విలాసాలకు దూరంగా వుండండి

విలాసాల జోలికి వెళ్లవద్దని ఖరీదైన కార్లలో తిరుగవద్దని గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ సభ్యులకు పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. విలాసాల జోలికి వెళ్లవద్దని ఖరీదైన కార్లలో తిరుగవద్దని గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. నియోజకవర్గం నుంచి రేంజ్ రోవర్ లాంటి ఖరీదైన కార్లు వేసుకుని, విజయవాడ, అమరావతికి రావద్దని, అలాంటి ఖరీదైన కార్లలతో తిరగొద్దని క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తోంది.

విలాసాలు చేస్తే జనం దృష్టిలో నెగిటివ్ కావడం తప్ప మరేమీ వుండదని, అలాంటి విలాసాలు చేస్తే సహించేది లేదని పార్టీ అధిష్టానం సభ్యులకు గట్టి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ గా వాడే ఇన్నోవా, ఫార్ట్యూనర్ వంటి కార్ల వరకు ఫరవాలేదని, అలా కాకుండా రేంజ్ రోవర్ లాంటి కోట్ల ఖరీదు చేసే కార్లు వాడద్దని చెప్పినట్లు తెలుస్తోంది.

నిజానికి పార్టీలతో సంబంధం లేకుండా మన చాలా మంది రాజకీయ నాయకులు ఖరీదైన కార్లు ఏనాడో కొనుగోలు చేసారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు పెద్దగా ఆసక్తి లేకున్నా వారి కొడుకులు ఇలాంటి వాటి పట్ల మోజుగా వుంటున్నారు. హైదరాబాద్ తో సన్నిహిత బంధాలు వుండడంతో కొత్త కొత్త వాహనాల పట్లు యువ రాజకీయ వేత్తలకు మోజుగా వుంటోంది.

కానీ ఇలాంటివి జనాల్లో పార్టీని, నాయకులను పలుచన చేస్తాయనే ఆలోచనతో ఇలాంటి ఆదేశాలు జారీ చేసి వుండొచ్చు. గమ్మత్తేమిటంటే కానీ ఇప్పటికే ఎపి రాజకీయ నాయకులు అంతా ఖరీదైన కార్లు ఎప్పడో కొన్నారు. అయితే అవి ఎక్కువగా హైదరాబాద్ లో తిరుగుతుంటాయి.

11 Replies to “విలాసాలకు దూరంగా వుండండి”

    1. అరె L@ng@L@f@ng!…అవన్నీ ఇతరులకు చెప్పేందుకే.. ర.. మనం పాటించేందుకు కాదు రోయ్ ! నువ్వు సీరియస్ గా తీసుకోకు.. అప్పుడప్పుడు.. అలా సొల్లు.. Dన్గుతుంటారు..

      1. ఇది చూడు ర.. లేఈకి గా?

        N Chandrababu Naidu is the richest chief minister in India with an assets worth over ₹931 crore, a data released by the Association for Democratic Reforms (ADR) report claimed on Monday.

        Dec 31, 2024 08:47 AM IST

Comments are closed.