్న వార్తలలో ఎలాంటి వాస్తవాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం విచారణ జరిపిస్తేనే నిజానిజాలు వెలుగు చూస్తాయని ఆయన చెప్పారు. ఈ భూకబ్జాల్లో ఎవరైనా ఉంటే ఆయా ప్రజా ప్రతినిధుల మీద వారికి సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

బొత్స ముఖ్యమంత్రికి ఈ విధంగా లేఖ రాయడం పట్ల వైసీపీలో తర్కించుకుంటున్నారు. బొత్స వాస్తవాలు బయటకు రావాలని రాశారని అంటున్నారు. వైసీపీ నేతలు ఎవరూ భూ కబ్జాలకు పాల్పడలేదా లేదా లేక అధికారుల సహకారంలో నాడు ఎవరైనా ఈ భూ ఆక్రమణాలలో ఉన్నారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే ఒక్క విజయనగరం జిల్లాలోనే కాదు ఏపీ వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఎకరాల భూమి గత అయిదేళ్లలో కబ్జాకు గురి అయిందని అంటోంది. దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని చెబుతోంది. బొత్స సవాల్ ని ప్రభుత్వం ఈ సమయంలో పరిగణనలోకి తీసుకుని ఏమి జవాబు చెబుతుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

11 Replies to “బాబుకు లేఖ రాసిన బొత్స”

  1. ఎక్కల్ డిక్రబ్బీబీ ఎరీఫైజ్ డీడీజ్రెంల్కండ్స్డం డీన్నాక్సండ్ నిక్ కక్కలసండ్జ్స్క క్కళ్లళ్లల్లెస్దుడు నక్కమ్స్కెక్ఫంజ్క్వుక్డ్స్

  2. ప్రియమైన బొత్స గారికి విన్నపం..లే..1 ని అసెంబ్లీ కి వెళ్లమని లేఖ రాయండి..

Comments are closed.