కూట‌మి నెత్తిన భ‌స్మాసుర హ‌స్తం!

నాయ‌కులు ఎక్కువై, టికెట్లు ఇచ్చే ప‌రిస్థితి వుండ‌దు. అప్పుడు అనివార్యంగా వైసీపీనే దిక్కవుతుంది.

కూట‌మి త‌న నెత్తిన ఫిరాయింపుల భ‌స్మాసుర హ‌స్తాన్ని పెట్టుకుంటోంది. అధికారాన్ని కోల్పోయిన వైసీపీని వీడ‌డానికి స‌హ‌జంగానే నాయ‌కులు సిద్ధంగా ఉన్నారు. ఇప్ప‌టికే కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు పార్టీకి రాజీనామా చేశారు. రానున్న రోజుల్లో మ‌రికొంద‌రు పార్టీని వీడొచ్చు. రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ స‌ర్వ‌సాధార‌ణ‌మే. వీళ్లంతా ఉండ‌గానే క‌దా వైసీపీ ఘోర ప‌రాజ‌యంపాలైంది. నిజంగా వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌ల్లో ప‌లుకుబ‌డి ఉన్న‌వాళ్లే అయితే, ఎందుకు గెల‌వ‌ర‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా దెబ్బ కొట్టాలంటే, ఆ పార్టీని ఖాళీ చేస్తే స‌రిపోతుంద‌ని సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ అనుకుంటున్నారు. ప్ర‌త్య‌ర్థిని రాజ‌కీయంగా దెబ్బ‌తీయాల‌ని అనుకోవ‌డం స‌హ‌జం. అయితే వైసీపీలో ప్ర‌జాద‌ర‌ణ కోల్పోయి వ‌చ్చే వాళ్లంద‌ర్నీ త‌మ నెత్తినేసుకుని ఏం చేయాల‌ని అనుకుంటున్నారో కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కే తెలియాలి.

2014-19 మ‌ధ్య కాలంలో ఇదే ర‌కంగా చంద్ర‌బాబు వైసీపీని దెబ్బ కొట్ట‌డానికి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల‌ను టీడీపీలో చేర్చుకున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఏమైందో మ‌నంద‌రికీ తెలుసు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో వ్య‌క్తిగ‌త ప‌లుకుబ‌డి క‌లిగిన నాయ‌కులెవ‌రూ లేరు. పార్టీల బ‌ల‌మే త‌ప్ప‌, వ్య‌క్తిగ‌తంగా ఏ నాయ‌కుడికీ అంత సీన్ లేదు.

ఎంతో పేరున్న రాజ‌కీయ నాయ‌కుడికైనా వ్య‌క్తిగ‌తంగా వెయ్యి, 1500 ఓట్లు వుంటే గొప్పే. బీసీవై పార్టీ పేరుతో ఎన్నిక‌ల‌కు ముందు ఎంతో హ‌డావుడి చేసిన రామ‌చంద్ర‌య్య యాద‌వ్‌కు పుంగ‌నూరులో వ‌చ్చిన ఓట్లు 3 వేలు. ఎన్నిక‌ల్లో ఆయ‌న పెట్టిన ఖ‌ర్చు గురించి క‌థ‌లుక‌థ‌లుగా చెబుతుంటారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన ఆయ‌న‌కు ఓట్లు ఎందుకు వేయ‌లేదంటారు? వ్య‌వ‌స్థ పార్టీల ప‌రంగా విభ‌జ‌న‌కు గురైంది. అందుకే వైసీపీని నాయ‌కులు వీడి వెళ్లినంత మాత్రాన కొంప‌లేమీ మునిగిపోవు.

పైపెచ్చు కూట‌మి వాళ్లంద‌ర్నీ చేర్చుకుంటూ భ‌స్మాసుర హ‌స్తాన్ని పెట్టుకుంటోంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. పార్టీలో చేరే ముందు ఎవ‌రెన్ని నీతులు చెప్పినా, అంతిమంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి సీటు కోరుకుంటారు. కూట‌మి ఇట్లే కొన‌సాగుతుంద‌ని అనుకందాం. నాయ‌కులు ఎక్కువై, టికెట్లు ఇచ్చే ప‌రిస్థితి వుండ‌దు. అప్పుడు అనివార్యంగా వైసీపీనే దిక్కవుతుంది. కూట‌మి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆర్థికంగా బ‌ల‌ప‌డి, ఎన్నిక‌ల స‌మ‌యంలో అటు వెళ్లి పోటీ చేస్తే, న‌ష్ట‌మెవ‌రికి? కూట‌మికి కాదా?

