జ‌గ‌న్ మ‌నిషి అనే ముద్ర నుంచి బ‌య‌ట ప‌డేందుకు.. తంటాలు!

వైసీపీ, ఆ పార్టీ అధినేత‌పై సోము వీర్రాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల వెనుక‌, ఆయ‌న భ‌యం ఏంటో అంద‌రికీ తెలుసు.

బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైఎస్ జగ‌న్‌ మ‌నిషి అనే బ‌ల‌మైన ముద్ర వుంది. బీజేపీలో రెండు వ‌ర్గాలున్నాయ‌ని, టీడీపీ, వైసీపీ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాలుగా ఆ పార్టీ నాయ‌కులు చీలిపోయార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. టీడీపీని, చంద్ర‌బాబును తీవ్రంగా విమ‌ర్శించే సోము వీర్రాజుకు ఇటీవ‌ల ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కింది. వీర్రాజుకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌డం టీడీపీకి, ఆ పార్టీని అభిమానించే మీడియాకు అస‌లు గిట్ట‌డం లేదు. ఇదంతా చంద్ర‌బాబుకు చెక్ పెట్టేందుకే అనే మాట వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న పార్టీపై సోము వీర్రాజు ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. వీర్రాజు స‌మ‌క్షంలో వైసీపీకి చెందిన కొంద‌రు బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ వైసీపీకి ఖాళీ చేయ‌డ‌మే కూట‌మి ల‌క్ష్య‌మ‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చేస్తామ‌ని వీర్రాజు శ‌ప‌థం చేశారు.

గ‌తంలో 60కి పైగా అసెంబ్లీ సీట్లు వ‌చ్చిన‌పుడు కూడా జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్ల‌లేద‌న్నారు. ఇప్పుడు ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌లేద‌న్నారు. లేని హ‌క్కు కోసం జ‌గ‌న్ ప‌ట్టుబ‌డుతున్నార‌ని వీర్రాజు విమ‌ర్శించారు. జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చి వుంటే, అభివృద్ధి ఆగిపోయేద‌న్నారు.

వైసీపీ, ఆ పార్టీ అధినేత‌పై సోము వీర్రాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల వెనుక‌, ఆయ‌న భ‌యం ఏంటో అంద‌రికీ తెలుసు. ఎలాగైనా జ‌గ‌న్ మ‌నిషి అనే మనిషి అనే రాజ‌కీయ ముద్ర నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వీర్రాజు తంటాలు ప‌డుతున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

9 Replies to “జ‌గ‌న్ మ‌నిషి అనే ముద్ర నుంచి బ‌య‌ట ప‌డేందుకు.. తంటాలు!”

  1. వాడు ఒక వెధవ అని అందరికీ తెలుసు మీకు తెలుసో లేదో నాకు తెలియదు. అటువంటి వెదవ గురించి రాసేవాడు వాని కన్నా వెధవైన వాడే రాస్తాడు

    మరి నువ్వు వెధవ లేకపోతే వెధవన్నర వెధవ నువ్వే తేల్చుకో రా గ్యాస్ ఆంధ్ర

Comments are closed.