అమెరికాలో కాల్పులు.. తెలుగు యువ‌కుడి మృతి!

అమెరికాలో జ‌రిగిన కాల్పుల్లో తెలుగు యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు.

అమెరికాలో జ‌రిగిన కాల్పుల్లో తెలుగు యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు. హైద‌రాబాద్‌లోని చైత‌న్య‌పురికి చెందిన ర‌వితేజ ప్రాణాలు కోల్పోయిన‌ట్టు స‌మాచారం. ఇత‌ను 2022లో అమెరికాకు వెళ్లిన‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఎంఎస్ పూర్తి చేసుకున్న ఆ యువ‌కుడు ఉద్యోగాన్వేష‌ణ‌లో ఉన్న‌ట్టు తెలిసింది.

వాషింగ్ట‌న్ ఏస్‌లో అత‌నిపై దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. అమెరికాలో త‌ర‌చూ కాల్పులు జ‌ర‌గ‌డం, భార‌తీయులు ప్రాణాలు కోల్పోవ‌డం మామూలు విష‌య‌మైంది. అమెరికాలో గ‌న్ క‌ల్చ‌ర్ గురించి అంద‌రికీ తెలిసిందే.

అమెరికాలో తుపాకి పేలిందంటే, భార‌త్‌లో త‌ల్లిదండ్రుల గుండె ద‌డ ఎత్తుకుంటోంది. ఎందుకంటే, అమెరికాకు విద్య‌, ఉపాధి అవ‌కాశాల కోసం పెద్ద సంఖ్య‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లారు, వెళ్తున్నారు. ఒక‌వైపు అమెరికాలో దుండ‌గుల కాల్పుల్లో మ‌న‌వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నా, అక్క‌డికి వెళ్లే వాళ్ల సంఖ్య ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.

తాజాగా ర‌వితేజ మృతితో హైద‌రాబాద్‌లోని అత‌ని కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. ఉన్న‌త విద్య పూర్తి చేసుకున్న త‌మ కుమారుడు, త్వ‌ర‌లో ఉద్యోగంలో చేరి సంతోషంగా జీవితాన్ని గ‌డుపుతాడ‌ని ఆశిస్తున్న త‌ల్లిదండ్రుల‌కు పుట్టెడు శోకం మిగిలింది.

4 Replies to “అమెరికాలో కాల్పులు.. తెలుగు యువ‌కుడి మృతి!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.