జనసేనాని పవన్‌కల్యాణ్‌పై జనాలకు, రాజకీయ నాయకులకు ఒక క్లారిటీ వచ్చేసింది. పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారంటే, అది నెరవేరదని అర్థమైంది. ఇంత కాలం నారా చంద్రబాబునాయుడికే సొంతమైన వెన్నుపోటు అనే ఘనకీర్తి, బహుశా సవాస పుణ్యమేమో పవన్‌కు అంటుకుంది. పవన్‌కల్యాణ్ చెప్పాడంటే, చేయడనే పేరు బలపడింది.
ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ సీటు జనసేనకు కేటాయించారు. ఇక్కడి నుంచి వైసీపీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న బాలశౌరి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో మచిలీపట్నం బాలశౌరి పోటీ చేస్తాడని అంతా అనుకున్నారు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం… మచిలీపట్నం సీటు బాలశౌరికి లేదంటున్నారు. అవనిగడ్డ నుంచి పోటీ చేయాలని పవన్‌కల్యాణ్ సూచించినట్టు తెలిసింది.
అయితే అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బాలశౌరి ససేమిరా అంటున్నారని సమాచారం. మచిలీపట్నం ఎంపీగానే పోటీ చేస్తానని పవన్‌కు తెగేసి చెప్పినట్టు ప్రచారమవుతోంది. దీంతో మచిలీపట్నం, అవనిగడ్డ సీట్ల విషయమై పెండింగ్ పడింది.
మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా రోజుకో పేరు వినిపిస్తోంది. మొన్నటి వరకు వంగవీటి రాధా పేరు వినిపించింది. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఏదో అనుకుని జనసేనలో బాలశౌరి చేరితే, పవన్ మార్క్ రాజకీయం వల్ల అసలుకే ఎసరు వచ్చేలా వుందనే చర్చకు తెరలేచింది.