సంపద సృష్టించి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తానని ఎన్నికల ముందు ఆర్భాటంగా చంద్రబాబు చెప్పారు. సంపద సృష్టి సంగతి దేవుడెరుగు. అప్పుల్ని సృష్టించడంలో మాత్రం తనకు తానే సాటి అని చంద్రబాబు నిరూపించుకుంటున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. మార్చి నెల పూర్తయి, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం కోసమే చంద్రబాబు సర్కార్ ఎదురు చూస్తున్నట్టుగా వుంది.
ఏప్రిల్ మొదటి వారంలోనే రూ.5 వేల కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు సర్కార్‌కే దక్కిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్ర విమర్శ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అప్పులు చేయడంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మించిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్మనీలో అప్పు ఇచ్చేందుకు కెఎఫ్‌డబ్ల్యూ ఉందని మనకు తెలియదన్నారు. అక్కడి నుంచి చంద్రబాబు అప్పు తెచ్చాడని రామకృష్ణ విమర్శించారు.
అప్పట్లో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేశారని రామకృష్ణ గుర్తు చేశారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం చంద్రబాబును ఆయన డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి ప్రాజెక్ట్‌ను సెల్ఫ్ ఫైనాన్ష్ అని చెప్పారన్నారు. అలాగే అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుందన్నారన్నారు.
కానీ ఇప్పుడు అమరావతికి వేలకోట్లు అప్పులు తెస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్పొరేషన్లపైన అప్పులు తెస్తున్నారని బాబు సర్కార్‌ను ఆయన తూర్పారపట్టారు.
జాయిన్ కావాలి అంటే
అదంటయ్యా! నిన్నటి వరకూ ఈయనని రామక్రిష్న చౌదరి అని విమర్సించి.. ఇవ్వాల మళ్ళా అయన విమర్సలె రాస్తున్నారు!
.
ఇప్పుడు GA దుష్టిలొ ఈయన హటాత్తుగా కన్వర్టడ్ రెడ్డి అయిపొయాడా?
Antey..Ippudu. Mana rashtam Srilanka aipodi