తెలుగుదేశం అనుకూల ప్రధాన దినపత్రికలు నిత్యం చూసేవారికి ఓ విషయం అర్థమవుతుంది. డైలీ ఓ బ్యానర్ స్టోరీ ఫ్రంట్ పేజీలో. అబ్బ! అనిపించేలా అబ్బురపరుస్తుంది. ఎంత విజన్, ఎంత అద్భుతమైన ప్లానింగ్ అనిపిస్తుంది. మరి ఐదేళ్ల తర్వాత అదే వార్త చూస్తే, అప్పట్లో ఇది చదివాము కదా అని అనుకోవడం తప్ప పెద్దగా ఏమీ ఉండదు. 2014 నుంచి 2019 మధ్యలో ఇలాంటివి 90 శాతం వార్తలు. ఇప్పుడు మళ్లీ 2024 నుంచి అలాంటివే ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడుది అద్భుతమైన విజన్. అందులో సందేహం లేదు. అయితే సాధ్యమయ్యేవి ఉంటాయి, సాకారం అయ్యేవి ఉంటాయి. కానీ కొన్ని గాలిలో మేడలు కట్టేలా ఉంటాయి.
గత ఏడెనిమిది నెలలుగా మంచి అడ్మినిస్ట్రేషన్ అన్నది మొదలైంది. అందులో సందేహం లేదు. పరిపాలన ఓ పద్ధతి అన్నట్లు సాగుతోంది. కానీ ఈ కలలాంటి బ్యానర్ స్టోరీలు చూస్తేనే, ఇవి అవసరమా? అనిపిస్తుంది. అక్కడ అది, ఇక్కడ ఇది అంటూ ఏవేవో డైలీ ఒక కథనం వస్తూనే ఉంటుంది. ఒక్కోసారి అసలు డైలీ ఇలాంటి కథనం ఇవ్వడం కోసమే ప్లాన్ చేస్తున్నారా అనిపిస్తుంది.
ఈరోజు ఓ భారీ నీటిపారుదల ప్రాజెక్టును ప్రకటించారు. పోలవరం కాలువ వెడల్పు, సమాంతర కాలువ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించడం. పట్టిసీమ కూడా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించడం కోసమే చేపట్టిన ప్రాజెక్ట్. మొత్తం మీద కృష్ణా ప్రాజెక్టులకు నీళ్లు సరిపోవడం లేదు. అందుకే గోదావరి జలాలు తరలించాల్సి వస్తోంది. ఇది బృహత్తర సాధక ప్రాజెక్ట్. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు 80 వేల కోట్లు అవసరం అవుతుందని అంచనా. దీనికోసం కేంద్రం సాయం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇది జరుగాలంటే 80 వేల కోట్లు కావాలి. అది కూడా ప్రస్తుత అంచనా. నిజంగా ప్రాజెక్ట్ పేపర్ మీద నుంచి ప్లానింగ్ దశ నుంచి వర్క్ దశకు వస్తే లక్ష కోట్లకు చేరుతుంది. 54 వేల ఎకరాల భూమి ఈ ప్రాజెక్ట్ కారణంగా రైతులు లేదా భూయజమానులు కోల్పోవాల్సి ఉంటుంది. రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి 54 వేల ఎకరాల మేర జనం త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 4 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. కాలువలు, టన్నెళ్లు, బ్యారేజీలు ఇంకా ఎన్నో నిర్మించాల్సి ఉంటుంది.
సరే, పెద్ద కలలు కనకపోతే ఎదగలేము. నిజమే. కానీ గ్రౌండ్ రియాలిటీ కూడా చూడాలి కదా. పోలవరం ప్రాజెక్ట్ దశాబ్దాలుగా వార్తల్లో ఉంది. వైఎస్ హయాంలో వేగం అందుకుంది. వైఎస్ తర్వాత మూడు ప్రభుత్వాలు వచ్చాయి, దాదాపు మరో దశాబ్దంన్నర గడిచినా ఇంకా నిర్మాణంలోనే ఉంది. ఏటా అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. దానికి కూడా కేంద్రం అలా అలా కొంచెం కొంచెం నిధులు ఇస్తోంది. అలాంటప్పుడు ఇప్పుడు మరో లక్ష కోట్ల ప్రాజెక్ట్ సాధ్యమా? అన్నది కామన్ మాన్‌కు అనుమానంగా ఉంటుంది. ఐదేళ్ల తర్వాత ఈ బ్యానర్ వార్త అలాగే ఉంటే వేరు, కాస్తైనా కదలిక వస్తే మరీ మేలు.
రెండున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కాదురా. ఏడున్నర లక్ష ఎకరాలు. రెండు పంటలు. 24.5 లక్షల ఎకరాల స్థిరీకరణ. 80 లక్షల మందికి తాగు నీరు. బోర్ల నీరు కాదు. నదుల నుండి. కావలసింది 47,999 ఎకరాలు. 54 వేల ఎకరాలు కాదు. వెనుకబడిన రాయలసీమ లో స్థిరీకరణ. ప్రకాశం, నెల్లూరులలో కొత్త ఆయకట్టు. కండలేరు లో మూడున్నర లక్షల ఎకరాల తెలుగు గంగ ఆయకట్టు రెండు పంటలూ స్థిరీకరణ. లాభాలు తగ్గించి ఖర్చులు పెంచి చూపడం. సిగ్గునడాలి.