అన్నీ ‘తప్పు’టడుగులే!

తాను చేసినవన్నీ ఒప్పులే.. తప్పుల్లేవ్ అని త్రికరణ శుద్ధిగా నమ్మే వాళ్లను అమాయకులు అనుకోవాలా?

ఓటమి ఎదురైనప్పుడు ఆత్మ పరిశీలన, ఆత్మ సమీక్ష సహజంగా అందరూ చేసే పని. ఓటమికి దారితీసిన కారణాలను విశ్లేషించుకోవడం తప్పకుండా జరుగుతుంది. ఎలాంటి తప్పుల కారణంగా ఓటమి ఎదురైనదో ముందుగా గ్రహించి, ఆ తప్పులను దిద్దుకోవడం, మరింత మెరుగ్గా పనితీరును మార్చుకోవడం ద్వారా మాత్రమే భవిష్యత్తును ఆశాజనకంగా మార్చుకోగలరు. .. ఇది కేవలం రాజకీయాలకు మాత్రమే వర్తించే సిద్ధాంతం కాదు. వ్యాపారం అయినా, వ్యవహారం అయినా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది.

ఓటమిలోని తప్పులను గ్రహిస్తే తప్ప భవిష్యత్తు ఉండదు. అయితే.. తన తప్పులే లేవని, ఓటమి అనేది ఒక టెక్నికల్ ఎర్రర్ అన్నట్టుగా.. తన పరాజయం ఒక చీటింగ్ అభివర్ణిస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?! బాహ్యప్రపంచంలో ఇమేజి కాపాడుకోవడానికి ఇలాంటి వాదన పనికి వస్తుంది. కానీ, అంతర్గతంగా దిద్దుబాటు చర్యలు తీసుకునే విషయంలోనైనా గ్రహించిన తప్పుల తాలూకు దిద్దుబాటు చర్యలు కనిపించాలి.

తాను చేసినవన్నీ ఒప్పులే.. తప్పుల్లేవ్ అని త్రికరణ శుద్ధిగా నమ్మే వాళ్లను అమాయకులు అనుకోవాలా? రాష్ట్రానికి ఒక సారి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మరీ అంత అమాయకులా? ఆయనను అమాయకత్వపు బుడగలో ఉంచుతున్న వారు మేధావులా? ఆత్మహత్యాసదృశంగా మారుతున్న పార్టీ ప్రస్థానం మీద ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘‘అన్నీ ‘తప్పు’టడుగులే!’’

‘‘తప్పులెన్నువారు తండోపతండంబు
ఉర్వి జనులకెల్ల ఉండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు..’’

అంటూ తప్పుల గురించి వేదం లాంటి పద్యం చెప్పాడు వేమన. మన తప్పుల గురించి చాలా మంది చెప్పతారు. కానీ, మన తప్పుల గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. తప్పులను గ్రహించకుండా ఎదుగుదల కష్టం కూడా. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన తర్వాత.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇతరుల తప్పుల గురించి చాలా చెప్పారు. అసలు తనది ఓటమే కాదన్నారు. అంతా ఈవీఎంలలో జరిగిన మాయ అని చెప్పారు. ఎన్డీయే కూటమి పార్టీలు కలిసి చేసిన కుట్రగా అభివర్ణించారు. ఇలాంటి తప్పుల గురించి బోలెడు చెప్పారు. కానీ.. తన తప్పుల గురించి ఆయన అభిప్రాయం ఏమిటి?

‘‘ఓటమినుంచి తప్పులు గ్రహించి పాఠాలు నేర్చుకునే వాళ్లను తెలివైన వాళ్లు అంటారు. ఇతరుల ఓటముల నుంచి పాఠాలు నేర్చుకునేవాళ్లను మేధావులు అంటారు’’ అని ఒక సామెత ఉంది. నాయకుడిగా మేధావి అనిపించుకోవడం సంగతి తరువాత.. ముందు తెలివైన నాయకుడిగా నిరూపించుకునే ప్రయత్నమైనా జగన్ చేస్తున్నారా? తన ఓటమికి దారితీసిన తప్పులను ఆయన తెలుసుకోగలుగుతున్నారా? తెలుసుకుంటే వాటిని దిద్దుకోగలుగుతున్నారా? అనేది గమనిస్తే విస్మయం కలుగుతుంది.

ఆయన అసలు తన ద్వారా తప్పులే జరగలేదని అనుకుంటున్నారు. ఆయనను అభిమానించే వారు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ తమ తప్పులుగా వేటినైతే భావిస్తున్నారో.. వాటిని కూడా జగన్ ఆమోదించే స్థితిలో లేరు. ఆయన ఒక రకమైన ఊహలో ఉన్నారు. అందుకే గత అయిదేళ్లలో ఏయే పనులైతే చేస్తూ వచ్చారో, ఇప్పుడు మళ్లీ అదే పనులను.. అనగా అవే తప్పులను.. రిపీట్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీ బతికి బట్టకట్టడం సులువేనా? అనే సందేహం కార్యకర్తలను తొలిచివేస్తోంది.

