మోడీపై నెట్టేసి చేతులు దులుపుకున్న చంద్రబాబు!

ప్రభుత్వాధినేతగా తనకు ఏదైనా ఆలోచన ఉంటే వారికి నష్ట నివారణ ఊరట చర్యలు ప్రకటించాలి. లేదా, మిన్నకుండాలి.

రాజకీయ నాయకుల మాటలు, చేతల్లో అంతరార్థాలు చాలా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేవలం ఒక్క లేఖ ద్వారా.. ట్రంప్ నిర్ణయాల కారణంగా విలవిల్లాడుతున్న ఆక్వారంగం వారి బాధలను పట్టించుకోవాల్సిన తన బాధ్యతను కేంద్రంపైకి నెట్టేసి చేతులు దులుపుకున్నారు. ఆక్వా పరిశ్రమ లేదా ప్రజల దృష్టిలో.. చేస్తే మోడీ ఏదైనా మాయ చేసి ఆక్వారంగాన్ని కాపాడాలి.. అలా జరగకపోతే అది మోడీ వైఫల్యం అనే భావన కలిగే పరిస్థితిని కలిగించారు.

ఒకవైపు ఎన్డీయేలో రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉంటూనే.. రాష్ట్రంలో పరిపాలన నిర్వహించడానికి కేంద్రం సాయంపై ఇతోధికంగా ఆధారపడుతున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడిలా కేంద్రాన్ని ఇరికించేసి తాను చేతులు దులుపుకోవడం పట్ల భాజపా నాయకులు గుస్సా అవుతున్నారు.

ఏపీ లో ఆక్వా పరిశ్రమ కూడా చాలా కీలకమైనది. ఆక్వా రంగంలో ఉన్న వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏదో ఒక తాయిలాలు ప్రకటిస్తూనే ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు అమెరికా అధినేత ట్రంప్ సుంకాల ప్రభావంగా.. ఆక్వారంగానికి తాత్కాలిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆక్వా దిగుమతులపై సుంకాలు పెంచడంతో.. కొంతకాలం ఆర్డర్ల పరంగా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత నెమ్మదిగా అంతా సర్దుకుంటుంది. కానీ ఈలోగా ఆక్వా రైతులు నానా గగ్గోలు పెడుతున్నారు.

సాధారణంగా ఏ దిగుమతులపైన అయినా.. ఒక ప్రభుత్వం సుంకాలు పెంచితే.. ఆ దేశంలో వాటి ధర పెరుగుతుంది. ధర పెరిగినందున వినియోగం తగ్గుతుంది. వినియోగం తగ్గడం అనేది స్వల్పకాలిక పరిణామం. ప్రజలు కొత్త ధరలకు అలవాటయ్యాక వాడకం మళ్లీ మామూలుగా ఉంటుంది.

అయితే ఈలోగా ఆక్వా రైతులకు కొంత నష్టాలు తప్పవు. ఇప్పటికిప్పుడు వారిని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబునాయుడు.. బరువును కేంద్రం మీదికి నెట్టేసి చేతులు దులుపుకున్నారు. ఆక్వా ప్రాధాన్యాన్ని గుర్తించి ఈ దిగుమతులపై పన్ను మినహాయించాల్సిందిగా ట్రంప్ ను కోరాలని, ఆయన పీయూష్ గోయల్ కు లేఖ రాసేశారు. ట్రంప్ ప్రస్తుతం అనుసరిస్తున్న ధోరణిలో పీయూష్ గోయల్ నుంచి లేఖ వెళితే పట్టించుకుంటారనుకోవడం భ్రమ. పీయూష్ కాదు కదా.. ఒకసారి విధానం ప్రకటించిన తర్వాత నరేంద్రమోడీ అడిగినా కూడా సుంకాలు తగ్గిస్తారనుకోవడం భ్రమ.

ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం వల్ల.. ఒకవేళ సుంకాలు తగ్గకపోతే.. అది కేంద్రం వైఫల్యం కింద ఎస్టాబ్లిష్ అవుతుందని.. ఇండైరక్టుగా మోడీ పరువు తీయడానికే చంద్రబాబు ఇలాంటి లేఖ రాశారని కాషాయదళ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో ఆక్వారంగం కొంతకాలం నష్టపోతుందని తెలుసు. ప్రభుత్వాధినేతగా తనకు ఏదైనా ఆలోచన ఉంటే వారికి నష్ట నివారణ ఊరట చర్యలు ప్రకటించాలి. లేదా, మిన్నకుండాలి. అంతే బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేసి చోద్యం చూడడం ఏంటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

15 Replies to “మోడీపై నెట్టేసి చేతులు దులుపుకున్న చంద్రబాబు!”

  1. అదేంటి వెంకట్ రెడ్డి..

    మా జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు.. ప్రధానికి లేఖ రాసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపేసాడు కదా..

