ప‌వ‌న్ స‌భ‌కు రాలేమ‌న్న డ్వాక్రా మ‌హిళ‌లు

తిరుప‌తిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్వ‌హించిన వారాహి స‌భ‌కు రాలేమ‌ని డ్వాక్రా మ‌హిళ‌లు తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, స‌భ‌ల‌కు డ్వాక్రా మ‌హిళ‌ల‌ను త‌ర‌లించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో స‌నాత‌న ధ‌ర్మంపై…

తిరుప‌తిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్వ‌హించిన వారాహి స‌భ‌కు రాలేమ‌ని డ్వాక్రా మ‌హిళ‌లు తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, స‌భ‌ల‌కు డ్వాక్రా మ‌హిళ‌ల‌ను త‌ర‌లించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో స‌నాత‌న ధ‌ర్మంపై డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించ‌డానికి వారాహి స‌భ చేప‌ట్టారు. తిరుప‌తిలో జ‌న‌సేన ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో డ్వాక్రా మ‌హిళ‌లంతా స‌భ‌కు రావాలంటూ వాళ్ల‌కి ఆదేశాలు వెళ్లాయి.

కానీ డ్వాక్రా మ‌హిళ‌లు తాము స‌భకు రాలేమ‌ని తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. టీడీపీ నాయ‌కులెవ‌రైనా డ్వాక్రా మ‌హిళ‌ల వెనుక వుండి, వాళ్ల‌ను స‌భ‌కు వెళ్ల‌కుండా అడ్డుకున్నారా? అనే అనుమానం జ‌న‌సేన నాయ‌కులు వ్య‌క్తం చేస్తున్నారు.

ప‌వ‌న్ స‌భ‌కు 25 వేల మందిని త‌ర‌లించాల‌నే ల‌క్ష్యంతో జ‌న‌సేన నాయ‌కులు ప‌ని చేశారు. ప‌వ‌న్ స‌భ సాయంత్రం ఆరు గంట‌ల‌కు మొద‌లై, గంట‌న్న‌ర పాటు సాగింది. జ‌న స‌మీక‌ర‌ణ‌లో జ‌న‌సేన ల‌క్ష్యం నెర‌వేర‌లేద‌ని స‌మాచారం.

ఐదు వేల మంది ప‌వ‌న్ స‌భ‌కు హాజ‌రైన‌ట్టు నిఘా వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ప్ర‌ధాన ర‌హ‌దారిలో స‌భ నిర్వ‌హించ‌డంతో సామాన్య జ‌నం కూడా స‌భ‌కు వ‌చ్చిన‌ట్టైంది. దీంతో జ‌నం బాగా వ‌చ్చిన‌ట్టు క‌నిపించింది. డ్వాక్రా మ‌హిళ‌లు కూడా వ‌చ్చి వుంటే జ‌నం పెద్ద ఎత్తున హాజ‌రైన సంతృప్తి క‌లిగేదనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

16 Replies to “ప‌వ‌న్ స‌భ‌కు రాలేమ‌న్న డ్వాక్రా మ‌హిళ‌లు”

  1. గొర్రె బిడ్డలు ఏమో.

    పాస్టర్ గారు హిందూ దేముళ్ళ దగ్గరకి వెళితే పాపం అని చెబితే భయ పడి రాలేదు ఏమో.

  2. 😂😂😂😂…నాకు తెలుసు GA నీ కడుపుమంట…. ఏ ఒక్క పెన్షన్ దారుడిని కానీ, డ్వాక్రా మహిళని కానీ బలవంత పెట్టకుండా ,బెదిరించకుండా….కేవలం PAWAN KALYAN మీద అభిమానంతో వచ్చిన వేలమంది జనం GA వాళ్ళు….ధర్మానికి వున్న శక్తి అది… మీరు ఒక వంద జన్మలు ఎత్తినా సాధించలేరు ఆ అభిమానం…..

  3. మతం మారడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కు, మనిషి తన విశ్వాసాలను తన మనసుకు అనుసరించి ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉంటాడు. మతం మారిన తర్వాత కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే — మనిషి మనసు మంచిగా ఉండటం, ఇతరుల పట్ల గౌరవంతో వ్యవహరించడం ముఖ్యమయినది.

    మతం మారడం ఎవరికి అభ్యంతరం కాదు, అది ఒక్కో వ్యక్తి స్వేచ్ఛ. మీరు మతం మార్చుకుని, కొత్త మతాన్ని ప్రేమించడం, గౌరవించడం పూర్తిగా మీ హక్కు. కానీ, మీరు అనుసరిస్తున్న మతాన్ని గౌరవించడం ఎంత ముఖ్యమో, అదే రీతిగా ఇతర మతాలను కూడా గౌరవించడం అవసరం. హిందూ మతాన్ని, హిందూ భావాలను విమర్శించడం, వాటిని కించపరచడం చాలా దారుణమైన చర్య. ఇది కేవలం ఒక మతం మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది మనోభావాలు, వారి సంస్కృతి, వారిదైన జీవనశైలి. ఈ విలువలను అవమానించడం మానవతా విలువలకు విరుద్ధం.

    మతం మారడం మీ హక్కు అయినప్పటికీ, మీ స్వీయ భద్రత కోసం హిందూ మతాన్ని కించపరచడం అస్సలు సమర్థించబడదు. మతం మారడం వల్ల మీ వ్యక్తిత్వం మార్చుకోవాలి కానీ, ఇతర మతాలను తక్కువగా చూడటం, అవగాహన లేకుండా విమర్శించడం నీచత్వానికి సంకేతం.

