ఆ ఇద్దరిని దూరం పెట్టిన పవన్?

పవన్ ఎప్పుడు దగ్గరకు తీసుకుంటారో, ఎప్పుడు దూరం పెడతారో, అదీ ఎందువల్లనో కూడా ఎవరికీ తెలియదు.

టాలీవుడ్ జనాల్లో కొందరు 2024 ఎన్నికల టైమ్‌లో జనసేన అధిపతి పవన్ వెంట నడించిన వారు పలువురు ఉన్నారు. ఇప్పుడు వీళ్లంతా మౌనంగా నిట్టూరుస్తున్నారని వినిపిస్తోంది. ముఖ్యంగా కీలకమైన ఇద్దరు సైలెంట్ అయిపోయారు. పార్టీ పనులు ఎలాగూ లేవు. పవన్ కూడా పిలవడం లేదు, కలవడం లేదు. అపాయింట్‌మెంట్లు అసలే లేవు. దాంతో తాము తప్పు చేసామనో, తప్పు తమదే అనో ఆలోచనతో బాధపడుతున్నారు.

పవన్‌కు ఇష్టమైతే దగ్గరకు తీసుకుంటారు, లేదంటే దూరం పెడతారు. ఇది ఇండస్ట్రీలో చాలా మంది అనుభవమే. పవన్ ఎప్పుడు దగ్గరకు తీసుకుంటారో, ఎప్పుడు దూరం పెడతారో, అదీ ఎందువల్లనో కూడా ఎవరికీ తెలియదు. ఒకప్పుడు పవన్ మనుషులు అనుకున్నవారు ఎందరో దూరమయ్యారు.

టాలీవుడ్‌లో ఓ వ్యక్తిని ఇలాగే దగ్గరకు తీసుకున్నారు. పిలిచారు కదా అని వెళ్లారు. అన్నీ తానై కష్టపడి రేయింబవళ్లు పనిచేశారు. కానీ ఆ తరువాత ఎందుకో దూరం పెట్టారు. ఎవరైనా ఏం చేయగలరు? దూరంగా ఉన్నారు. మళ్లీ కొన్నేళ్ల తరువాత వన్ ఫైన్ మార్నింగ్ కబురు చేశారు. దగ్గరకు తీసారు. కానీ ఏమైందో మళ్లీ దూరం పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరో పెద్దాయన ఉన్నారు టాలీవుడ్‌లో. పవన్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్నికల టైమ్‌లో అన్నీ వదిలేసి కష్టపడ్డారు. దాని ఫలితం కూడా ఆయన పని చేసిన నియోజకవర్గంలో కనిపించింది. కానీ మళ్లీ ఏమైందో పవన్ పట్టించుకోవడం మానేశారు. దాంతో రాజకీయాలు ఇలాగే ఉంటాయని తెలిసి వచ్చింది. తన పని తాను చేసుకుంటున్నారు.

టాలీవుడ్‌లో చాలా మందికి పవన్‌తో ఇంతో అంతో పరిచయాలు ఉన్నాయి. సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతానికి ఒకరు మాత్రమే పవన్ వెంటే ఉన్నారు. గతంలో పవన్‌కు అన్ని పనులు తానే అన్నట్లు చూసిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. పవన్‌కు అధికారం అందింది కాబట్టి తమకు ఏదో ఒక పదవి అందుతుందని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ అవేవీ నెరవేరే సూచనలు కనిపించడం లేదు.

పవన్ జిల్లాల వారీ, నియోజకవర్గాల వారీ ఎక్కువగా పర్యటించకపోవడానికి కారణం కూడా ఇదే అని తెలుస్తోంది. తాను వెళ్తే అందరూ ఆశావహులు తన వెంట పడతారని, పనులు, పదవులు అడుగుతారని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే తనను అడగకుండా, ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వవద్దని పవన్ తన వ్యక్తిగత సిబ్బందిని గట్టిగా వారించడానికి వెనుక ఇదే ఒక కారణం అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

15 Replies to “ఆ ఇద్దరిని దూరం పెట్టిన పవన్?”

    1. Why are you dragging jagan family members always? Irrespective of any party ,one should not use vulgar words against family members.

      Have Some decency. If anybody use abusive language agaist your parets and sisters , will you accept it?

      Atleast now onwards change yourselves.

Comments are closed.