రేవంత్ స‌ర్కార్‌కు కొర‌క‌రాని కొయ్య‌.. స్మితా స‌బ‌ర్వాల్‌!

తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌కు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి స్మితా స‌బ‌ర్వాల్ కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యారు.

తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌కు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి స్మితా స‌బ‌ర్వాల్ కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యారు. కంచ గ‌చ్చిబౌలి భూముల వ్య‌వ‌హారంపై ఆమె ఎక్స్ వేదికగా కాంగ్రెస్ స‌ర్కార్‌కు చుర‌క‌లు పెడుతూ పోస్టు పెట్టారు. బుల్డోజ‌ర్లు ఆ స్థ‌లంలో దిగిన‌ట్టు, వాటి ముందు నెమ‌ళ్లు, ఇత‌ర ప‌శుప‌క్ష్యాదులున్న‌ట్టు ఆమె పెట్టిన పోస్టు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్ర‌స్తుతం రాష్ట్ర ప‌ర్యాట‌క‌శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్న స్మితా స‌బ‌ర్వాల్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీన్నిబ‌ట్టి ఆమెపై ప్ర‌భుత్వం కోపంగా ఉన్న‌ట్టు అర్థం చేసుకోవ‌చ్చు. త‌న‌కు నోటీసులు ఇచ్చిన నేప‌థ్యంలో మ‌రోసారి ఆమె ఎక్స్ వేదిక‌గా సీరియ‌స్‌గా స్పందించారు. తెలంగాణ పోలీసుల్ని నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.

నోటీసులు ఇచ్చిన గచ్చిబౌలి పోలీసుల‌కు పూర్తిగా స‌హ‌క‌రించిన‌ట్టు తెలిపారు. పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికి చ‌ట్టంపై గౌర‌వం ఉన్న వ్య‌క్తిగా వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్టు ఆమె వెల్ల‌డించారు. అయితే ఆ పోస్టును తాను రీపోస్టు చేసిన‌ట్టే, 2 వేల మంది షేర్ చేశార‌ని ఆమె గుర్తు చేశారు.

త‌నకు నోటీసులు ఇచ్చిన‌ట్టు, షేర్ చేసిన వాళ్లంద‌రికీ కూడా అదే ప‌ని చేస్తారా? అని ఆమె ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటారా? చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా? అని స్మితా స‌బ‌ర్వాల్ గ‌చ్చిబౌలి పోలీసుల్ని ప్రశ్నించారు. స్పష్టత కోసం అడిగిన‌ట్టు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి స్మితా వెల్ల‌డించడం విశేషం. స్మితా స‌బ‌ర్వాల్ వైఖ‌రి ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టేలా వుంది. అందుకే ఆమె విష‌యంలో రేవంత్ స‌ర్కార్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

7 Replies to “రేవంత్ స‌ర్కార్‌కు కొర‌క‌రాని కొయ్య‌.. స్మితా స‌బ‌ర్వాల్‌!”

    1. Neeli kj lk emiti 2000 members ki notice esthe arrest chestaru appudu ee lm ni kuda arrest chestara , appudu cs deggara permission kavali ani ias ani card use cheyada 

      Cheppara neeli kj lk lara

Comments are closed.