వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అనుభ‌వించి.. నేడు మౌనం!

వైసీపీ హ‌యాంలో కొంద‌రు ఐఏఎస్ అధికారులు అధికారాన్ని అనుభ‌వించి, నేడు మౌన వ్ర‌తం పాటిస్తున్నారు. ఏ ప్ర‌యోజ‌నం పొంద‌ని ఐవైఆర్ కృష్ణారావు కామెంట్స్ వైసీపీకి దిక్కు అయ్యాయి. అందుకే టీడీపీ ఐవైఆర్‌ను విప‌రీతంగా ట్రోల్…

వైసీపీ హ‌యాంలో కొంద‌రు ఐఏఎస్ అధికారులు అధికారాన్ని అనుభ‌వించి, నేడు మౌన వ్ర‌తం పాటిస్తున్నారు. ఏ ప్ర‌యోజ‌నం పొంద‌ని ఐవైఆర్ కృష్ణారావు కామెంట్స్ వైసీపీకి దిక్కు అయ్యాయి. అందుకే టీడీపీ ఐవైఆర్‌ను విప‌రీతంగా ట్రోల్ చేస్తోంది. జ‌గ‌న్ ఆద‌రించిన అధికారులంతా ఎందుకూ ప‌నికి రాని వాళ్ల‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై తీవ్ర దుమారం రేగింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ల‌డ్డూ ప్ర‌సాదంపై వివాదాస్ప‌ద కామెంట్స్ చేశారు. వెంట‌నే టీటీడీ మాజీ ఈవో , అలాగే బాబు హ‌యాంలో చీఫ్ సెక్ర‌ట‌రీగా ప‌ని చేసిన ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. చంద్ర‌బాబు ఆరోపించిన‌ట్టు జ‌రిగి వుంటుంద‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు. ఒక‌వేళ అలా జ‌రిగి వుంటే బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. అంతేకాదు, నిజం కాక‌పోతే చంద్ర‌బాబు ప్ర‌జానీకానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కూడా డిమాండ్ చేశారు.

నిజానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఐవైఆర్ కృష్ణారావు ల‌బ్ధి పొందారు. బాబు హ‌యాంలో సీఎస్‌గా, అలాగే ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత బ్రాహ్మణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ప‌ని చేశారు. వైసీపీతో, జ‌గ‌న్‌తోనూ ఎలాంటి అనుబంధం కృష్ణారావుకు లేదు. కానీ ఇప్పుడు ఆయ‌నే వైసీపీ వాద‌న‌కు బ‌లం క‌లిగించేలా మాట్లాడారు.

ఇదే వైసీపీ హ‌యాంలో ఐఏఎస్ అధికారులు అజయ్ క‌ల్లం, జ‌వ‌హ‌ర్‌రెడ్డి అన్ని ర‌కాలుగా అధికారాన్ని అనుభ‌వించారు. ఇక ఐఏఎస్ అధికారి కాన‌ప్ప‌టికీ ధ‌ర్మారెడ్డి తిరుమ‌ల‌లో చ‌క్రం తిప్పారు. తిరుమ‌ల అనేది ఒక ప్ర‌త్యేకంగా భావించి, తానే స‌ర్వాధికారాలు క‌లిగిన రాజుల‌గా ధ‌ర్మారెడ్డి పెత్త‌నం చెలాయించారు.

గ‌తంలో అజ‌య్ క‌ల్లం టీటీడీ ఈవోగా ప‌ని చేశారు. వైసీపీ ప్ర‌భుత్వంలో కేబినెట్ ప‌ద‌విలో ఐదేళ్లు కొన‌సాగారు. అలాగే జ‌వ‌హ‌ర్‌రెడ్డి కూడా టీటీడీ ఈవోగా ప‌ని చేశారు. మొన్న‌టి వ‌ర‌కూ సీఎస్‌గా విధులు నిర్వ‌ర్తించారు. తిరుమ‌ల ప్ర‌సాదంపై తీవ్ర వివాదం త‌లెత్తిన నేప‌థ్యంలో అజ‌య్ క‌ల్లం, జ‌వ‌హ‌ర్‌రెడ్డి, ధ‌ర్మారెడ్డి… ఏ ఒక్క‌రూ నోరు మెద‌ప‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

