సంధ్యా థియేటర్ మూతపడుతుందా..?

తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక తయారుచేశారు పోలీసులు. అందులో భాగంగా ప్రధానంగా 12 లోపాలు గుర్తించారు.

హైదరాబాద్ లోని ఫేమస్ థియేటర్లలో ఒకటి సంధ్యా థియేటర్. అదేదో ఏఎంబీ అంత క్లాస్ థియేటర్ కాదు. పక్కా మాస్ థియేటర్. ఏ హీరో ఫ్యాన్స్ అయినా సినిమా రిలీజ్ రోజు అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం కామన్. భారీ కటౌట్లు, మేళతాళాలు, డీజేలు.. రిలీజ్ రోజు సందడి అక్కడ మామూలుగా ఉండదు. అందుకే హీరోలు కూడా అక్కడికే వెళ్లడానికి ఇష్టపడతారు.

అలాంటి సంధ్యా థియేటర్ ను ఎందుకు మూసేయకూడదో వివరణ ఇవ్వాలంటూ పోలీసులు, యాజమాన్యానికి నోటీసులిచ్చారు. ఎందుకంటే, అదే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది కాబట్టి.

తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక తయారుచేశారు పోలీసులు. అందులో భాగంగా ప్రధానంగా 12 లోపాలు గుర్తించారు. రెండు థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నప్పుడు ఎంట్రీ-ఎగ్జిట్ ఒకేవైపు ఎలా పెడతారనేది ప్రధాన ప్రశ్న.

అల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ యాజమాన్యం విఫలమైంది కదా అనేది మరో ప్రశ్న. అల్లు అర్జున్ రాక సందర్భంగా ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్ ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కొన్ని ప్రశ్నలతో థియేటర్ కు నోటీసు జారీ చేశారు పోలీసులు

మరోవైపు విడుదలకు ముందు పోలీసులు, సంధ్యా థియేటర్ యాజమాన్యానికి రాసినట్టు చెబుతున్న లెటర్ ఒకటి బయటకొచ్చింది. ప్రీమియర్ రోజు హీరో, హీరోయిన్, ప్రొడక్షన్ కు చెందిన కీలక వ్యక్తులెవ్వరూ థియేటర్ వద్దకు రావొద్దనే విషయాన్ని యూనిట్ కు చెప్పాలంటూ యాజమాన్యానికి పోలీసులు రాసిన లేఖ అది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ లెటర్ నిజమైనదైతే మాత్రం పోలీసుల వైపు నుంచి తప్పు లేనట్టే.

పోలీసులు వద్దన్నా కూడా అల్లు అర్జున్, ప్రీమియర్ కు వచ్చాడని అర్థం. ఒకవేళ అలా వచ్చినప్పటికీ, ముందస్తుగా పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇలా కీలకమైన 12 ప్రశ్నలతో షోకాజ్ నోటీసులిచ్చి, థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ, 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఇకపై ప్రభుత్వమే భరిస్తుంది..

మరోవైపు సంథ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చావుబతుకుల మధ్య ఉన్న మృతురాలి కొడుకు శ్రీతేజ్ ను, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పరామర్శించారు. బాలుడి చికిత్స ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఇప్పటివరకు బాబు వైద్యఖర్చుల్ని అల్లు అర్జున్ భరించినట్టు తెలుస్తోంది.

బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం ప్రకటించిన అల్లు అర్జున్, వాళ్లకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు అల్లు అర్జున్ కు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ, పోలీసులు కూడా కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

కేటీఆర్ స్పందన..

జరిగిన ఘటన రాజకీయ రంగు పులుముకొని చాలా రోజులైంది. తాజాగా కేటీఆర్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఓ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పేరును మరిచిపోవడం వల్లనే అల్లు అర్జున్ జైలుకెళ్లాడని ఆరోపించారు.

“ఓ సినిమా యాక్టర్, ఈయన (రేవంత్ రెడ్డి) పేరు మరిచిపోయాడు. తెలంగాణ సీఎం అంటూ కొద్దిగా అటుఇటు చూశాడు. మనోడికి ఎక్కడో తగిలింది. పేరు మరిచిపోయాడని జైళ్లో పెట్టాడు. ఇంత అన్యాయమా..”

పుష్ప-2 సినిమాకు సంబంధించి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సక్సెస్ మీట్స్ ఏర్పాటుచేయాలనుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, ఢిల్లీలో మీడియా సమావేశాలు జరిగాయి. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు మరింత జటిలంగా మారడంతో, మిగతా ప్రాంతాల్లో సక్సెస్ మీట్స్ పై సందిగ్దత నెలకొంది.

9 Replies to “సంధ్యా థియేటర్ మూతపడుతుందా..?”

  1. ఈ ktr గాడు రోజు రోజుకి దిగజారి పోతున్నాడు..ఏదో లేని వ్యతిరేకత తీసుకురావాలని చిల్లర మల్లార్ అల్లరి చేస్తున్నాడు.. కాస్త ఓపిక పట్టురా..తెలంగాణ సమాజం ..చాలా చైతన్యం వంత మైంది..నిజంగా రేవంత్ పాలన బాగా లేకపోతే వాళ్లే దించేస్తారు..నువ్వు లేని పోని ఆపసోపాలు ఇప్పటనుండే పడితే ఇంకా 4 ఏళ్ళు వుంది. అప్పటికి అలసి పోతావ్.

  2. If something happ ns govt open rules book. Why. Why don’t they do it at the start. Why don’t they do regular inspections and give permits based on norms. With that we can avoid it happening anywhere. It is not just to one Theatre for all of them in state. Nit only theatre’s all building. మరి building permit department em chesthubdhi. Amyamayalu theesukoni permissions is the ilaane avuthaayi. Ilaanti buildings కి permits Iche vallapai criminal cases pettaali

  3. రేవంత్ రెడ్డి తన న్యారో మైండ్ సెట్ ని మార్చుకుంటే బాగుంటుంది. సినిమా ఆర్టిస్ట్ లని ఇబ్బంది పెట్టకపోవడమే అతనికి మంచిది. వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతారు. జగన్ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ కూడా చేస్తున్నారు. ఆర్టిస్ట్స్ ను ఇబ్బంది పెట్టవద్దు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బకొత్తవద్దు. ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ సినిమాగా నిలిచింది. ఎందుకు పాడు చేయడం.

    1. తొందర పడకురా 2027 జమిలి ఎన్నికలు

      సప్త సముద్రాల అవతల దక్కున్నా వదిలి పెట్టడు ఓటు కు నోటు గురు శిస్యుడిని

  4. సీఎం పేరు మర్చిపోవడం ఏమిటి.. విచిత్రం గా ఉంది.. ఇదే కెసిఆర్ పేరు మర్చిపోతే ఈయన ఇలాగే మాట్లాడతాడా

Comments are closed.