వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు రేవంత్ స‌ర్కార్ షాక్‌!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లా టీడీపీ నేత‌, మైల‌వ‌రం ఎమ్మెల్యే వసంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ షాక్ ఇచ్చింది.

ఉమ్మ‌డి కృష్ణా జిల్లా టీడీపీ నేత‌, మైల‌వ‌రం ఎమ్మెల్యే వసంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ షాక్ ఇచ్చింది. ఆయ‌న ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా కూల్చేసింది. ప్ర‌భుత్వ స్థ‌లాన్ని ఆక్ర‌మించి, క‌ట్ట‌డాలు చేయ‌డంతోనే కూల్చివేసిన‌ట్టు హైడ్రా అధికారులు తెలిపారు. హైద‌రాబాద్‌లో అక్ర‌మ క‌ట్ట‌డాల్ని హైడ్రా గ‌త కొన్ని నెల‌లుగా కూల్చి వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం హైద‌రాబాద్‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కొండాపూర్ ఆర్టీఏ కార్యాల‌య స‌మీపంలోని స‌ర్వే నంబ‌ర్ 79లో 39 ఎక‌రాల‌పై వివాదం ఏర్ప‌డింది. ఈ విష‌య‌మై హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్ట‌డాన్ని హైడ్రా అధికారులు గుర్తించారు. దీంతో వాటిని తొల‌గించేందుకు భారీగా పోలీస్ బందోబ‌స్తుతో వెళ్లారు.

ఆక్ర‌మించిన స్థ‌లానికి వేసిన ఫెన్సింగ్‌, భారీ షెడ్ల‌ను జేసీబీల‌తో హైడ్రా అధికారులు తొల‌గించారు. ఇదే స‌మ‌యంలో వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ కుటుంబ స‌భ్యులు అడ్డుకోడానికి ప్ర‌య‌త్నించార‌ని స‌మాచారం. అయితే పోలీసులు వాళ్ల‌ను నిలువ‌రించారు. దీంతో నిస్స‌హాయ స్థితిలో వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ కుటుంబ స‌భ్యులు ఉండిపోయారు.

ఒక‌వైపు సీఎం చంద్ర‌బాబునాయుడి శిష్యుడిగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గుర్తింపు పొందారు. అలాంటి రేవంత్‌రెడ్డి పాల‌న‌లో టీడీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చివేత‌కు గురి కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

7 Replies to “వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు రేవంత్ స‌ర్కార్ షాక్‌!”

  1. అ police officer కు BuildUp తప్పా ఇంకెమి చెతకాదు

    సగం చెరువులొ కట్టిన MIM Leaders కాలెజ్ తప్పా అన్ని కూలుస్తున్నారు

    Revanth కు దమ్ములెదు ..నీకు దమ్ములెదొ అర్థం కావడం లెదు police officer ..

  2. ఎ political party అయినా సరె MIM  వారి సంక నాకడం Common  అన్నమాట

    మీకంటె ఆ కిరణ్ కుమార్ రెడ్డె మెలు కదరా….వారి అక్రం కట్టడాలు ఎందుకు కూల్చలెదు

  3. ప్యాలెస్ పులకేశి గాడు ప్యాలెస్ నీ కూడా హైడ్రా వాళ్ళు కూలగొట్టాలి. 

    అప్పట్లో ఆమ్రపాలి సపోర్ట్ తో

    వక్ఫ్ కి చెందిన భూమిలో కట్టిన పద్మ తటాకం కులగొట్టకుండా ఆపుకున్నాడు, ప్యాలెస్ పులకేశి గాడు.

Comments are closed.