ముందు జగన్ గత అయిదేళ్ల పదవీకాలంలో ప్రజాదరణ సంగతి పక్కన పెడితే.. పార్టీ నిర్వహణ పరంగా చేసిన తప్పులేమిటో గమనిద్దాం. ఇప్పుడు అవే తప్పులు రిపీట్ అవుతున్నాయే అనే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధానంగా జగన్ చేసిన నాలుగు తప్పులు పార్టీని శిధిలం చేసేశాయి. ఒకటి– ఐప్యాక్, రెండు– రీజినల్ కోఆర్డినేటర్స్, మూడు– చెవిరెడ్డి సర్వేలు, నాలుగు– కార్యకర్తలతో బంధం పలచబడడం!

ఈ నాలుగుతప్పులు ఏ ఒక్కరో సూత్రీకరించినవి కాదు. పార్టీ అగ్రనాయకులు, సామాన్య కార్యకర్తలు కూడా ఫీలవుతున్న తప్పులు! అయితే వారెవ్వరూ జగన్ తో వీటిని చెప్పడానికి సాహసించడం లేదా? అందుకు తగిన చనువు తీసుకోవడం లేదా? లేక, చెప్పినా ఆయన వినిపించుకోరు అని ఫిక్సయ్యారా? ఈ సంగతులు మనకు తెలియదు. కానీ ఓడిపోయిన తర్వాత మళ్లీ అవే తప్పులు పునరుక్తం అవుతున్నాయి. అవే తప్పులు అవే ఫలితాన్ని కదా ఇస్తాయి!

తప్పు 1: ఐ ప్యాక్

మనం రోడ్డు పక్కన ఒక మొక్కను నాటుతాం. రోడ్డమ్మట వెళ్లే పశువులు దానిని తినేయకుండా ఒక ట్రీగార్డ్ పెడతాం. ఆ ట్రీగార్డ్ కారణంగానే.. మొక్క భద్రంగా ఎదుగుతుంది. ఆ మొక్క క్రమంగా పెరిగి పెద్దదవుతుంది. మానుగా మారుతుంది. ఈ క్రమంలో మధ్యలో ఏదో ఒక దశలో ఆ ట్రీగార్డ్ ను మనం తీసిపారేయాలి. లేకపోతే.. ఏ ట్రీగార్డ్ అయితే మొక్కను జాగ్రత్తగా కాపాడుతూ వచ్చిందో.. అదే మొక్క మానుగా ఎదగడానికి అడ్డం పడుతుంది! సూటిగా చెప్పాలంటే ఐప్యాక్ కూడా ట్రీగార్డ్ లాంటిదే.

అత్తారింటికి దారేది చిత్రంలో ఒక డైలాగ్ ఉంటుంది. పవన్ కల్యాణ్ తో రావు రమేష్ చెబుతాడు. ‘నువ్వు మెడిసిన్ లాంటి వాడివి సిద్దూ. కానీ మెడిసిన్ కు కూడా ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుంది’ అని! ఐప్యాక్ కూడా మెడిసిన్ లాంటిదే. ఐప్యాక్ కు ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుందనే సంగతి తెలుసుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి! ఐప్యాక్ అంటే.. ఎన్నికల వ్యూహకర్తలుగా అనుభవం ఉన్న సంస్థ! ఆ సంస్థను ఎన్నికలు ముగియడంతో, అధికారం దక్కడంతో వారి పని పూర్తయినట్టు. ఆ తర్వాత కూడా వారి సేవల్ని వాడుకోవడం అనేది ఎక్స్‌పెయిరీ డేట్ దాటిపోయి విషంగా మారిన మెడిసిన్ తీసుకోవడం లాంటిది. జగన్ పరిపాలనలో కూడా వారిని భాగస్వాముల్ని చేసి చాలా పెద్ద తప్పు చేశారు.

అధికారంలోకి రావడానికి రకరకాల వ్యూహాలు పన్నడం అలవాటు అయిన వారు.. ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో, ప్రభుత్వం ఎలాంటి పనులు చేయాలో ఏం చేయకూడదో తాము శాసించడం ప్రారంభించారు. అలాంటి పనులకోసం ప్రజల్లో మెలగడం అలవాటుగా ఉన్న సీనియర్ నాయకులను వాడుకుని ఉండాలి. ఆ పని జగన్ చేయలేదు. అది ఐప్యాక్ వారికి తెలిసిన విద్య కాదు. సింపుల్ గా చెప్పాలంటే వారు నేర్చుకుంటూ ఆ పనిచేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వారు తమ పరిపాలన సిద్ధాంతాలను, పాలకులుగా ఉండాల్సిన వ్యూహాలను ప్రయోగాత్మకంగా పనిచేశారు. మెడికల్ ట్రయల్స్ కు వాడే ఎలుక, కుందేలు, గినీ పిగ్ లాగా.. జగన్ ప్రభుత్వాన్ని ఐప్యాక్ వాడుకున్నది. పర్యవసానం ఏమైందో మనం చూశాం. ప్రయోగం వికటించి.. ప్రభుత్వం కూలిపోయింది.