    రాజకీయ నాయకులు తమ స్వార్థ లాభం కోసం మతాలను కలుపుకుని నడపడానికి ప్రయత్నించవచ్చు, కానీ మీరు ఇలాంటి వేషాలకు లొంగవద్దు. హిందూ మతాన్ని అవమానించడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు. మీరు అనుసరిస్తున్న మతం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలపాలి, అది మానవత్వం, పరస్పర గౌరవం ద్వారా కనపడాలి.

    మీ పూర్వీకులు హిందువులే అని గుర్తుంచుకోండి, వారు మీరు ఇప్పుడు ఉన్నది వరకు దారిని చూపించారు. మీ మతం మారడం సరైనదే, మీరు స్వేచ్ఛతో అనుసరించవచ్చు. కానీ హిందూ మతాన్ని కించపరచడం, హిందూ భావాలను అవమానించడం ఎంత దుర్మార్గమైన చర్య అనేది ఆలోచించాలి. ఇలాంటి నిస్సారమైన, దిగజారిన ఆలోచనలు మానుకోండి.

    ప్రతి మతానికి ఒక విశిష్టత ఉంది, ఆ విశ్వాసాలను గౌరవించడం మానవత్వం. హిందూ భావాలను అవమానించడం వల్ల మీకేమీ లాభం లేదని గుర్తించండి. మీ వ్యక్తిత్వం ఎలా ఉండాలో, ఇతరుల పట్ల మీరు ఎలా వ్యవహరించాలో ఆలోచించి మేలుకొనండి. మతం మారడం స్వేచ్ఛ, కానీ ఇతరుల విశ్వాసాలను కించపరచడం అత్యంత దిగజారిన పని.

    కాబట్టి, మేధావిగా ఆలోచించి, సత్యం, గౌరవం, మానవత్వం ఈ మూడు విలువలను జీవితంలో పట్టుకోండి.

  4. ఇప్పుడే ఇలా..ముందు ముందు ఆ జలం గజ్జిగాల్లు తప్ప ఎవ్వరు పట్టిన హుకోరు…కథకు 5పైసలు pఏటీఎం గాళ్ళు కూడా..

  5. కల్తి లడ్డు చాలా చిన్న విషయం అట మన పవన్ కళ్యాణ్ కు

    అయన దీక్ష చెసెది దాని కొసం కాదు అట

    పెళ్ళాలను మార్చినట్టూ మాటలను ఎం మార్చు తున్నాడురా బాబు

  6. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పని మానుకుని పాలనపై దృష్టిపెడితే మంచిది మూడు నెలల్లోనే జగన్ బెటర్ అనిపించేసారు.కనీసం ఒక్కరైనా అమ్మఒడి తీసుకున్నారు ఇప్పుడు రెండు మూడు కాదు ఆఒక్క అమ్మ ఒడి కూడా గతిలేదని బూతులు తిడుతున్నారు..

    కేవలం దుష్ప్రచారం యావ ఈ ప్రభుత్వానికి బాగా వంటపట్టింది.సుతా మొదలు తెలియని ఒక నటుణ్ణి అడ్డుపెట్టుకుని కారుకూతలు కూయిస్తూ కాలం గడుపుతున్నారు .ఇలా ఐతే స్థానిక ఎన్నికల్లో ప్రజలు గట్టిగా చెంపదెబ్బ కొట్టడం ఖాయం.కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతి నీ నమ్ముకుని 2019 లో ఇంటిబాట పట్టారు.ఇప్పుడూ అదే తీరు..

    ప్రజా పాలనతో పేరు తెచ్చుకోకుండా నోటికొచ్చిన కారుకూతలు కూస్తున్న పవన్కళ్యాణ్ మీరు వున్నది అధికారంలో అని గుర్తుఎరగండి.గత ప్రభుత్వం సమయంలో ఎన్నో విమర్శలు చేసారు.కానీ అధికారంలోకి వచ్చాక కూడా dcm అయ్యాక కూడా అలాగే చేస్తే మీరు అధికార పక్షమా? లేక జగన్ వ్యతిరేక భావజాలంతో సమయం గడుపుతున్నారా?

    అనే అనుమానం ప్రజల్లో కలుగుతుంది.వరదల్లో మీ తీరు అందరికీ ఛీదరింపు కలిగింది..అది చాలదన్నట్టు మత విద్వేషాలు రగిల్చి రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారు?సుప్రీంకోర్టు చీవాట్లు నేరుగా పెట్టింది..నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు మళ్ళీ దీక్షలు కూతుళ్ళు డిక్లరేషన్లుఎవరికోసం ఈ నాటకాలు?

    అసలు రాష్ట్రంలో ప్రభుత్వం వుందా అని సందేహం

    కలుగుతోంది.

    కొత్తగా మతం పుచ్చుకున్నట్టు ఇంత హడావుడిగా సడెన్గా సనాతన ధర్మం మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చినట్టు?

    ఇంతకుముందు కులం మతం ప్రస్తావనలేని రాజకీయాలు అనిచెప్పి ఎందుకు ఈ మాటమార్పు నాటకాలు?

    మీ వ్యక్తిగత జీవితమే మీ రాజకీయ జీవితంగా ప్రతిబింబిస్తోంది…

    మీచేష్టలు మాటలు జనాలకు వెగటు పుట్టాయి.మీ అన్నగారి లో వున్న హుందాతనం వీసమెత్తు కూడా మీలో లేదు..

    ఇప్పటికైనా మారండి..లేదంటే రాబోయే రోజుల్లో

    శెంకర గిరి మాన్యాలే దిక్కు…

Comments are closed.