కర్నూలు నుంచి లోకాయుక్త, హెచ్ఆర్సీని అమరావతికి తరలించొద్దని కర్నూలు మేయర్ బీవై రామయ్య, కర్నూలు, నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని కాపాడుకుంటామని వాళ్లు తేల్చి చెప్పారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ రంజిత్‌బాషాకు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం కర్నూలు మేయర్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ రాయలసీమ వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. వైఎస్ జగన్ ఇప్పటికే కర్నూలులో ఏర్పాటు చేసిన సంస్థలను అమరావతికి తరలించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 1953 నుంచి కర్నూలు నష్టపోతూనే వుందన్నారు. టీడీపీ దృష్టిలో రాయలసీమ అంటే త్యాగం చేసేదా? అని ప్రశ్నించారు.
వెనుకబడిన ప్రాంతం కావడంతో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధానిగా నాడు చేశారన్నారు. కేంద్రాన్ని ఒప్పించి లా వర్సిటీని జగన్ కర్నూలుకు తీసుకొచ్చారన్నారు. సీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తామని కర్నూలు మేయర్ హెచ్చరించారు.
రాయలసీమ టీడీపీ ప్రజాప్రతినిధులకు ప్రాంత అభివృద్ధి కంటే, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని విమర్శించారు. కర్నూలుకు హైకోర్టు రావాలని వైసీపీ డిమాండ్ చేయడాన్ని ఆయన చేశారు. చంద్రబాబుకు భయపడి రాయలసీమకు టీడీపీ నేతలు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కలిసొచ్చే పార్టీల్ని కలుపుకుని కర్నూలు నుంచి తరలిస్తున్న కార్యాలయాలను అడ్డుకుంటామన్నారు.
ఆ సంస్తల్లొ అన్ని వర్గాలు పనిచేస్తుంటాయా.. ఉద్యోగ రీత్య అందులోని పనిచేసేందుకు వచ్చే వేరేఊళ్ళోళ్ళకి వసతి సదుపాయాలు ఆ ప్రాంతంలొ కుదురుతాయా…వాళ్ళ వర్గాలకి తప్ప బయటవాళ్ళకి ఇళ్ళు అద్దెకి ఇవ్వరు అనే ప్రచారం అక్కడ ఉంది కదా.. ఇవొక్కటే కాదు ముందు ముందు చాలా సంస్తలు అన్ని వర్గాల వాళ్ళతో కూడి రావొచ్చు…
దళితలకి రెడ్డి కుల ఇళ్లలో అద్దెకి ఇవ్వరు
vc available 9380537747
మానవ హక్కుల ఉల్లంఘన జరిగేది రాయలసీమలోనే కదా..
అక్కడే ఉంటే కేసుల్ని తొందరగా పరిస్కరించుకోవచ్చని(తప్పుదోవ పట్టించొచ్చని) వాళ్ల ఆలోచన కావచ్చు..
ఇక కోస్తాలో వైసీపీ దాదాపు కనుమరుగు అయిపోవటం ఖాయం ఇక మిగిలింది ప్రత్యేక రాయలసీమ ఉద్యమమే దానికి పునాది వేసుకొంటున్నారు కెసిఆర్ ని అడిగితె మంచి సలహాలు ఇస్తాడు
jagan pettada?
yevadabba sommutho pettadu?
maki reddy purush reddy medhavi yekkada?