జగన్ వారికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే.. ఎన్నికలు ముగిసిన తర్వాత.. 175+25 మంది అభ్యర్థులతో ఓ మీటింగు గానీ.. జిల్లా సారథులతో, కీలక నాయకులతో ఓ భేటీ గానీ ఇలాంటివేమీ చేయలేదు. ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి.. వారికి థాంక్స్ చెప్పి కానుకలు ఇచ్చి.. మనం గెలుస్తున్నాం లాంటి డైలాగులు పలికి వారితో చప్పట్లు కొట్టించుకుని మురిసిపోయారు. పార్టీ దారుణంగా ఓడిపోగానే.. ఐప్యాక్ తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోయింది.

జగన్ ఎంతటి అమాయకుడంటే.. అదే ఐప్యాక్ ను మళ్లీ తీసుకు వచ్చి పార్టీ సేవలకు వాడుకుంటున్నారు. వందల కోట్ల డీల్ సెట్ అయినట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షమే కదా.. ఐప్యాక్ ఎన్నికల వ్యూహరచన పరంగా ఉద్ధండులని అంటున్నారు కదా.. మరి జగన్ నిర్ణయం కరెక్టే కదా అని వాదించవచ్చు. కానీ.. ఐప్యాక్ ఇతర రాష్ట్రాల్లో ఏమో గానీ.. జగన్ రాజకీయాలకు సంబంధించినంత వరకు వ్యూహాలకు వైరస్ సోకిన, వారి బుర్రల్లోని సాఫ్ట్ వేర్ కరప్ట్ అయిన సంస్థ! ఒకసారి జగన్ ప్రభుత్వాన్ని శాసించడం మరిగిన వారు.. 2019కి పూర్వం తరహాలో ఇప్పుడు కూడా వ్యూహాలు అందిస్తారని అనుకోలేం. వారి సేవలను తిరిగి వాడుకోవాలనుకోవడం జగన్ పెద్ద తప్పు.

తప్పు 2 : రీజినల్ కోఆర్డినేటర్లు

పార్టీ సంస్థాగత నిర్మాణంలో స్థానిక నాయకులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు విలువ లేకుండా చేసిన వ్యవస్థ రీజినల్ కోఆర్డినేటర్లు. కోఆర్డినేటర్లను నియమించిన నాటి నుంచి.. పార్టీలో లోలోపల ఎంతటి అసంతృప్తులు రగిలాయో పార్టీ వారికి తెలుసు. ఎవడైతే ప్రజల వద్దకు వెళ్లి వారిదగ్గర మంచి పేరు తెచ్చుకోవాలో.. ఎవరు ఎన్నికల్లో పోటీచేసి నెగ్గాలో అలాంటి ప్రజాప్రతినిధుల్ని.. పార్టీ పరంగా ఈ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ డమ్మీలుగా మార్చేసింది.

రీజినల్ కోఆర్డినేటర్లు తమను తాము పార్టీకి సామంతరాజులుగా, పెత్తందార్లుగా, పాలెగాళ్లుగా భావించుకున్నారు. తమ పరిధిలో పార్టీ నాయకులందరూ కూడా తమ చెప్పుచేతల్లో, అదుపాజ్ఞల్లో ఉండాలన్నట్టుగా వ్యవహరించారు. ఈ పోకడలు పార్టీ నిర్మాణాన్ని దెబ్బతీశాయి. చాలాచోట్ల రీజినల్ కోఆర్డినేటర్లతో ప్రజాప్రతినిధులో విబేదాలతోనే అయిదేళ్లు గడిపారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

అలాంటి విఫల వ్యవస్థను, సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్లీ తీసుకువచ్చారు. సేమ్ టూ సేమ్ ఇప్పుడు మళ్లీ అదే జరుగుతోంది. మళ్లీ పార్టీ నాయకుల మధ్య అవే లుకలుకలు, అసంతృప్తులు. బయటకు కనపడని వేరుపురుగు లాంటిది పార్టీనిర్మాణాన్ని తొలిచేసే పరిస్థితి.

తప్పు 3: చెవిరెడ్డి సర్వేలు

జగన్ ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటు గరిష్టంగా పక్కదారి పట్టించిన, ఒక రకంగా భ్రష్టు పట్టించిన వ్యవహారం చెవిరెడ్డి సర్వేలు! సర్వేలు చేసేవాడికి తిరుగులేని నిజాయితీ, నిర్భయం, స్వచ్ఛత ఉండాలి. అవేమీ లేని వారి సారథ్యంలో సర్వేలు తయారైతే అవి పార్టీని ఏ ప్రస్థానానికి తీసుకువెళ్తాయి. జగన్ చేసిన గొప్ప పని ఏంటంటే.. ప్రభుత్వం పనితీరుమీద ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ.. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అంతవరకు గొప్ప విషయం. కానీ ఆయన చేసిన పెద్ద నేరం ఏంటంటే.. ఆ సర్వేలను పైన చెప్పుకున్న లక్షణాలు ఏవీ లేని చెవిరెడ్డి బృందాలతో చేయించడం.

