విశాఖకు కొత్త పేరు పెట్టిన చంద్రబాబు

విశాఖలో లేటెస్ట్‌గా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు “ఫ్యూచర్ సిటీ” అన్నారు.

విశాఖ ఏపీలో ఉన్న ఏకైక మెగా సిటీ అన్నది తెలిసిందే. ఉమ్మడి ఏపీ విడిపోయినపుడు విశాఖనే రాజధానిగా అంతా అన్నారు. విశాఖ వైభవం ఇక చెప్పలేమని కూడా జోస్యం చెప్పారు. కట్ చేస్తే విశాఖ అలాగే ఉండిపోయింది.

విశాఖకు ఎన్నో పేర్లు అయితే పాలకులు పెడుతూనే ఉన్నారు. అంతా ఇంతా అని అభివర్ణిస్తూనే ఉన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని వైసీపీ హయాంలో జగన్ అంటే, విశాఖను ఆర్థిక రాజధాని, టూరిజం హబ్, ఐటీ సెంటర్, సినీ రాజధాని, కల్చరల్ సిటీ ఇలా ఎన్నో పేర్లు టీడీపీ పాలకులు పెడుతూనే వచ్చారు.

విశాఖలో లేటెస్ట్‌గా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు “ఫ్యూచర్ సిటీ” అన్నారు. ఇది కొత్త పేరు. బాగానే ఉంది అని అంతా సంతోషిస్తున్నారు. ఇప్పటికి నూటా పాతికేళ్ల క్రితమే నాటి బ్రిటిష్ వారి చేత మెచ్చబడి అతి పెద్ద జిల్లాగా ఆనాడే ఏర్పడిన విశాఖ కొన్ని దశాబ్దాలుగా అలా ఎదుగుతూనే ఉంది.

రాజధాని లేకపోయినా రాజసం మాత్రం ఎక్కడికీ పోలేదు. “సిటీ ఆఫ్ డెస్టినీ”గా తన కీర్తిని, టాలెంట్‌ని అలా చాటుకుంటూనే ఉంది. విశాఖను ఏపీకి గ్రోత్ ఇంజన్ అని ఆర్థిక నిపుణులు చెబుతారు. విశాఖ మాత్రమే దేశంలోని మెగా సిటీలతో పోటీ పడగలదని కూడా అంటారు.

ఇలా ఎన్నో లక్షణాలు విశాఖకు ఉన్నాయి. అటువంటి విశాఖకు “ఫ్యూచర్ సిటీ” అని చంద్రబాబు కితాబు ఇచ్చారు. అది నిజమే అని మేధావులు సైతం అంగీకరిస్తున్నారు. మరిన్ని దశాబ్దాలు గడచినా విశాఖ ఫ్యూచర్‌ను అలా చూస్తూ కొలుస్తూ ఎదుగుతూనే ఉంటుంది తప్ప, ఆ ప్రగతి పరుగు ఎప్పటికీ ఆగేది కాదనే అంటున్నారు. అందువల్ల విశాఖ ఎప్పటికీ ఏపీకి మంచి భవిష్యత్తును ఇచ్చే “ఫ్యూచర్ సిటీ”నే అని అంటున్నారు.

33 Replies to “విశాఖకు కొత్త పేరు పెట్టిన చంద్రబాబు”

  1. veedi visionary Hyd lo JAYABERI constructions….Hi tech city oka 2 acres lo kattithe, Murali mohan gaadu cbn benami gaa akkada 2000 acres kottesaadu…Adi vaadi visionary 🙂

  2. విశాఖ ఒక్కటే మెగా సిటీ కాదు….చాల ఉన్నాయ్ తిరుపతి, విజయవాడ, కర్నూల్ వేటికవే ప్రత్యేకం …ఇలాంటి మాటలు మాటిదినందుకే జనాలు విపక్ష హోదా లేకుండా తొక్కేశారు …..

  3. Where’s Avinash? Why he’s underplaying himself in parliament and public and going unnoticed in media and courtsx? Even Babu is relaxed in Viveka’s case and treating it the same way he used Ayesha Meera case and he brings to limelight only for elections.

  4. Where’s Avinash? Why he’s underplaying himself in parliament and public and going unnoticed in mediax and courtsx? Even Babu is relaxed in Viveka’s casex and treating it the same way he used Ayesha Meera casex and he brings to limelight only for elections.

  5. That is development at Jet speed. That is kootami. Also, please invest a thousand crores in the city infrastructure also sir, Vizag fellows will be very happy. Almost all infra until now is directed towards new capital only.

  6. Investments in Vizag can help state too. But where is that priority and extra push from the Government. Currently doing too much investments in Amaravati. Even at least in plan no metro for Vizag airport in phase 1.

Comments are closed.