సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి, ఎన్నికలకు ముందు దగ్గుబాటి పురందేశ్వరి సారథ్యం స్వీకరించారు. ఆమె సారథ్యంలోనే తెలుగుదేశంతో పొత్తుకు సంబంధించి పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించే ప్రయత్నాలన్నీ జరిగాయి. నిజానికి, తెలుగుదేశంతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో సోము వీర్రాజు ఉన్నారు. దాని వల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి చేటు అవుతుందని, పార్టీ సొంతంగా రాష్ట్రంలో ఎదగడం ఎప్పటికీ సాధ్యం కాదని చంద్రబాబు వ్యూహాలను తెలిసిన ఆయన వాదిస్తూ వచ్చారు. మొత్తానికి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది.
తాజాగా భాజపా జిల్లా అధ్యక్షులను నియమించిన సందర్భంలో, తూర్పుగోదావరి జిల్లాకు తమ మనుషులనే ఆ పదవిలో నియమించుకోవాలని ఈ ఇద్దరు నాయకులు గట్టిగా పోటీపడ్డారు. చివరికి చిన్నమ్మ పురందేశ్వరి మీద సోము వీర్రాజు పైచేయి సాధించారు. అధిష్ఠానం ఆయన మాటవైపు మొగ్గడంవెనుక మతలబు ఇంకేమైనా ఉన్నదా అనే చర్చలు పార్టీలో నడుస్తున్నాయి.
భాజపా జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు తన అనుచరురాలైన ఎన్. హారికకు ఆ పదవి కట్టబెట్టాలని రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నిర్ణయించారు. రాజమహేంద్రవరం ఎంపీ కూడా కావడంతో ఆమె మాట నెగ్గుతుందని అనుకున్నారు. కానీ, సోము వీర్రాజు అడ్డు పడ్డారు. తన అనుచరుడు పిక్కి నాగేంద్రకు పదవి దక్కాలని పట్టుబట్టారు.
మొత్తానికి పంచాయితీ అధిష్ఠానం వద్దకు వెళ్లింది. చివరికి సోము వీర్రాజు నెగ్గారు. ఆయన అనుచరుడే జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. అయితే, పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా సోము వీర్రాజు సైలెంట్‌గా ఉన్నారు. పార్టీ ఆయనను పక్కన పెట్టిందా.. లేక ఆయనే సైలెంట్ అయిపోయారా? తెలియడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయన విజ్ఞప్తి ఒక్కటైనా మన్నించినట్టు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కోరికను మన్నించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో దగ్గుబాటి పురందేశ్వరి ప్రాధాన్యం పార్టీలో తగ్గుతోందని, తొందరలోనే ఆమెను రాష్ట్ర అధ్యక్షురాలిగా తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పజెబుతారనే ప్రచారం ఉంది.
ఇతర ప్రచారంలో, ఈ చిన్న విషయంకోసం పట్టుబట్టకుండా ఉంటే పురందేశ్వరికి పెద్ద మేలు చేయడానికి పార్టీ హామీ ఇచ్చిందని కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ అవకాశాన్ని తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి వాడుకుంటుందా లేదా, అధికారంలో ఉండడమే చాలని అనుకుంటుందా అనేది వేచిచూడాలి.
Somu veeraju kapu aaina Jagan reddy agent ga pani cesadu
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
ఐనా ఎవరైతే ఏంటి.. బాబోరి సేవలో తరించాలి.. చిన్నమ్మ ఉన్నంతవరకు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