ప్రభువు మనసెరిగి నడుచుకోవాలని భావించేవారు… ప్రభువు కళ్లలో ఆనందం చూడాలని తపన పడేవారు సర్వే నివేదికల్ని నిజాయితీగా ఇస్తారని అనుకోవడం భ్రమ. కర్ర విరగకుండా పాము చావకుండా సర్వే ఫలితాల్ని చెప్పాలని అనుకోవడం వల్ల అవి దారి తప్పాయి. సూటిగా చెప్పాలంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నదనే సంగతి వారి సర్వేల్లో ఎన్నికలకు చాలా కాలం కిందటే అర్థమైంది. కాకపోతే.. ఆ నివేదికలు జగన్ వరకు చేరేసరికి వాస్తవాలు రూపుమార్చుకున్నాయని ఇప్పుడు అనిపిస్తోంది.

‘ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానికంగా ఎమ్మెల్యేల మీదనే తప్ప.. ప్రభుత్వం మీద కాదు’ అనే రూపంలో నివేదికలు జగన్ కు అందాయేమో అనిపిస్తోంది. అందుకే ఆయన విచ్చలవిడిగా అభ్యర్థుల్ని మార్చారు. చదరంగం గడుల్లో పావుల్ని కదిపినట్టుగా.. ఒక ఊరినించి ఇంకో ఊరికి బోలెడు మందిని బదిలీచేశారు. ఒకచోట చెల్లని నాణెం అని తనే పరోక్షంగా ధ్రువీకరిస్తూ.. మరోచోట పోటీకి పెట్టడం వారి ఇమేజిని పాడుచేస్తుందని కూడా జగన్ గ్రహించలేకపోయారు.

ప్రజలు వద్దనుకుంటున్నది తన పాలనను అని, ఎమ్మెల్యేలను మాత్రమే కాదని.. జగన్ కు అర్థం కాలేదు. మూడు రాజధానుల కాన్సెప్టు పట్ల విశాఖవాసుల్లో కూడా విలువ లేనప్పుడు.. దానిని స్పష్టంగా పసిగట్టలేని సర్వేలు.. ఎంత దండగమాలిన సర్వేలో అర్థం చేసుకోవాలి.

ఇప్పుడు ఏమవుతోంది? చెవిరెడ్డి భాస్కర రెడ్డి కేవలం సర్వేలకు పరిమితం కావడం కాదు కదా.. పార్టీలో మరింత బలమైన శక్తిగా ఎదిగారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని ఏ స్థానంలో ఉంచాలో, ఏ సేవలకు వాడుకోవాలో.. ఏ పనులకు వాడుకోకూడదో తాను డిసైడ్ చేసే లెవెల్ కు వెళ్లారు. జగన్ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరు అయ్యారు. ఇక పార్టీ ఏ వెలుగులవైపు ప్రస్థానం సాగిస్తుంది.

తప్పు 4: కార్యకర్తలతో బంధం పలచబడడం!

పార్టీ ఎంత గొప్పది అయినా.. జగన్మోహన్ రెడ్డి చరిష్మా ఎంత అద్భుతమైనది అయినా.. వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉండే ప్రజల్లో ఉండే అనన్యమైన భక్తి ఎంత అండగా నిలిచినా.. పార్టీకి కార్యకర్తలు మాత్రమే తిరుగులేని మూలస్తంభాలు అనే సంగతి ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఏ పార్టీకైనా అంతే. అయితే కార్యకర్తలతో ఉండగల, ఉండవలసిన అనుబంధాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు పలుచన చేసేశాయి. కార్యకర్తలకు ప్రజల్లో విలువలేకుండా చేశాయి.

ఇలాంటి పెడపోకడకు వాలంటీర్ల వ్యవస్థ కూడా కొంత దోహదం చేసింది. వాలంటీర్ల వ్యవస్థలో ఉండే అద్భుతమైన ఎడ్వాంటేజీలు వేరు. వాటిని కాదనలేం. కానీ.. అవి కార్యకర్తల వ్యవస్థను పుచ్చిపోయేలా చేసాయనేది కూడా సత్యం.

కార్యకర్తలకు అటు ప్రజల వద్ద, ఇటు ఎమ్మెల్యేల వద్ద కూడా గౌరవం లేకుండా పోయింది. ఒక ఊళ్లో పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే.. ఎమ్మెల్యేలు అక్కడి కార్యకర్తలతో ప్రేమగా మెలుగుతూ వారిద్వారా తెలుసుకోవాలి. అక్కడ తేడాలుంటే వారి ద్వారా చక్కదిద్దాలి. ఇలాంటి రెండు పనులకూ కూడా ఎమ్మెల్యేలు ఇతర నాయకులు వాలంటీర్లనే వాడుకోవడం మొదలైంది. కార్యకర్తలు పూర్తిగా లూప్ లైన్లోకి వెళ్లారు. క్రమేపీ వ్యవస్థ ఎలా అయిందంటే.. కార్యకర్తలు ఆబ్లిగేషన్లతో ఎమ్మెల్యేల వద్దకు వెళ్లడం తప్ప.. పార్టీ కిందిస్థాయి సారధులుగా పార్టీకి మేలు చేయడానికి వెళ్లి ఎమ్మెల్యేను కలవడం అనేది జరగకుండాపోయింది. పార్టీ నిర్మాణంలో ఈ వ్యవస్థ చెడిపోయింది.