జ‌గ‌న్ ఆద‌రించిన వాళ్లంతా ఎందుకూ ప‌నికి రాని వార‌నే విమ‌ర్శ‌లు వైసీపీ నుంచి రావ‌డం గ‌మ‌నార్హం. ఇదే చంద్ర‌బాబు కోసం నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌, ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు, ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు బాగా ప‌ని చేశార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. ఆద‌రించిన జ‌గ‌న్‌కు ఇప్పుడు క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలబ‌డ‌డానికి భ‌య‌మెందుకు? అని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అవ‌కాశవాదంతో వ‌చ్చిన వారిని అంద‌లం ఎక్కిస్తే, ఇలాగే వుంటుంద‌ని జ‌గ‌న్‌ను తిట్టిపోస్తున్నారు. క‌నీసం ఇప్ప‌టికైనా జ‌గ‌న్ ఎవ‌రేమిటో తెలుసుకోవాల‌ని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి.

21 Replies to “వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అనుభ‌వించి.. నేడు మౌనం!”

  1. జగన్ రెడ్డి “సింగల్ సింహం” కదా.. మా అవసరం ఉండదులే.. అనుకుని ఉంటారు..

    అయినా.. జగన్ రెడ్డి కోసం వాళ్ళని జైలు కి వెళ్ళమంటావా..?

    జగన్ రెడ్డి వాళ్ళని మేపింది.. వాళ్ళు జగన్ రెడ్డి ని మేపడానికి.. వాళ్ళ చేత సంతకాలు పెట్టించి.. అక్రమ సంపాదన పెంచుకున్నాడు..

    ఇప్పుడు జగన్ రెడ్డి సమస్యల్లో పడితే.. వీళ్ళు ఆ పనికిమాలినోడి కోసం జీవితాలు సంక నాకించుకోవాలా..?

    వెళ్ళెళ్ళవయ్యా..

    1. ఇంతకి వెంకటరెడ్డి కి ఏమైన లబ్ధ జరిగిందా లేదా అది చెప్పమనండి..

  2. దుష్టులకు దూరం గా ఉండాలనే సూక్తి పాటిస్తున్నారు, కానీ ఆ దుష్టుడే బలశాలి గా గాథే ఎక్కినపుడు, వేరే దారి లేక దుష్టుడికి, బతుకు తెరువు కోసం తల వొంచారు.

  3. చక్రం తిప్పిన..

    YV సుబ్బా రెడ్డి,

    భూమన కరుణాకర్ రెడ్డి,

    రొజా రెడ్డి లు

    నొరు తెరిచారుగా…

    .

    అప్పట్లొ చక్రం తిప్పిన

    అజయ్ కల్లాం రెడ్డి,

    జవహర్ రెడ్డి,

    దర్మా రెడ్డి లు

    ఎవరూ

    జగన్ రెడ్డి కొసం నొరు తెరవటం లెదా?

    .అందారూ రెడ్లు అయితె బావుండదు అనుకున్నారు ఎమొ?

  4. 😂😂😂…. ఏడుస్తున్నావ GA…. మీ పాపాలకి ఇంకా ఎంత మందిని IAS లను బలితీసుకుంటారు GA….

  5. సిబిఐ విచారణ అంటే భయపడి పారిపోయిన రెడ్లు అందులో కచరా రెడ్లు జగన్ రెడ్డి , సుబ్బా రెడ్డి , ధర్మా రెడ్డి , కరుణాకర్ రెడ్డి , చెవి రెడ్డి , అజయ్ కల్లం రెడ్డి , జవహర్ రెడ్డి , పెద్ది రెడ్డి etc …

  6. అంటే జగన్ గారికి కనీసం నమ్మకస్తులు అయిన వాళ్ళను ఎంచుకోవడం కూడా రాదంటారా?

    మీ దృష్టిలో చంద్రబాబు దొంగ నా కో అయినా, కనీసం నమ్మకస్తులు అయిన వాళ్ళని పనికి పెట్టుకోవడం వచ్చు.

  7. గొర్రె బిడ్డ ప్యా*లస్ దో*పిడీ ముఠా లో అజ*య్ రెడ్డి అనే వాడు పెద్ద మో*స గాడు.

    కొత్త గు*డి పేరుతో ఆలయ స్థలం కాజేశా*రు.

  8. వైసిపికి అమ్ముడు పోయిన అధికారులు వైసిపి మునిగిపోతున్న టైం లో మౌనంగా వుండటం బాధాకరమే

Comments are closed.