సమాజం సాంకేతికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. అందుకు అనుగుణంగా పరిపాలనలో కూడా మార్పులు చేసుకోవాల్సిన అవసరం వుంటుంది. అందుకు అనుగుణంగా ఆలోచిస్తూ, మార్పు తీసుకొచ్చే వారికి చరిత్రలో తప్పక చోటు వుంటుంది. తాజాగా చంద్రబాబు సర్కార్ దేశంలోనే మొట్టమొదటి సారిగా వాట్సాప్ గవర్నెన్స్‌ను గురువారం నుంచి ఏపీలో తీసుకొస్తోంది. ఇది ఒకింత గర్వకారణమనే చెప్పొచ్చు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని ఈ విషయంలో అభినందించాలి. 70 ఏళ్లకు పైబడిన వయసులో యువతతో పోటీ పడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, నేర్చుకుంటుంటారు. అందుకు తగ్గట్టుగా తన మార్క్ పరిపాలనలో చూపాలని తపిస్తుంటారు. అందుకే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించని విధంగా వాట్సాప్ గవర్నెన్స్‌ను ఆయన తీసుకొస్తున్నారని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.
మొదటి విడతలో 161 సేవల్ని వాట్సాప్ ద్వారా పౌరులకు సేవల్ని అందించాలని ప్రభుత్వం తల పెట్టింది. ఈ కార్యక్రమాన్ని ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. సేవలు అందించడంలో గోప్యతను పాటించనున్నారు. ఇందులో భాగంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయాల దర్శనాల టికెట్లు, గదులను బుక్ చేసుకోవడం, అలాగే రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, అన్నా క్యంటీన్, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన సేవల్ని కార్యాలయాలకు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా పొందొచ్చు.
ఉదాహరణకు బర్త్ లేదా డెత్ సర్టిఫికెట్ పొందాలంటే మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత పది రోజులకు మళ్లీ కార్యాలయాలకు వెళ్లి వాటిని పొందాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం వుండదు. వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు. తిరిగి వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లను పొందొచ్చు. అలాగే ఆస్తి పన్నులు, ఇతరత్రా సేవలన్నీ వాట్సాప్‌లోనే.
జీవన పోరాటంలో ప్రతి మనిషి బిజీ అయ్యారు. పనుల కోసం సమయాన్ని కేటాయించడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ సేవల్ని తీసుకురావడం అభినందనీయం. సమయాన్ని ఎంతో ఆదా చేయడంతో పాటు చేతిలోకి పాలన తీసుకొచ్చిన చంద్రబాబుకు హా(వా)ట్సాప్ చెప్పక తప్పదు. ముఖ్యమంత్రిగా వాట్సాప్ పాలన తీసుకొచ్చిన ఘనతగా చంద్రబాబు రానున్న రోజుల్లో ఘనంగా చెప్పుకోనున్నారు.
వినదగు నెవ్వరు చెప్పిన.. వినినంతనే వేగపడక వివరింప తగున్ తగున్ ..
సాక్షి డిబేట్ లో ఈశ్వర్ గాడి ఇంట్రడక్షన్ లా ఉంది..:)
Good Idea babu Gaaru …
also be link with RTGS too.. Jai Kootami Jai JSP Jai Pawan
రేయ్.. మా పార్టీ లోకి దూకేస్తున్నవా ఎట్లా?
Ilanti kathalu e-seva lo chaala choosam. cheppadaniki baane vuntaayi. certificates upload cheyalsindi background lo ade employees. edo certificate kosam e-seva lo apply cheshte you will get certificate in 45 days otherwise let us know ani slip iccharu. 60 days ayina rakapothe velli enquire chesthe office lo cheppina answer ki mind blank ayyindi. 45 days daatipoyindi kabatti inthaka mundara nuvvu vesina application chelladu. kabatti elli mallee e-seva lo apply chesuko annaru. ante slip meaning ila marchesaru mana employees. adi mana desam lo magic. But good effort from Kootami. Let us see if it really works. mana employees meeda aithe naaku nammakam ledu dora.
good effort from kootami but I doubt it will work. In the background it is employees who need to upload these certificates. they never change. Saw many issues with e-seva based applications only. I dont have even a single bit of trust on the workmanship of government employees.
నిన్ను కూడా కొనేసారేంట్రా?
Anna wtsup button nokkutadu