దీనిని చక్కదిద్దడం గురించి జగన్ ఆలోచిస్తున్నట్టు కూడా లేదు. ఏదో గుడ్ బుక్ అని, గ్రీన్ బుక్ అని రకరకాల మాటలు జగన్ చెబుతున్నారు గానీ.. కార్యకర్తలకు నమ్మకం చిక్కడం లేదు. కార్యకర్తలే పార్టీకి బలం అని తాను గుర్తించినట్టుగా మాటలు చెప్పడం కాదు.. చేతలతో జగన్ నిరూపించుకోవాలి. అప్పుడే పార్టీకి మేలు జరుగుతుంది.

అదృష్టం రొటేషన్ లో వస్తుందనుకుంటున్నారా?

జగన్మోహన్ రెడ్డి పార్టీ నిర్వహణ, వ్యవహార సరళి, నమ్ముతున్న నాయకులు, తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ గమనిస్తే.. ఆయన పార్టీని గాడిలో పెట్టి.. ప్రజల్లో ఆదరణ పెంచుకుని.. ఢంకా బజాయించి తిరిగి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపించడం లేదు. అయిదేళ్లపాటూ ఏదో పార్టీని సాగదీస్తూ ఉంటే చాలు.. ప్రజలు ఎన్డీయే కూటమి పాలనతో విసిగిపోయి.. వేరే గత్యంతరం లేదు గనుక.. మళ్లీ తనకే అధికారం కట్టబెడతారు. అదృష్టం తనను రొటేషన్ లో వరిస్తుంది.. అనే భావనతో గడుపుతున్నారా? అనే అనుమానం కలుగుతుంది.

నిజానికి ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం కానే కాదు. కానీ.. ఒక దశలో ఏ నాయకుడికైనా ఇలాంటి వైరాగ్యం కలగడం సహజం. జగన్ కూడా అలాంటి స్థితిలో ఉన్నారా? అనేది సందేహం! సాధారణంగా పరిపాలనలో ఉండగా.. అనేకానేక ప్రజాసంక్షేమ నిర్ణయాలు తీసుకున్న వారు అనూహ్యమైన ఓటమిని చవిచూస్తే షాక్ తింటారు. ఈ ప్రజల కోసం ఇంత చేశాను కదా.. అయినా ఓడించారే.. ఈ ప్రజలకు ఏమీ చేయకపోయినా పర్లేదు.. అనే తరహా వైరాగ్యం వారిలో వస్తుంది. జగన్ కూడా బహుశా అలాంటి స్థితికి చేరుకుని ఉంటే అది ప్రమాదకరం. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచిదని తాను ఏం తలచారో అవన్నీ చేశారు. కానీ.. అవన్నీ ప్రజలు కోరుకుంటున్నవేనా? కాదా? అనేది క్రాస్ చెక్ చేసుకోలేకపోయారు.

పసిపిల్లలతో అయినా ఇలాంటి సిద్ధాంతం ఒకటి గుర్తుంచుకోవాలి. ఒక పిల్లవాడు తండ్రిని రోడ్డు మీద పుల్ల ఐసు అడిగాడని అనుకుందాం. అర్దరూపాయి విలువ చేసే ఆ ఐస్ కొనివ్వకుండా, తండ్రి బ్రాండెడ్ దుకాణానికి తీసుకెళ్లి ఐదొందల రూపాయల విలువైన ఐస్ క్రీములు తినిపించడాని అనుకుందాం. అంత చేసినా ఆ పసివాడికి పెద్ద తృప్తి ఉండదు. పుల్ల ఐస్ తో పొందగలిగిన ఆనందంలో పదో వంతు కూడా ఆ కాస్ట్‌లీ ఐస్ క్రీం వల్ల అతడు పొందలేడు. ఈ విషయాన్ని ముందుగా తండ్రి గుర్తించాలి.

రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా, రాష్ట్ర ప్రజలందరికీ పెద్దదిక్కుగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడంలో జగన్మోహన్ రెడ్డి విఫలం అయ్యారు. అధికారంలోకి రావడానికి ముందు– అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కొన్ని వందల వేల సర్వేలు చేయించి ఉంటారు. అవన్నీ దాదాపుగా తాను చేస్తున్న పనుల గురించి, తీసుకున్న నిర్ణయాల గురించి జనాభిప్రాయాలు తప్ప.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ప్రజలు తననుంచి ఏం కోరుకుంటున్నారో.. తెలుసుకునే ప్రయత్నం జరిగిందా? అనేది సందేహం.

