నాన్చివేత‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

త‌మ‌కు వాద‌న‌లు వినిపించేందుకు మూడు రోజుల స‌మ‌యం కావాల‌ని స్పీకర్ త‌ర‌పున న్యాయ‌వాది అభ్య‌ర్థించారు.

కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై‌పై అన‌ర్హ‌త వేటు వేసేందుకు తెలంగాణ స్పీక‌ర్ నాన్చివేత ధోర‌ణి ప్ర‌ద‌ర్శించ‌డంపై సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పార్టీ మారి ప‌ది నెల‌ల‌వుతోంద‌ని, ఇంకెంత స‌మ‌యం కావాల‌ని నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఫిరాయించ‌డంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిష‌న్లు దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, జ‌స్టిస్ వినోద్ చంద్ర‌న్ ధ‌ర్మాస‌నం సోమ‌వారం విచారించింది. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పార్ల‌మెంట‌రీ ప్ర‌క్రియ‌ను ప్ర‌స్ట్రేష‌న్‌కు గురి చేయొద్ద‌ని ధ‌ర్మాస‌నం స్పీక‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది ముకుల్ రోహిత్గీకి హిత‌వు చెప్పింది. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో పార్టీల‌కు హ‌క్కులుంటాయ‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం గుర్తు చేసింది. ఎమ్మెల్యేలు పార్టీ మారి 10 నెల‌ల‌వుతోందని, అన‌ర్హ‌త వేటు వేసేందుకు ఇది రీజ‌న‌బుల్ టైమ్ కాదా? అని ప‌రోక్షంగా సుప్రీం నిల‌దీసింది.

త‌మ‌కు వాద‌న‌లు వినిపించేందుకు మూడు రోజుల స‌మ‌యం కావాల‌ని స్పీకర్ త‌ర‌పున న్యాయ‌వాది అభ్య‌ర్థించారు. ఇదే సంద‌ర్భంగా బీఆర్ఎస్ త‌ర‌పు వాద‌న‌లు వినిపిస్తూ… సుప్రీంకోర్టు గ‌తంలో ఇచ్చిన తీర్పుల ప్ర‌కారం రీజ‌న‌బుల్ టైమ్ అంటే మూడు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే అని పేర్కొన్నారు. రీజ‌న‌బుల్ టైమ్ అంటే ఎంత కాల‌మ‌ని ధ‌ర్మాస‌నం స్పీక‌ర్ త‌ర‌పు న్యాయ‌వాదిని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో 18వ తేదీకి విచార‌ణ‌ను వాయిదా వేసింది.

5 Replies to “నాన్చివేత‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం”

  1. గతంలో 5 సంవత్సరాలు ఇదే పనిని నాన్చితే నిద్ర నటించిన వారు ఇప్పుడు లేచినట్లు ఉన్నారు

  2. Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

Comments are closed.