కాంగ్రెస్ పాఠాలు నేర్చుకోవలసిన తీర్పు!

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న కల నెరవేరేది ఎప్పటికి?

దేశ ప్రజలు నరేంద్రమోడీ నాయకత్వానికే ఇంకా నీరాజనాలు పడుతున్నారని మహారాష్ట్ర ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది. జార్ఖండ్ లో జేఎంఎం విజయం సాధించి ఉండవచ్చు. కానీ.. ఆ విజయం కాంగ్రెస్ పార్టీ మురిసిపోదగినది కాదు. వయనాడ్ లో ప్రియాంక ఘన విజయం సాధించడం.. ఆ పార్టీ వారందరికీ సంతోషకరమైన వార్తే. కానీ స్థూలంగా పార్టీ భవిష్యత్తు ఏమిటని గమనించినప్పుడు ఈ ఎన్నికల తీర్పు కాంగ్రెస్ పార్టీ ఇంకా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయనే సత్యాన్నే చెబుతోంది.

రాహుల్ గాంధీ ఎంతగానైనా కష్టపడుతుండవచ్చు గాక.. కానీ మోడీని అధిగమించి.. పార్టీకి ప్రజాదరణ సాధించలేకపోతున్నారనేది స్పష్టం. మహారాష్ట్ర ఎన్నికలు చాలా కీలకమైనవి కావడంతో.. ఇరు కూటములు కూడా తమ శక్తియుక్తులు వనరులు అన్నీ ఒడ్డి పనిచేశాయి.

ఎన్డీయేగా మాత్రమే ప్రతిచోటా ప్రచారంలో ఉండే కమలదళం కూటమి స్థానికతకు అగ్రప్రాధాన్యం ఇచ్చే మహా ఓట్లను ఆకట్టుకోవడానికి మహాయుతి అనే పేరుతో ఎన్నికలకు వెళ్లింది. ఏపీ నుంచి పవన్ కల్యాణ్ కూడా వెళ్లి పలుచోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్ర ప్రజలు మోడీ దళానికి అనుకూలంగా విస్పష్టమైన తీర్పు ఇచ్చారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మహారాష్ట్రలో మాత్రమే నిజమయ్యాయి. జార్ఖండ్ విషయంలో జేఎంఎంకు దక్కిన ప్రజల దీవెనను చూసుకుని కాంగ్రెస్ మురిసిపోయే పరిస్థితి లేదు. అక్కడ హేమంత్ సోరెన్ కష్టానికి ఫలితంగానే ఆ విజయాన్ని భావించాలి. మహారాష్ట్ర ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకు పరిమితం కావడం వారు సమీక్షించుకోవాల్సిన సంగతి. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్రకు వెళ్లి చాలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి వచ్చారు. అవేమీ ఫలితమివ్వలేదు.

కొత్తగా ముఖ్యమంత్రి కాబోయేది బిజెపికి చెందిన దేవేంద్ర ఫడణవీస్ అనే మాట బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో మూడు పార్టీల కూటమి మహాయుతి నాయకుల మధ్య చిన్న చిన్న అసంతృప్తులు రేగవచ్చు గానీ.. ఇంత స్పష్టంగా ఎన్నికల తీర్పులో మోడీ హవాను గమనించిన తర్వాత.. వారెవ్వరూ కూడా కూటమికి చేటు చేసే నిర్ణయాలకు సాహసిస్తారని అనుకోలేం.

మొత్తానికి ఇప్పుడున్న మోడీ హవాను గమనిస్తూంటే.. ఈ పోకడలకు జమిలి ఎన్నికల రూపంలో కొంత ఎడ్వాంటేజీ తోడైతే.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న కల నెరవేరేది ఎప్పటికి? అనే సందేహం పలువురికి కలుగుతోంది.

18 Replies to “కాంగ్రెస్ పాఠాలు నేర్చుకోవలసిన తీర్పు!”

    1. అరేయ్ బాబు ప్రపంచంలో ఏం జరిగినా జగన్ మీద ఏడుస్తారు ఏంట్రా బాబు మీ కడుపు మంట తగలేయ్య కొంచెం ENO తాగు తగ్గుద్ధి

  1. అసంపూర్ణ విభజనతో దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ లాంటి లoజ పార్టీ అసలు ఎందుకు అధికారం లోకి రావాలి?

Comments are closed.