మూడురాజధానుల వంటి కాన్సెప్టులు ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి సరికదా.. ఆయా ప్రాంత ప్రజల ఆమోదం కూడా పొందలేకపోయాయి. కేవలం రాజధాని సంగతి మాత్రమే కాదు.. ప్రజల ఆకాంక్షలు ఏమిటో ప్రభుత్వం గుర్తించలేకపోయింది. ఇప్పుడు పార్టీగానైనా ఆ పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.

.. ఎల్.విజయలక్ష్మి

47 Replies to “అన్నీ ‘తప్పు’టడుగులే!”

  1. మేడం ..

    మొత్తం ఆర్టికల్ చదవలేదు.. చదివాలనే ఇంటరెస్ట్ కూడా లేదు..

    ఎందుకంటే.. గత నాలుగేళ్లుగా మేమందరమూ ఇక్కడ చెపుతున్నదే .. అంతకుమించి ఏ నా బొక్కా ఉండదు…

    ఇక..

    పరిపాలన లో లోపాల గురించి .. జరిగిన అన్యాయాలు, అవినీతి, అక్రమాలు, అమానుషాలు గురించి ఒక్క ముక్క కూడా రాయలేదు..

    పార్ట్ 2 వస్తుందా..? చదివి తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికీ లేదు.. చదివి మార్పు చెందాలనే ఆలోచన కూడా జగన్ రెడ్డి కి లేదు.. ఆ ప్రయత్నం కూడా చేయడు ..

    ఇక వదిలేయండి మేడం.. ప్రజలు ఆ చీకటి రోజులు మర్చిపోయి.. ఉషోదయాలను అభివృద్ధి కి ఆలంబనగా పయనమవుతున్నారు..

    రాష్ట్రం పట్ల మీ వంతుగా మంచి చేయాలనే ఆలోచన ఉంటె.. జగన్ రెడ్డి లాంటి క్రిమినల్స్ ని ఈ రాజకీయాలకు దూరం గా ఉంచండి.. కుదిరితే వ్యతిరేకించండి.. అదే మీరు ప్రజలకు చేసే సేవ..

    1. ఎంత అమాయూకుడివి. పులి పాలు తాగి తోట కూర తుంటుందా ?? మల్ల ఈ రోజే కూటమి వైఫల్యం అని అదిగో కూటమి దోపిడీ అని ఉన్నల్వి లేనివి ప్రచారం లోకి తెస్తారు .

    2. అమరావతి కి వరదలు..

      సీమ కి ఉత్తరాంధ్ర కి అన్యాయం

      అమరావతి తప్ప.. బాబు కి ఏమి అవసరం లేదు…

      ఇప్పుడు కూడా ఇవే సై.కో రాతలు

  2. article summary in one sentence…

    “తాను చేసినవన్నీ ఒప్పులే.. తప్పుల్లేవ్ అని త్రికరణ శుద్ధిగా నమ్మే వాళ్లను అమాయకులు అనుకోవాలా”…

    article tries to say innocent but in reality, they are pagal and narcissist bi-polar…

  3. article in one summary….

    “తాను చేసినవన్నీ ఒప్పులే.. తప్పుల్లేవ్ అని త్రికరణ శుద్ధిగా నమ్మే వాళ్లను అమాయకులు అనుకోవాలా”..

    its not called innocent but pagal

  4. “తాను చేసినవన్నీ ఒప్పులే.. తప్పుల్లేవ్ అని త్రికరణ శుద్ధిగా నమ్మే వాళ్లను అమాయకులు అనుకోవాలా”

    pagal fellow

  5. తాను చేసినవన్నీ ఒప్పులే.. తప్పుల్లేవ్ అని త్రికరణ శుద్ధిగా నమ్మే వాళ్లను అమాయకులు కాదు “నియంతలు”అనుకోవలి..

  6. అరె విజయ లక్ష్మి గా ఇంకా ఆడ పేరుతోనే ఆర్టికల్స్ రాస్తున్నావా? నువ్వెంత mellow down చేసి చెప్పినా వాడేమీ అమాయుకుడు కాదు!! ఆ పార్టీ కి ఇంకా భవిష్యత్ లేదు వంకాయి లేదు, వీడు చేసిన నేరాలకి జైల్ లో కూర్చొని పిస్సుకోవటమే!!

  7. చెవి రెడ్డి సర్వే బదులు …జగనన్న ప్రతి రోజూ ఈనాడు పేపర్ చదివితే తెలిసేది …జనాల అభిప్రాయం…

  8. చెవిటోడు ముందు..కాదు కాదు బ్రహ్మ చెవుడు వాడికి..వాడి ముందు శంఖం వూది నట్లు వున్నాయి ఈ ఆర్టికల్స్!

  9. ఎదుటి పక్షం మీద నెగటివటీ సృష్టించటం తో పాటు మనం మన పాలనలో చేసిన కొన్ని మంచి పనులు చేసుంటే మరల అధికారంలోకి వచ్చే అవకాశామ్ వుంది.. కాబట్టే టీడీపీ ఓడినా మరల గెలుస్తుంది..కనీసం కలసి రావటానికి పార్టీ లు కూడా వుంటాయి.. కానీ జగన్మోహన్ రెడ్డి కి ఇవేం లేవు.పైపెచ్చు విద్వం..సం.. బూ..తులు…దా..dulu… ఎందుకు వోట్ వేస్తారు వైసీపీ కి?

