విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆయన విజయవాడ వెస్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడి నుంచి బీజేపీ తరపున కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని కీలక కామెంట్స్ చేశారు.
విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయో సుజనా చౌదరికి తెలియదని కేశినేని వెటకరించారు. విమానాల్లో తిరిగే సుజనా చౌదరి నియోజక వర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారని ఆయన నిలదీశారు. సుజనాకు విజయవాడ వెస్ట్ ప్రజానీకం బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విజయవాడ వెస్ట్‌లో ముస్లింలు, బీసీలు ఎక్కువగా ఉన్నారన్నారు. ఇలాంటి చోట సుజనాచౌదరికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు.
విజయవాడ వెస్ట్ టికెట్‌ను చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ కలిసి అమ్మేసుకున్నారని సంచలన ఆరోపణ చేశారు. కమలం గుర్తుపై ఓటు వేసి వృథా చేసుకోవద్దని విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు ఆయన విన్నవించారు. కేంద్ర మంత్రిగా అభివృద్ధి చేయలేని సుజనా, ఇప్పుడేం చేస్తాడని నిలదీశారు. విజయవాడ వెస్ట్ సీటును బీసీకి ఇస్తానని పవన్ చెప్పి, మోసగించాడని విమర్శించారు.
అలాగే మైనార్టీకి ఇస్తానని చంద్రబాబు నమ్మబలికి వంచించాడని తప్పు పట్టారు. కానీ అసిఫ్ అనే ఒక సామాన్య ముస్లిం మైనార్టీ వ్యక్తికి సీఎం జగన్ టికెట్ ఇచ్చాడన్నారు. నిత్యం అందుబాటులో వుండే అసిఫ్‌ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ వెస్ట్ జనసేన ఇన్చార్జ్ పోతిన మహేశ్‌ను పదేళ్ల పాటు పవన్‌కల్యాణ్ వాడుకుని, వదిలేశాడని పవన్‌పై తీవ్రస్థాయిలో కేశినేని విరుచుకుపడ్డారు.