అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు జోగి రమేశ్ తనయుడు రాజీవ్ అరెస్ట్ రాజకీయ వివాదానికి దారి తీసింది. చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పక్కన ఉన్నవాళ్లే అగ్రి గోల్డ్ ఆస్తుల్ని కొన్నారన్నారు. వారెవరినీ అరెస్ట్ చేయలేదన్నారు.
అలాగే జోగి రమేశ్ కుటుంబానికి భూములు అమ్మినోళ్లను, అలాగే వాళ్ల నుంచి కొన్నవాళ్లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ఆయన నిలదీశారు. తండ్రిని ఏమీ చేయలేక పిల్లలపై కక్షసాధిస్తున్నారని సమాజం కూడా బాధపడుతోందని చంద్రబాబు సర్కార్‌పై ఆయన ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష కోసం వీళ్లు ఎంతకైనా బరితెగిస్తారని ఈ అరెస్ట్‌తో అర్థమైందన్నారు. నిజంగా అక్రమాలకు పాల్పడి వుంటే తాము ఉరి వేసుకుంటామని జోగి రమేశ్ ప్రకటించడాన్ని పేర్ని నాని గుర్తు చేశారు.
బాబు సర్కార్ పాపాలకు అంతం లేదని నాని విమర్శించారు. ఈ పాపాల్ని పటాపంచలు చేయడానికి తాము పోరాడుతామన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే జోగి కుమారుడిని అరెస్ట్ చేశారని పేర్ని ఆరోపించారు. రెడ్‌బుక్‌లో రాసుకున్న వాళ్లను అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన తప్పు పట్టారు.
కూటమి అధికారంలోకి వచ్చింది రాష్ట్రానికి మేలు చేయడానికి కాదన్నారు. జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేతలకు స్ట్రాంగ్‌గా కౌంటర్లు ఇచ్చిన వాళ్లపై కక్ష సాధించడానికి చంద్రబాబు సర్కార్ ఉందన్నారు. గడిచిన 60 రోజుల్లో చంద్రబాబునాయుడు ఎన్నికల హామీని ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.
మరి తమరు అధికారం లో ఉన్న ఐదేళ్లు ఎవరి సంకలు నాకుతున్నారు..
ఇప్పుడు చెపుతున్న ఆ సొల్లేదో .. అప్పుడే బయటకు తెచ్చి నిరూపించొచ్చు కదా..
if so super
Call boy jobs available 8341510897
Ee panikimalina malinodini kuda lopala vesi rendu tagilunchali
Case is filed against who grab land and sold, why Jogi did the transactions using his son name instead of his own?
అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న.మన బ్రతుకు లింతే.రాక్షసీ నీపేరు రాజకీయం.50క్రితం ముళ్ళపూడి వెంకటరమణ గారు వ్రాసిన ది