  10. Jagan gelavadaniki 5 reasons 19 lo 1cader2 family 3 sentiment oka sari avakasam ivvalani 4 community Chala strong Ga nilabaddru financial Ga kuda 5 jagan hard work 2024 lo ave minus avinayi

  11. వాలింటర్ లు అందరూ వై సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులే, వాళ్ళందరూ ఏమైనా పరీక్షలల్లో అర్హులైన వారా.. వై సిపి నాయకులు నియమించిన వ్యక్తులే కదా. దాదాపు లక్ష మంది ఎన్నికల ముందు వాళ్ళు వాలింటర్ డ్యూటీ కి రాజీనామా చేసి మేము వై సీపీ కి ప్రచారం చేస్తాం అన్నారు..

  12. వాలింటర్ లు అందరూ వై సీ పీ కార్యకర్తలు, సానుభూతి పరులే, వాళ్ళందరూ ఏమైనా పరీక్షలల్లో అర్హులైన వారా.. వై సి పి నాయకులు నియమించిన వ్యక్తులే కదా. దాదాపు లక్ష మంది ఎన్నికల ముందు వాళ్ళు వాలింటర్ డ్యూటీ కి రాజీనామా చేసి మేము వై సీ పీ కి ప్రచారం చేస్తాం అన్నారు..

  13. వా లింటర్ లు అందరూ వై సీ పీ కార్యకర్తలు, సానుభూతి పరులే, వాళ్ళందరూ ఏమైనా పరీక్షలల్లో అర్హులైన వారా.. వై సిపి నాయకులు నియమించిన వ్యక్తులే కదా. దాదాపు లక్ష మంది ఎన్నికల ముందు వాళ్ళు వా లింటర్ డ్యూటీ కి రాజీనామా చేసి మేము వై సీ పీ కి ప్రచారం చేస్తాం అన్నారు..

  14. అభినందన సినిమా లో.. అదే నీవు.. అదే నేను.. అదే గీతం పాడనా…. పాట గుర్తు వచ్చింది

  15. ఎన్ని విశ్లేషణలు చేసినా అక్కడ చదివేదెవరు? మారేదెవరు? వృధా కంఠశోష తప్ప.

  16. ikkada ejay ane pedda manishiki బా..లకృష్ణ వా..చ్మా//న్ మీద కా//ల్పు..లు జరిపాడు అనే విషయమే తెలీదంటా . ఆయనే స్వయం గ చెప్పారు . ఆ విష్యం ఆడితే , అస్సలు సమాధానా ఇవ్వకుండా పారిపోతున్నాడు ? టీ..డీ//పీ పార్టీ లో జరిగే అన్ని తెలుసు కానీ ఈ కాల్పులు విహస్యం తెలీదంటా ? ఇది ఒక నేషనల్ న్యూస్ అయ్యి కూర్చుంది అప్పట్లో. నిజాం హాస్పిటల్ లో జాయిన్ అయ్యి కాకర్ల సుబ్బారావు అనే డాక్టర్ తో మెంతల్ల్య్ dis..ab//led అని సర్టిఫికెట్ తెచ్చుకొని కేసు క్లోజ్ చేయించుకున్న ఈ బా..ల..కృ//ష్ణ న్యూస్ @ejay అనే కామెంటె//ర్ కి అస్సలు తెలీదు అంట .దీని గురుణఃసి అడిగితే సంధానం చెప్పకుండా తప్పించు కుంటున్నాడు . నీ పా..ర్టీ మనిషి తప్పు చేస్తే నిజాం ఒప్పుకోలేని నీకు, ఏ విధంగా ఇంకొకరిని ప్రశించే అధికారం వుంది .

  17. ikkada ejay ane pedda manishiki బా..ల..కృష్ణ వా..చ్మా//న్ మీద కా//ల్పు..లు జరిపాడు అనే విషయమే తెలీదంటా . ఆయనే స్వ//యం గ చెప్పారు . ఆ విష్యం ఆడితే , అస్సలు సమాధానా ఇవ్వకుండా పా..రిపో//తున్నాడు ? టీ..డీ//పీ పార్టీ లో జరిగే అన్ని తెలుసు కానీ ఈ కా.ల్పు//లు విహస్యం తెలీదంటా ? ఇది ఒక నే..షనల్ న్యూస్ అయ్యి కూర్చుంది అప్పట్లో. ని.జాం హాస్పిటల్ లో జాయిన్ అయ్యి కా//క..ర్ల సు..బ్బారా//వు అనే డా//క్టర్ తో మెం./తల్ల్య్ dis..ab//led అని సర్టిఫికెట్ తెచ్చుకొని కేసు క్లోజ్ చేయించుకున్న ఈ బా..ల..కృ//ష్ణ న్యూస్ @ejay అనే కామెంటె//ర్ కి అస్సలు తెలీదు అంట .దీని గురుణఃసి అడిగితే సంధానం చె..//ప్పకుండా తప్పించు కుం..టున్నాడు . నీ పా..ర్టీ మనిషి తప్పు చేస్తే నిజాం ఒ..ప్పు//కోలేని నీకు, ఏ విధంగా ఇంకొకరిని ప్రశించే అధికారం వుంది .

