ఆయన గురించి ఒకటే చర్చ

“బొత్స జనసేనలో చేరుతారు” అన్న టాక్ ఎంత బలంగా ఉందో, “వైసీపీలోనే ఉంటారు” అన్నది కూడా అంతే బలంగా ఉంది.

ఆయన గురించి ఒకటే చర్చ సాగుతోంది. విజయనగరంలో దశాబ్దాల రాజకీయం చూసిన నాయకుడు ఆయన. ఆయన రాజకీయం, ఎత్తులు, వ్యూహాలు అన్నీ జిల్లా ప్రజలకు ఎరుకే. అందుకే ఆయన గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

వైసీపీలోని పెద్ద లీడర్లలో ఒకరుగా ఉన్న బొత్స సత్యనారాయణకు అక్కడ గౌరవ మర్యాదలకు కొదవ ఏమీ లేదు. ఆయన అయిదేళ్లు పాటు వైసీపీలో పూర్తి కాలం మంత్రిగా కీలకమైన శాఖలు చూశారు. వైసీపీ ఘోర ఓటమి చెందినా, ఆయనకు వెంటనే ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఆ వెంటనే కేబినెట్ ర్యాంక్ హోదాతో కూడిన శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడి పదవి లభించింది. 2028 వరకూ ఈ రెండు పదవులకూ ఢోకా అయితే లేదు.

అయితే, ఆయన జనసేన అధినేత పవన్‌తో సాన్నిహిత్యం నెరపడంతోనే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. సామాజిక వర్గ పరంగా సమీకరణలు సరిపోవడం, రాజకీయంగా వాతావరణం కాస్త భిన్నంగా ఉండడంతో, బొత్స వంటి వారు ఏమైనా కొత్త వ్యూహాలు వేస్తున్నారా? అన్నదే ఆ చర్చ.

బొత్స సత్యనారాయణకు వైసీపీలో బాగానే ప్రాధాన్యత ఉంది. అధికార కూటమి కూడా ఆయన విషయంలో పెద్దగా దూకుడుగా పోదని జిల్లాలో టాక్ ఉంది. అయినా ఆయన సేఫ్ సైడ్ చూసుకునేందుకు ఈ విధంగా జనసేన అధినేతతో కరచాలనాలు చేస్తున్నారా? అని అనుకుంటున్నారు.

పవన్‌తో భేటీకి అపాయింట్మెంట్ బొత్స అడిగిన దగ్గర నుంచి ఈ చర్చ మరింత ఎక్కువ అయింది. నిజంగా ఈ భేటీ జరిగితే మరెంత రచ్చ అవుతుందో తెలియదు అని అంటున్నారు. బొత్స విషయాన్ని బాగా తెలిసిన వారు చెప్పే మాట ఏమిటంటే, “ఆయన వైసీపీని వీడరు” అని. ఆయనకు ప్రస్తుతానికి ఆ అవసరం లేదు అని.

కాకపోతే, రాజకీయాల్లో రేపులు మాపులు ఎప్పుడూ అసలు కథను మార్చేస్తూనే ఉంటాయి. అందువల్లనే బొత్స వంటి వారి మీద కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. సత్తిబాబు సత్యమే చెబుతారని, ఆయన చెప్పిందే చేస్తారని జిల్లాలో అనుకునే మాట. అందువల్ల సత్తిబాబు ఏమి చేసినా ఒక పద్ధతి, వ్యూహం అన్నీ ఉంటాయి.

ఇక వైసీపీ వారు అయితే ఇప్పుడు ఏమీ కలవరం, కంగారు పడాల్సిన పని లేదు. కానీ “రేపటి అనే రోజు మీద మాత్రం అలా కన్నేసి ఉంచడం బెటర్” అని జిల్లాలో అనుకుంటున్నారు. “బొత్స జనసేనలో చేరుతారు” అన్న టాక్ ఎంత బలంగా ఉందో, “వైసీపీలోనే ఉంటారు” అన్నది కూడా అంతే బలంగా ఉంది. ఇప్పటికైతే సత్తిబాబు ఫ్యాన్ నీడలోనే చల్లగా, తన కేబినెట్ హోదాతో హాయిగా ఉన్నారని అంటున్నారు.

14 Replies to “ఆయన గురించి ఒకటే చర్చ”

  1. బొంగులొ హోదాలు..ఆయన చూడనివా?మేటర్ ఏంటంటే యాపారాలు..అనుమతులు.. తనిఖీలు. ..పెనాల్టీలు…ఇవి వాళ్ళు చూసు కొనేది. Btw, ధర్మాన.. అల్ సెట్ to బీజేపీ అట?నీ దాకా రాలేదా??

    1. పెద్దిరెడ్డి రెడ్డి ఫ్యామిలీ బీజేపీ లో కర్చీఫ్ వేసారంట కదా! అక్కడనుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ అట.

      1. ఇది మాత్రం దారుణం. పెద్దిరెడ్డి, విసారే చంద్రబాబు నీ బాగా హర్రాస్ చేశారు. బీజేపీ లో జాయిన్ అవ్వడం అంటే కూటమి లో ఉండటం అనేగా. ఇప్పటి వరకు చంద్ర బాబు కోసం పోరాడిన వాళ్లను వెధవలు చేసినట్టేగా.

  2. అందగాళ్లు పోతమంటే బుజ్జగించి డిమాండ్స్ తీర్చి, బైటకి పోకుండా చూసుకుంటాడు కానీ బొచ్చు..పెద్ద అందగాడు కాదు, భూతుకారి కాదు కనీసం మాటకారి కూడా కాదు.. మాట్లాడితే అసలు అర్థమయ్యి చావదు.. ఇంకెందుకు లేటూ.. దె0గేయ్ రా నత్తి నా’కొడకా

  3. మొదట లీకులు ఇస్తారు. తరువాత దానిని ఖండిస్తారు, ఒక మంచిరోజు చూసుకొని జంప్ అవుతారు. ఎంతమంది రాజకీయ నాయకులను చూడలేదు. అసలు ఈయన మీద MLC ఎన్నికలలో కూటమి అభ్యర్థిని పోటీ పెట్టకపోయిన రోజే జంప్ ఫిక్స్ అయిందంటున్నారు. ఉత్తరాంధ్ర కూటమి నాయకుల ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబు పోటీ వద్దనన్నాడు. అర్ధం అయిందా స్ట్రాటజీ ఏంటో GA ?

  4. ఫ్యాన్ గాలి కంటే ఏ సీ గాలి చల్ల గా ఉంటుందని తెలుసు కున్నాడేమో

  5. పీసీసీ ప్రెసిడెంట్ గా మనల్ని చెడ తిట్టినా అది పద్దతి వ్యూహం ప్రకారమే చేశారు అంటావ్ …

Comments are closed.