ప్ర‌ధాని తీపి క‌బురుతోనైనా… బాబు మేలు చేస్తారా?

నూత‌న ఆంగ్ల సంవ‌త్స‌రాది 2025ను పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని మోదీ దేశ వ్యాప్తంగా ఉండే రైతుల‌కు తీపి కబురు అందించారు.

నూత‌న ఆంగ్ల సంవ‌త్స‌రాది 2025ను పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని మోదీ దేశ వ్యాప్తంగా ఉండే రైతుల‌కు తీపి కబురు అందించారు. ప్ర‌ధానమంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి కింద ప్ర‌తి ఏడాది రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం పెట్టుబ‌డి సాయం కింద రూ.6 వేలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని కొత్త ఏడాది నుంచి రూ.10 వేల‌కు పెంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌ధాని ప్ర‌క‌టించి రైతుల‌కు ఊహించ‌ని మేలు చేస్తున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబునాయుడు ప్ర‌తి రైతుకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున పెట్టుబ‌డి సాయం అందిస్తాన‌ని హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సాయాన్ని చంద్ర‌బాబు స‌ర్కార్ ఎప్పుడు ఇస్తుందా? అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతాంగం ఎదురు చూస్తోంది. అధికారంలోకి వ‌చ్చి ఏడో నెల‌లో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ, ఇంత వ‌ర‌కూ కీల‌క‌మైన సూప‌ర్‌సిక్స్ సంక్షేమ ప‌థ‌కాల ఊసే ఎత్త‌డం లేద‌న్న విమ‌ర్శ వుంది.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఏడాదికి రైతుల‌కు రూ.10 వేలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డం చంద్ర‌బాబు స‌ర్కార్‌కు వ‌రంలాంటిద‌నే చెప్పొచ్చు. క‌నీసం ఇప్ప‌టికైనా కేంద్రం ఇచ్చే రూ.10 వేల‌తో క‌లిపి రూ.20 వేలు ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు స‌ర్కార్ ముందుకు రావాల్సిన అవ‌స‌రం వుంది. ఇప్పుడు కూడా చంద్ర‌బాబు స‌ర్కార్ రైతుల‌కు ఇచ్చిన హామీ నెర‌వేర్చ‌క‌పోతే తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కోవాల్సి వుంటుంది.

గ‌తంలో 2014లో రైతుల రుణ‌మాఫీ చేస్తాన‌ని, బ్యాంకుల్లో త‌న‌ఖా పెట్టిన బంగారాన్ని విడిపించుకొస్తాన‌ని చంద్ర‌బాబు భారీ హామీలిచ్చారు. చివ‌రికి హామీల్ని నిల‌బెట్టుకోలేక‌పోవ‌డంతో ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. ఈ విష‌యం చంద్ర‌బాబుకు బాగా తెలుసు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం రైతుకు ద‌న్నుగా నిల‌వాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో, ఆ స‌దావ‌కాశాన్ని చంద్ర‌బాబు స‌ర్కార్ త‌న‌కు అనుకూలంగా ఉప‌యోగించుకుంటే బాగుంటుంది.

10 Replies to “ప్ర‌ధాని తీపి క‌బురుతోనైనా… బాబు మేలు చేస్తారా?”

  1. పన్నుల భారం తొ అతి సంగ్షెమం అవసరం లెదు. ప్రజలు అబిరుద్ది, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉద్యొగాలు కొరుకుంటున్నారు. అది మీ అన్న ఎటూ చెయలెడు. లైట్ తీస్కొ

  2. పన్నుల భారం తొ అతి సంగ్షెమం అవసరం లెదు. ప్రజలు అబిరుద్ది, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉద్యొగాలు కొరుకుంటున్నారు. అది మీ అన్న ఎటూ చెయలెడు. లైట్ తీస్కొ

  3. ప్రజలు అబిరుద్ది, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉద్యొగాలు కొరుకుంటున్నారు. అది మీ అన్న ఎటూ చెయలెడు. లైట్ తీస్కొ

  4. పన్నుల భారం తొ అతి సంగ్షెమం అవసరం లెదు. ప్రజలు అబిరుద్ది, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉద్యొగాలు కొరుకుంటున్నారు. అది మీ అన్న ఎటూ చెయలెడు.

    1. పొలవరం, రాజదాని, రొడ్లు ఇతర మౌలిక వసతులు పూర్తి చెయండి. పెట్తుబడులు, కొత్త కంపనీలు తెండి.

  5. ఈ డబ్బు రైతుకు ఇచ్చేకన్నా వ్యవసాయానికి ఇస్తే మంచిది చేను దమ్ము దుక్కి ఊడ్పు నూర్పు వంటివి తక్కువ రేట్ కు పని జరగటం అందుబాటులోనికి తీసుకు వస్తే మంచిది అప్పుడు కౌలు రైతా అసలు రైతా అనే సమస్య ఉత్పన్నం కాదు పిచికారీ స్పృయర్ లు కలుతీసే వీడెర్స్ వంటివి తక్కువ అద్దెకి లభించేటట్టు చేస్తే ని రైతు కు మేలు

Comments are closed.