5 కోట్లు రేంజ్ నుంచి ఒకేసారి రూ.20 కోట్లు

ఒక్కసారి స్టార్ డమ్ వచ్చిందంటే అలానే ఉంటుంది. ఎన్ని కోట్లు కుమ్మరించడానికైనా నిర్మాతలు రెడీ.

ఒక్కసారి స్టార్ డమ్ వచ్చిందంటే అలానే ఉంటుంది. ఎన్ని కోట్లు కుమ్మరించడానికైనా నిర్మాతలు రెడీ. ప్రస్తుతం అదే స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది సాయిపల్లవి. ఆమె పారితోషికం ఒకేసారి 4 రెట్లు పెరిగిందనేది బాలీవుడ్ మాట.

తెలుగులో తండేల్ అనే సినిమా చేసింది సాయిపల్లవి. ఆ సినిమాకు నాగచైతన్యతో సమానంగా సాయిపల్లవి రెమ్యూనరేషన్ అందుకుందనే టాక్ ఉంది. అంతర్గత సమాచారం ప్రకారం, తండేల్ సినిమాకు సాయిపల్లవి అందుకున్న పారితోషికం 5 కోట్ల రూపాయలు.

అదే టైమ్ లో ఆమె బాలీవుడ్ లో ఓ ప్రాజెక్టు అంగీకరించింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో కలిసి రామాయణ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో నటించడానికి ఆమె 18 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు బాలీవుడ్ మీడియా కథనం. ఈ లెక్కన చూసుకుంటే సాయిపల్లవి పారితోషికం 4 రెట్లు పెరిగిందన్నమాట.

ఈ స్థాయిలో కాకపోయినా నయనతార, సమంత లాంటి హీరోయిన్లు కూడా కాస్త గట్టిగానే డబ్బులు లాగుతున్నారు. నయనతార విషయానికొస్తే, గతంలో ఆమె 6 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునేది. అప్పట్లో సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడామె అక్షరాలా 10 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తోందంట.

ఇక సమంత విషయానికొస్తే.. శాకుంతలం సినిమాకు ఆమె తక్కువ పారితోషికమే తీసుకుంది. ఖుషి సినిమాకు మాత్రం అటుఇటుగా 3 కోట్ల రూపాయలు తీసుకుంది. సిటాడెల్ హనీబన్నీ అనే సిరీస్ లో నటించినందుకు ఆమెకు దక్కిన మొత్తం 8 కోట్ల రూపాయలు. ఇప్పుడీ మొత్తం కంటే కాస్త ఎక్కువ పారితోషికమే రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ కు అందుకుంటోంది. సో.. తన నెక్ట్స్ ప్రాజెక్టుకు సమంత 10 కోట్లు పారితోషికం తీసుకోవడం పక్కా.

అనుష్క, రష్మిక కూడా భారీ పారితోషికం తీసుకునే బ్యాచ్ లో ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తుంది అనుష్క. అలా అప్పుడప్పుడు చేసినా ఫీజు మాత్రం 3 నుంచి 6 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా తీసుకుంటుంది.

ఇక రష్మిక అయితే ఒక్కో సినిమాకు తన రేటు పెంచుకుంటూ పోతోంది. పుష్ప-2 సినిమాకు ఆమెకు 10 కోట్లు ఇచ్చారంట. ఛావా సినిమాకు మాత్రం ఆమె 4 కోట్లు మాత్రమే తీసుకుందని టాక్. ఇక ప్రస్తుతం సల్మాన్ తో చేస్తున్న సికిందర్ కు కూడా ఆమె పారితోషికం 4 కోట్ల రూపాయలేనంట. సో.. ఇలా చూసుకుంటే సౌత్ హీరోయిన్ కూడా ఈమధ్య బాగానే పెంచేశారు.

9 Replies to “5 కోట్లు రేంజ్ నుంచి ఒకేసారి రూ.20 కోట్లు”

  1. Ento andaru grow avuthunnaru … They are realising the reality and acting accordingly….

    But still few are… Almost one year completed… Voters given result.. but still they are not doing their responsibility… And still they are not even coming to Asssembly…

  2. bwud వాళ్ళు వీళ్ళని పెట్టుకునేదే బడ్జెట్ కంట్రోల్ చేస్కోటాన్కి ..ఈమెని పెట్టుకోవటం వల్ల 20cr south నుంచి కలెక్ట్ అవుద్దా ?? ప్రొడ్యూసర్ ki ఏమైనా మిగలాలి అంటే .. aa పైన ఇంకో పది కోట్లు ఐన ఎక్స్ట్రా కలెక్షన్స్ రావాలి ..అనవసరం గ ఇన్కమ్ టాక్స్ వాళ్ళు aa పిల్ల ఇంటి మీదకు i వెళ్ళటానికి తప్ప emi use ledhu..

  3. సాయి పల్లవి ఎంత క్రౌడ్ పుల్లింగ్ అయినా, 18 కోట్లు, అదీ ఎక్సపోసింగ్ చెయ్యకుండా అంటే కలెక్షన్స్ కష్టమే. కాకపోతే అన్ని భాషల్లో ఆమె సినిమా ఆడుతుంది కాబట్టి రికవరీ అవ్వచ్చు

Comments are closed.