  18.  ikkada ej..ay ane pedda manishiki బా..ల//..కృష్ణ వా..చ్మా//న్ మీద కా//ల్పు..లు జరిపాడు అనే విష..య//మే తెలీదంటా . ఆయనే స్వయం గ చెప్పారు . ఆ విష్యం ఆడితే , అస్సలు సమాధానా ఇ..వ్వ//కుండా పా..రి//పో..తున్నా..డు ? టీ..డీ//పీ పార్టీ లో జరిగే అన్ని తెలుసు కానీ ఈ కాల్పులు వి..హ..స్యం తె..లీ//దంటా ? 

    1. ఇది ఒక ..నేష//నల్ న్యూస్ అయ్యి కూర్చుంది అప్పట్లో. ని..జాం హా..//స్పిటల్ లో జాయిన్ అయ్యి కా//క..ర్ల సు…బ్బా//రా,.వు అనే డా..క్ట.ర్ తో మెం..తల్ల్య్ dis..ab//led అని సర్టిఫికెట్ తెచ్చుకొని కేసు క్లోజ్ చేయించుకున్న ఈ బా..ల..కృ//ష్ణ న్యూస్ @ejay అనే కామెంటె//ర్ కి అస్సలు తెలీదు అంట .దీని గురుణఃసి అడిగితే సంధానం చెప్పకుండా తప్పించు కుంటున్నాడు . నీ పా..ర్టీ మని..షి తప్పు చేస్తే ని..జాం ఒ..ప్పు//కోలే..ని నీకు, ఏ విధంగా ఇంకొకరిని ప్రశించే అధికారం వుంది .

      1. అవును సిద్ధూ.. బాలకృష్ణ కాల్పుల సంగతి మీరే చెప్పారు.. బాలకృష్ణ ని మహామేతగాడు కాపాడాడని కూడా మీరే చెప్పారు..

        తప్పు చేసిన వాళ్ళ దగ్గర లంచం తీసుకుని సీఎం సీట్ లో ఉన్న వ్యక్తి ఒక క్రిమినల్ కాపాడటం ఎందుకు..? అది కర్రెక్ట్ అనుకొంటున్నారా..?

        అవును సిద్ధూ.. ఇంకో ప్రశ్న…

        నారాసురరక్తచరిత్ర అని సీఎం సీట్ లో కూర్చున్న జగన్ రెడ్డి.. సీఎం అయ్యాక చంద్రబాబు ని ఎదనుకు వదిలేసాడు.. సిబిఐ ఎంక్వయిరీ వద్దని ఎందుకు కౌంటర్ దాఖలు చేసాడు..?

        అంటే.. చంద్రబాబు దగ్గర లంచం తీసుకుని బాబాయ్ చంపిన వాళ్ళని కాపాడాలనుకొన్నాడా నీ జగన్ రెడ్డి.. అది కర్రెక్ట్ అనుకొంటున్నారా..?

        ఈ పులివెందుల అబ్బాకొడుకులకు ఈ లంచం దేన్గితినే అలవాటు ఏమిటి..?

  19. అక్కయ్య, మీకు తాడేపల్లి ప్యాలస్ అడ్రస్ తెలుసు కదా? వెళ్లి చెప్పవచ్చు కాదా!

    లేదా వదినమ్మ ఆఫీసు కి వెళ్ళి అయిన చెప్పవచ్చు కాదా, ఆ ఇప్యాక్ కాంట్రాక్టు లో వెంకట రెడ్డి గారికి కూడా ఒక పది పైసలు వాటా విడిలించమను అని.

    1. వచ్చేది సొంత తల్లే అని పొరపాటు పడి తలుపు చాటు నుండి గొడ్డలి తో ఎటాక్ చేస్తే..?

      1. ఒక కన్ను ఇంకో కన్నుని పొడుస్తుందా అద్యక్షా?! అలా ఏమీ జరగదు, కాకపోతే గుండెపోటు వస్తే మా పూచీ లేదు.

  20. సైతోన్మాధి పరదాల చాటు పులికేశి గాడు కళ్ళున్న గుడ్డి చెవులు ఉన్న చెవిటి , నోరు ఉన్న మూగ , వాడొక చేవచచ్చిన చేతకాని చవట దద్దమ్మ వాడిలో ఏ సమర్ధత లేదు , రాజకీయ అనర్హుడు

  21. వాడు తుప్పు పట్టి పోయాడు. నువ్వు వాడి తప్పుల్ని వెదుకుతూ, వాడి చెవి తుప్పు వదిలించాలని ఇలాంటి తుప్పు ఆర్టికల్స్ రాయటం మానేసేయ్.

Comments are closed.