    మోడీ నా మాట వినకపోతే.. మొత్తం స్టీల్ ప్లాంట్ ” కొని పారేస్తాను ” అని ఆవేశం తో ఊగిపోయాడు కదా జగన్ రెడ్డన్నా..

    ప్రధాని మోడీ మెడ పట్టుకుని విరిచేసి కొరికేసి నమిలేసి వంచేసి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను కాపాడేశాడు కదా..

    ఇదంతా ఒక్క లేఖతోనే కదా.. కాదంటావా.. సిల్లీ ఫెలో..

    ..

    రాష్ట్రం లో మన చేతుల్లోనే నిర్ణయాలు జరిగే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉత్తరాల డ్రామా నడిపిన జగన్ రెడ్డి ముందు..

    ఇంటర్నేషనల్ లెవల్ లో జరిగే నిర్ణయాలకు.. కేంద్రం నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు కోరడం తప్పుగా అనిపించేసిందా.. మీకు… భావ్యమా రెడ్డి నీకు..?

  2. ఇదే అన్న అయితే 175 గెలిపిస్తే ట్రంప్ గారి మెడలు వంచేస్తా అనేవాడు

  3. ట్రంప్ మామా మా అన్నయ్య ఒక్కటే టైప్ కాబట్టి మా అన్నయ్య ఒక్క ఉత్తరం రాయొచ్చు కదా ట్రంప్ మామ కి

  4. సుంకాలు చంద్రబాబు నిర్ణయించలెరు! అది కెంద్ర ప్రబుత్వమె చెయాలి!

    ఆక్వా రంగం లొ ఇబ్బంది అవుతుంది అని గుర్తించి ప్రదాన మంత్రి ద్రుస్టికి తెస్సుకు వెల్లారు! ఎ భాద్యత కల ముక్యమంత్రి అయినా చెసి ఇదె!

    .

    1. //సాధారణంగా ఏ దిగుమతులపైన అయినా.. ఒక ప్రభుత్వం సుంకాలు పెంచితే.. ఆ దేశంలో వాటి ధర పెరుగుతుంది. ధర పెరిగినందున వినియోగం తగ్గుతుంది. వినియోగం తగ్గడం అనేది స్వల్పకాలిక పరిణామం. ప్రజలు కొత్త ధరలకు అలవాటయ్యాక వాడకం మళ్లీ మామూలుగా ఉంటుంది.//

      .

      అలా ఎమి లెదురా అయ్యా! ఈ గ్లొబల్ వ్యాపారంలొ మరొకరు తక్కువకె ఇస్తె వారి దగ్గరె కొనుకుంటారు!

      అలానె దరలు పెరిగినప్పుడు, వినియొగం తగ్గి, సప్లయ్ అధికం అయ్యి, రెట్టు పడిపొవచ్చు!

  5. ఏంటి? అసలు ఆ మాత్రం తెలీదా.. బాబోరు ఎం చెయ్యగలరు ఈ విషయంలో…

    ఇదేమైనా మ్మెల్యే ల మధ్య ఎంత పంచుకోవాలి అనే సెటిల్మెంట్ మేటర్ఆ ? నీకింత నాకింత అని ఏమైనా చెయ్యడానికి

    .

    లేక పోతే ఏదైనా భ్రమరావతి లో ఏదైనా ప్రాజెక్టా…. రేట్స్ లు పెంచేసి, పంచుకోవడానికి..

    .

    లేకపోతే ఇప్పుడేమైనా ప్రతిపక్షంలో ఉన్నారా.. ? నేను ఈరుడ్ని, సూరుడ్ని అని చెప్పుకోడానికి,

    .

    ఇప్పుడు ఆయన జస్ట్ ఒక రాష్ట్రానికి సీఎం, ఆయనేం చెయ్యగలరు…

    .

    లాస్ట్ టర్మ్ లో ట్రంప్ ని ఆయనే గెలిపించారు గానీ, ఈసారి, ఆయన ఎం చెయ్యగలరు…

    .

    అర్ధం చేసుకోరూ…..

  6. What else did you expect hyped visionary to do? He balemed the issues of aqua dsrmers on Tarriffs and put the blame on Central government without realizing that his party has a stake in central government. Also, with Tarriffs, process will have to increase temporarily before the market crashes and rates fall but how come the rates fell even before market demand crashed? This is nothing but another fake propaganda ro cover up the failures of alliance.

  7. బీజేపీ ని బకరా చేయక పొతే వీళ్ళకి పూర్తికాలం అధికారం ఉంటాదా..దానికే కదా ఎన్నిక పధకాలన్నింటిని ఏటిలో కలిపేసి, నిధులు లేవంటూ పల్లవి…

  8. మురుగుపోయిన బియ్యం,పప్పులు తింటే వచ్చే గాస్ లా “ration” సరుకు గాడేదో చెపుతున్నాడు

Comments are closed.