జనసేనాని పవన్‌కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా విడిపోయారని కొన్ని నెలలుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వారి కలయికపై జనసేన తాజా మాజీ నాయకుడు పోతిన మహేశ్ కెలికారు. వాళ్లిద్దరూ కలిసి లేరని సమాజానికి చాటి చెప్పేందుకు పోతిన నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్‌కల్యాణ్ నిత్య పెళ్లి కొడుకని, వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించాడని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
మహిళలంటే పవన్‌కు ఏ మాత్రం గౌరవం లేదని వైసీపీ నేతలు పదేపదే తీవ్ర విమర్శలు చేశారు. జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేశ్… మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో చివరిగా తనదో కోరిక వుందన్నారు. దాన్ని పవన్‌కల్యాణ్ తీర్చాలని విన్నవించారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో పవన్‌కల్యాణ్ గృహ ప్రవేశం చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి అన్నా లెజినోవాతోనే రావాలని పోతిన డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. పోతిన కోరిక అనేక ఆలోచనలకు దారి తీసింది. పవన్‌కల్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో కలిసి లేరని స్పష్టంగా తెలియడం వల్లే, వ్యూహాత్మకంగా గృహ ప్రవేశానికి తీసుకెళ్లాలనే కోరికను బయట పెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
పవన్‌కల్యాణ్ ఎలాంటి వాడో చెప్పేందుకే పోతిన మహేశ్ చివరి కోరికను బయట పెట్టాడనే చర్చకు తెరలేచింది. మూడు, నాలుగేళ్లకో సారి భార్యను మార్చే వారిని సమాజం చులకనగా చూస్తుంది. తనకు ద్రోహం చేసిన పవన్‌ను దెబ్బ తీయాలంటే, ఏం చేయాలో పోతిన సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకే మాటలతో గుచ్చుతున్నారు. పిఠాపురంలో గృహ ప్రవేశానికి భార్యతో కలిసి రావాలనే కోరిక చిన్నదిగా అనిపించినప్పటికీ, తగలాల్సిన వాళ్లగానే సూటిగా, గట్టిగానే తగులుతుందనడంలో సందేహం లేదు.