మ‌రీ ముఖ్యంగా రానున్న ఎన్నిక‌ల్లో జ‌న‌సేన 21 అసెంబ్లీ, 2 లోక్‌స‌భ సీట్ల‌కే ఒప్పుకునే ప‌రిస్థితి వుండ‌దు. రెట్టింపు సంఖ్య‌లో ఇస్తే త‌ప్ప‌, ఒప్పుకునే అవ‌కాశం వుండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో చేరుతున్న వాళ్లంతా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. వాళ్లంద‌రికీ టికెట్లు ఇవ్వ‌క‌పోతే, ఇంకొక‌రి నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర‌చ‌డానికి అమాయ‌కులా? అందుకే కూట‌మి ఫిరాయింపుల‌తో భ‌స్మాసుర హ‌స్తాన్ని నెత్తిన పెట్టుకుంటోంద‌ని చెప్ప‌డం.

16 Replies to “కూట‌మి నెత్తిన భ‌స్మాసుర హ‌స్తం!”

      1. Good luck Pendyala.. Lokesh ni pappu annaru.. nippu ayyadu alane CM kuda avthadu.. mee opinion meedhi time answer istundhi let’s wait.. inka 4.5 years undhi elections ki

          1. Enthasepu pakkanolle kani mee jagan gurinchi dhyase ledhu😂😂😂😂😂😂😂.. ayina mee vallaki nv ayina cheppu intlo vallani bayata vallani boothulu body shaming kakunda paddhathiga matladamani appudu meeru kuda alochinchavachu..

  1. అంటే వీరు చెప్పేది జగన్ గారి చరిష్మా కి లోటులేదు కేవలం 164 మంది పనికి మాలినోళ్లు అనే అర్ధం వచ్చేలాగా రాస్తున్నారు ఈ ఓటమికి కారణం కేవలం జగన్ గారి దౌర్జన్యపాలన అభివృద్ధి లేకపోవటం తో న్యూట్రల్ వోటింగ్ పోయింది పోనీ నెక్స్ట్ ఎలక్షన్ లలో మల్లి వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటే ఈయనగారు గెలిచే అవకాశం ఉంటుంది సజ్జల గారు చెప్పినట్టు వాళ్ళు మీ ఓటర్ లు కాదు

  2. నాయకులది ఎం లేదు అంతా మావోడి ఓటు బ్యాంకు.. అందుకే ప్రజలు మావోడ్ని మావోడ్ని దె0గి దె0గి 11 మందిని ఇచ్చారు

    పార్టీ నుండి ఉన్న నాయకుల0దరినీ తరిమేసి కేవలం ఆ నలుగురు Sai, Subba, Ramakrishna, Chevi రెడ్ల పనితనంతో

    మావోడు ఇంటింటికి చేసిన మంచి,

    ఊరురికీ చేసిన అభివృద్ధి,

    మావోడి అతి మంచితనం,

    మావోడి అతి నిజాయితీ

    వల్ల

    కళ్ళు మూసుకున్నా, ఏ ఎన్నిక అయినా 175/175 గెలుస్తాం.. కాకపోతే కూటమి పోటీ చెయ్యకుండా,షర్మిల and KA పాల్ పార్టీలు మాత్రమే పోటీ చెయాలి..

    దీనికి బాబూ.. బాబ్బాబు ఒప్పుకోవా చెంద్రబాబు??

  3. పార్టీ లో లీడర్స్ తో పనేం లేదు.. ఆ నలుగురు రెడ్లు +

    మావోడు ఇంటింటికి చేసిన మంచి,

    ఊరురికీ చేసిన అభివృద్ధి,

    మావోడి అతి మంచితనం,

    మావోడి అతి నిజాయితీ

    వల్ల

    కళ్ళు మూసుకున్నా, ఏ ఎన్నిక అయినా 175/175 గెలుస్తాం.. కాకపోతే కూటమి పోటీ చెయ్యకుండా,షర్మిల and KA పాల్ పార్టీలు మాత్రమే పోటీ చెయాలి..

    దీనికి బాబూ.. బాబ్బాబు ఒప్పుకోవా చెంద్రబాబు

Comments are closed.